Infinix Zero 40 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 18 Sep 2024 10:59:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Zero 40 5G: 50MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన జీరో 40 5జీ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-launched-india-50mp-front-camera/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-launched-india-50mp-front-camera/#respond Wed, 18 Sep 2024 10:59:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13576 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్, 12జిబి ర్యామ్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 108ఎంపి రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Infinix Zero 40 5G: 50MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన జీరో 40 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Infinix Zero 40 5G విడుదల
  • 108ఎంపి మెయిన్ కెమెరా
  • డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్, 12జిబి ర్యామ్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 108ఎంపి రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Infinix Zero 40 5G ధర, లభ్యత

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.27,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.30,999 గా పెట్టారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ లభిస్తుంది.

డిస్కౌంట్ తర్వాత, బేస్ మోడల్ రూ.24,999 కి, టాప్ మోడల్ రూ.27,999 కి లభిస్తుంది.

మూవింట్ టైటానియమ్, రాక్ బ్లాక్ మరియు వయొలెట్ గార్డెన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Zero 40 5G సేల్ ప్రారంభమవుతుంది. రిటైల్ ఔట్‌లెట్స్ లో కూడా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Infinix Zero 40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 40 5G లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Zero 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ అందించారు. ఈ ఫోన్ 24జిబి వరకు డైనమిక్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్‌లో అందించారు.

సాఫ్ట్‌వేర్: Infinix Zero 40 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఇన్ఫినిక్స్ యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Infinix Zero 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 20 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Zero 40 5G లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జెమిని ఏఐ అసిస్టెంట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Infinix Zero 40 5G: 50MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన జీరో 40 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-launched-india-50mp-front-camera/feed/ 0
Infinix Zero 40 5G: సెప్టెంబర్ 18న లాంచ్ అవుతోన్న ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-india-launch-date-confirmed-know-details/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-india-launch-date-confirmed-know-details/#respond Wed, 11 Sep 2024 12:33:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=13441 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 18వ తేదీన ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ భారత్ లో విడుదలవ్వనుందని ఇన్ఫినిక్స్ బ్రాండ్ టీజర్ విడుదల చేసింది. Infinix Zero 40 5G ఇండియా లాంచ్ తేదీ […]

The post Infinix Zero 40 5G: సెప్టెంబర్ 18న లాంచ్ అవుతోన్న ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Zero 40 5G లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 18న భారత్‌లో విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 18వ తేదీన ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ భారత్ లో విడుదలవ్వనుందని ఇన్ఫినిక్స్ బ్రాండ్ టీజర్ విడుదల చేసింది.

Infinix Zero 40 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ అవుతోంది.

ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ సేల్ కి వస్తుంది.

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ ఎన్నో ఏఐ ఫీచర్లతో వస్తున్నట్లు ఇన్ఫినిక్స్ కంపెనీ తెలిపింది.

Infinix Zero 40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 40 5G డివైజ్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Zero 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. గేమింగ్ మరియు ఇతర పనులను ఈ చిప్ బాగా హ్యాండిల్ చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Zero 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Zero 40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Infinix Zero 40 5G లో ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి.

The post Infinix Zero 40 5G: సెప్టెంబర్ 18న లాంచ్ అవుతోన్న ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-india-launch-date-confirmed-know-details/feed/ 0
Infinix Zero 40 Series: 108MP కెమెరాతో లాంచైన Zero 40 4G, Zero 40 5G https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-zero-40-5g-globally-launched-know-the-details/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-zero-40-5g-globally-launched-know-the-details/#respond Fri, 30 Aug 2024 15:30:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=13263 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన Zero సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Infinix Zero 40 4G, Infinix Zero 40 5G అనే పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, గోప్రో మోడల్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి వీటి […]

The post Infinix Zero 40 Series: 108MP కెమెరాతో లాంచైన Zero 40 4G, Zero 40 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Zero 40 4జీ, 4జీ విడుదల
  • 144Hz అమోలెడ్ డిస్ప్లే
  • 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన Zero సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Infinix Zero 40 4G, Infinix Zero 40 5G అనే పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, గోప్రో మోడల్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి వీటి ధరలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Zero 40 4G, Zero 40 5G ధరలు

ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ ధరను 399 డాలర్లు (సుమారు రూ.33,500) గా పెట్టారు. ఇన్ఫినిక్స్ జీరో 40 4జీ డివైజ్ ధరను 289 డాలర్లు (సుమారు రూ.24,200) గా నిర్ణయించారు. మార్కెట్‌ను బట్టి, డివైజెస్ ధరలు మారుతాయని కంపెనీ చెప్పింది.

మలేషియాలో ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ వేరియంట్ ధర MYR 1699 (సుమారు రూ.33,000), ఇన్ఫినిక్స్ జీరో 40 4జీ మోడల్ ధర MYR 1,200 (సుమారు రూ.23,300).

కలర్ ఆప్షన్స్: Infinix Zero 40 5జీ వేరియంట్ మూవింగ్ టైటానియమ్, రాక్ బ్లాక్ మరియు వయొలెట్ గార్డెన్ కలర్స్ లో లభిస్తుంది. 4జీ వేరియంట్ బ్లాసమ్ గ్లొ, మిస్టీ ఆక్వా మరియు రాక్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. ఇండియా లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

GoPro Mode: ఈ రెండు ఫోన్లు కూడా గో ప్రో డివైజ్ తో నేరుగా పెయిర్ అవుతాయి. ఫోన్ డిస్ప్లేను స్క్రీన్ ఫుటేజీ మానిటర్ గా వాడుకోవచ్చు. వ్లాగ్స్ చేసే వారికి ఈ ఫోన్లలో ప్రత్యేకంగా వ్లాగ్ మోడ్ కూడా ఇచ్చారు. క్రియేటర్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Infinix Zero 40 5జీ, 4జీ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 40 సిరీస్ ఫోన్లలో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Zero 40 5జీ వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ అందించారు. 4జీ వేరియంట్ లో మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్లు 24జిబి వరకు డైనమిక్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 512జిబి ఇంటర్నల్ స్టోరేజీని అందించారు.

సాఫ్ట్‌వేర్: Infinix Zero 40 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఇన్ఫినిక్స్ యూఐ కస్టమ్ స్కిన్ తో పని చేస్తాయి.

కెమెరా: Infinix Zero 40 ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero 40 సిరీస్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. 5జీ మోడల్ 20 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Zero 40 సిరీస్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జెమిని ఏఐ అసిస్టెంట్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Infinix Zero 40 Series: 108MP కెమెరాతో లాంచైన Zero 40 4G, Zero 40 5G first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-zero-40-5g-globally-launched-know-the-details/feed/ 0
Infinix Zero 40 5G: రివీలైన జీరో 40 5జీ స్పెసిఫికేషన్స్, ధర, ఇమేజెస్.. త్వరలో లాంచ్ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-specs-price-images-revealed-via-global-retailer-website/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-specs-price-images-revealed-via-global-retailer-website/#respond Thu, 22 Aug 2024 09:07:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13112 చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో Zero 40 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Infinix Zero 40 5G మరియు Infinix Zero 40 Pro 5G మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Infinix Zero 40 5G గ్లోబల్ రిటైలర్ వెబ్‌సైట్ లో కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ మరియు ధర వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలు […]

The post Infinix Zero 40 5G: రివీలైన జీరో 40 5జీ స్పెసిఫికేషన్స్, ధర, ఇమేజెస్.. త్వరలో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లాంచ్‌కి సిద్ధంగా ఉన్న Infinix Zero 40 5G
  • గ్లోబల్ రిటైల్ వెబ్‌సైట్ ద్వారా కీలక వివరాలు
  • రివీలైన ధర, పిక్చర్స్, స్పెసిఫికేషన్స్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో Zero 40 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Infinix Zero 40 5G మరియు Infinix Zero 40 Pro 5G మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Infinix Zero 40 5G గ్లోబల్ రిటైలర్ వెబ్‌సైట్ లో కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ మరియు ధర వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Infinix Zero 40 5G ధర, కలర్ ఆప్షన్స్

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ రిటైల్ వెబ్‌సైట్ పై 1699 MYR గా ఉంది. భారతీయ కరెన్సీలో ఇది రూ.32,000 గా ఉంటుంది. ఈ ఫోన్ రాక్ బ్లాక్, మూవింగ్ టైటానియమ్ మరియు వయొలెట్ గార్డెన్ కలర్స్ లో లభిస్తుంది.

Infinix Zero 40 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Infinix Zero 40 5G డివైజ్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Zero 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్ ఉంటుంది. గేమింగ్ మరియు ఇతర పనులను ఈ చిప్ బాగా హ్యాండిల్ చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Zero 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Zero 40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Infinix Zero 40 5G లో ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి.

The post Infinix Zero 40 5G: రివీలైన జీరో 40 5జీ స్పెసిఫికేషన్స్, ధర, ఇమేజెస్.. త్వరలో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-specs-price-images-revealed-via-global-retailer-website/feed/ 0