
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 18వ తేదీన ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ భారత్ లో విడుదలవ్వనుందని ఇన్ఫినిక్స్ బ్రాండ్ టీజర్ విడుదల చేసింది.
Infinix Zero 40 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ అవుతోంది.
ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ సేల్ కి వస్తుంది.
Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ ఎన్నో ఏఐ ఫీచర్లతో వస్తున్నట్లు ఇన్ఫినిక్స్ కంపెనీ తెలిపింది.
Infinix Zero 40 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Infinix Zero 40 5G డివైజ్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: Infinix Zero 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. గేమింగ్ మరియు ఇతర పనులను ఈ చిప్ బాగా హ్యాండిల్ చేస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Infinix Zero 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Infinix Zero 40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
ఇతర ఫీచర్లు: Infinix Zero 40 5G లో ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి.












