Infinix Zero 5G 2023 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:36:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Infinix Zero 5G 2023 https://www.91mobiles.com/telugu/infinix-zero-5g-2023-launched-india-price-specs-availability/ Mon, 06 Feb 2023 05:15:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=4788 Infinix సంస్థ భారత్ లో Infinix Zero 5G 2023 మరియు Infinix Zero 5G 2023 Turbo డివైజెస్ ని లాంచ్ చేసింది. రెండు డివైజెస్ కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. అలాగే వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే ఫోన్లను తీసుకురావడంలో ఇన్ఫినిక్స్ ముందుంటుంది. దీంతో తక్కువ సమయంలోనే జనాల్లో ఇన్ఫినిక్స్ ఫోన్లు బాగా ఆదరణ పొందాయి. ఈ ఆర్టికల్ లో మనం Infinix Zero 5G […]

The post మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Infinix Zero 5G 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వచ్చిన Infinix Zero 5G 2023
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5జీ కనెక్టివిటీ, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

Infinix సంస్థ భారత్ లో Infinix Zero 5G 2023 మరియు Infinix Zero 5G 2023 Turbo డివైజెస్ ని లాంచ్ చేసింది. రెండు డివైజెస్ కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. అలాగే వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే ఫోన్లను తీసుకురావడంలో ఇన్ఫినిక్స్ ముందుంటుంది. దీంతో తక్కువ సమయంలోనే జనాల్లో ఇన్ఫినిక్స్ ఫోన్లు బాగా ఆదరణ పొందాయి. ఈ ఆర్టికల్ లో మనం Infinix Zero 5G 2023 గురించి తెలుసుకుందాం.

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్ తో వచ్చింది. 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి మెయాన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో Infinix Zero 5G 2023 మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Infinix Zero 5G 2023 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Infinix Zero 5G 2023 ధర, లభ్యత

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ ధర రూ.17,999 గా ఉంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. కోరల్ ఆరెంజ్, పెర్లీ వైట్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. స్పెషల్ ఆప్షన్ అయిన ఆరెంజ్ వేరియంట్ వీగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తోంది.

Infinix Zero 5G 2023 స్పెసిఫికేషన్స్

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది.

Infinix Zero 5G 2023 కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Infinix Zero 5G 2023 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తోంది. Infinix Zero 5G 2023 డివైజ్ 199 గ్రాముల బరువు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. కోరల్ ఆరెంజ్, పర్లీ వైట్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

భద్రత కోసం Infinix Zero 5G 2023 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆరెంజ్ వేరియంట్ Ant-Man and the Wasp: Quantumania స్పెషల్ ఎడిషన్ డివైజ్. ఈ స్పెషల్ ఎడిషన్ డివైజ్ తో ఎంసీయూ ఫ్యాన్స్ కి గుడీస్ తో పాటు యాంట్ మ్యాన్ థీమ్డ్ బాక్స్ వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Infinix Zero 5G 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 4 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Zero 5G 2023 https://www.91mobiles.com/telugu/infinix-zero-5g-2023-india-launch-timeline/ Mon, 23 Jan 2023 10:37:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=4603 కొన్ని రోజుల క్రితం భారత్ లో Infinix సంస్థ Infinix Note 12i అనే స్మార్ట్ ఫోన్ ని జనవరి 25 న లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. Infinix Zero 5G 2023 ఫోన్ ని కూడా ఇన్ఫినిక్స్ లాంచ్ చేయనుందని తాజా సమాచారం. Infinix Zero 5G 2023 ఫోన్ ఫిబ్రవరి 4 న లాంచ్ కానుందని తాజాగా ఈ సంస్థ ప్రకటించింది. గతేడాది లాంచైన Infinix Zero 5G ఫోన్ కి ఇది సక్సెసర్ […]

The post ఫిబ్రవరి 4 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Zero 5G 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2022 నవంబర్ లో అనౌన్స్ అయిన Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వస్తోన్న Infinix Zero 5G 2023
  • ఫిబ్రవరి 4 న భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్

కొన్ని రోజుల క్రితం భారత్ లో Infinix సంస్థ Infinix Note 12i అనే స్మార్ట్ ఫోన్ ని జనవరి 25 న లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. Infinix Zero 5G 2023 ఫోన్ ని కూడా ఇన్ఫినిక్స్ లాంచ్ చేయనుందని తాజా సమాచారం. Infinix Zero 5G 2023 ఫోన్ ఫిబ్రవరి 4 న లాంచ్ కానుందని తాజాగా ఈ సంస్థ ప్రకటించింది. గతేడాది లాంచైన Infinix Zero 5G ఫోన్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది.

తన సోషల్ మీడియా చానెల్స్ ద్వారా Infinix కంపెనీ ఫోన్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన చేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix Zero 5G 2023 అమ్ముడవ్వనుంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ పోస్ట్ చేసిన ప్రకటనని చూడండి.

Infinix Zero 5G 2023 ఫోన్ ఇప్పటికే పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉండటం వల్లన, ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏంటో తెలిశాయి. ఓసారి Infinix Zero 5G 2023 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Zero 5G 2023: స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్, హై-రెజ్ ఆడియో సర్టిఫికేషన్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ పర్లీ వైట్, కోరల్ ఆరెంజ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 168.73 మిల్లీ మీటర్ల పొడవు, 76.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 201 గ్రాముల బరువు ఉంటుంది.

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 239 డాలర్లు (సుమారు రూ.19,400) గా ఉంటుంది. భారతీయ మార్కెట్ లో కూడా ఈ ఫోన్ ధర రూ.20,000 లోపే ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 4 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Zero 5G 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix Zero 5G 2023 ధరను ప్రకటించిన కంపెనీ https://www.91mobiles.com/telugu/infinix-zero-5g-2023-price-announced/ Fri, 02 Dec 2022 05:10:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=3815 హైలైట్స్ గత నెలలో లాంచ్ అయిన Infinix Zero 5G 2023 లాంచ్ సమయంలో ధరను ప్రకటించని కంపెనీ, తాజాగా ప్రైస్ రివీల్ చేసిన ఇన్ఫినిక్స్ త్వరలోనే భారత్ లో అందుబాటులోకి రానున్న Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ గత నెలలో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే లాంచ్ సమయంలో కంపెనీ ఈ ఫోన్ యొక్క ధర, లభ్యతను వెల్లడించలేదు. తాజాగా ఈ […]

The post Infinix Zero 5G 2023 ధరను ప్రకటించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గత నెలలో లాంచ్ అయిన Infinix Zero 5G 2023
  • లాంచ్ సమయంలో ధరను ప్రకటించని కంపెనీ, తాజాగా ప్రైస్ రివీల్ చేసిన ఇన్ఫినిక్స్
  • త్వరలోనే భారత్ లో అందుబాటులోకి రానున్న Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ గత నెలలో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే లాంచ్ సమయంలో కంపెనీ ఈ ఫోన్ యొక్క ధర, లభ్యతను వెల్లడించలేదు. తాజాగా ఈ ఫోన్ ధరను సదరు సంస్థ ప్రకటించింది. Infinix Zero 5G 2023 మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

ఇన్ఫినిక్స్ లేటెస్ట్ గా HOT 20 5G ఫోన్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలో సేల్ కి రానున్న Infinix Zero 5G 2023 తో కలిపితే ప్రస్తుతం ఇన్ఫినిక్స్ మూడు 5జీ స్మార్ట్ ఫోన్ లను ఆఫర్ చేస్తోంది.

Infinix Zero 5G 2023 స్పెసిఫికేషన్స్

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ పంచ్ హోల్ డిస్ప్లే ని కలిగి ఉంది. ఇది 1080*2400 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వచ్చింది. ఈ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ రియల్మీ 9 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో+ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది. అయితే, 2022 మోడల్ తో పోల్చితే 2023 జీరో 5జీ మోడల్ లో పెద్దగా తేడాలు ఏమీ లేవు. అయితే ప్రాసెసర్ మాత్రం కొత్త దాన్ని వాడారు.

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉపయోగించారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్ ని 5జిబి వరకు పెంచుకునేందుకు ఇందులో RAM ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ఉంది.

Infinix ZERO 5G 2023 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix ZERO 5G 2023 లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. 60FPS 4కే వీడియో రికార్డింగ్, 960FPS స్లో-మో రికార్డింగ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు.

Infinix ZERO 5G 2023 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix ZERO 5G 2023 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత XOS 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, హై-రెజ్ ఆడియో సర్టిఫికేషన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ ఉంది. n78, n77, n3, n5, n7 వంటి మేజర్ బ్యాండ్స్ తో పాటు ఇంకెన్నో బ్యాండ్స్ కి సపోర్ట్ ఉంది. ఇంకా డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ ఇందులో ఉన్నాయి. పెర్ల్ వైట్, కోరల్ ఆరెంజ్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Infinix ZERO 5G 2023 ధర, లభ్యత

Infinix ZERO 5G 2023 ధరను 239 డాలర్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.19,400 గా ఉంటుంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధర మారవచ్చు. Infinix ZERO 5G 2023 సబ్ మరైన్ బ్లాక్, పర్ల్ వైట్, కోరల్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Infinix Zero 5G 2023 ధరను ప్రకటించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
120Hz ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, Dimensity 1080 చిప్సెట్ తో లాంచ్ అయిన Infinix ZERO 5G 2023 https://www.91mobiles.com/telugu/infinix-zero-5g-2023-launched-specs-features/ Wed, 09 Nov 2022 08:06:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=3329 హైలైట్స్ Infinix ZERO 5G 2022 కి సక్సెసర్ గా వచ్చిన Infinix ZERO 5G 2023 మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ పెర్ల్ వైట్, కోరల్ ఆరెంజ్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ Infinix బ్రాండ్ మెల్లగా తన లైనప్ ని పెంచుకుంటూ పోతోంది. తక్కువ ధరలో […]

The post 120Hz ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, Dimensity 1080 చిప్సెట్ తో లాంచ్ అయిన Infinix ZERO 5G 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Infinix ZERO 5G 2022 కి సక్సెసర్ గా వచ్చిన Infinix ZERO 5G 2023
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • పెర్ల్ వైట్, కోరల్ ఆరెంజ్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్

Infinix బ్రాండ్ మెల్లగా తన లైనప్ ని పెంచుకుంటూ పోతోంది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో కూడిన ఫోన్లను అందిస్తోన్న ఇన్ఫినిక్స్ మార్కెట్ వాటా రోజురోజుకీ పెరుగుతోంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో Infinix ZERO 5G తో జనాల ముందుకు వచ్చిన ఇన్ఫినిక్స్ తాజాగా దీని సక్సెసర్ Infinix ZERO 5G 2023 ని లాంచ్ చేసింది.

Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. కంపెనీ నుంచి ఇది రెండో 5జీ డివైజ్. సింగిల్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇతర మోడల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. Infinix ZERO 5G 2023 ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix ZERO 5G 2023 స్పెసిఫికేషన్స్

Infinix ZERO 5G 2023 డివైజ్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పటికీ, ఇందులో మిడ్-రేంజ్ స్పెసిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఫోన్ రియల్మీ 9 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో+ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది. అయితే, 2022 మోడల్ తో పోల్చితే 2023 జీరో 5జీ మోడల్ లో పెద్దగా తేడాలు ఏమీ లేవు. అయితే ప్రాసెసర్ మాత్రం కొత్త దాన్ని వాడారు.

Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Infinix ZERO 5G 2023 లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్ ని 5జిబి వరకు పెంచుకునేందుకు ఇందులో RAM ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ఉంది.

Infinix ZERO 5G 2023 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix ZERO 5G 2023 లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. 60FPS 4కే వీడియో రికార్డింగ్, 960FPS స్లో-మో రికార్డింగ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు.

Infinix ZERO 5G 2023 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix ZERO 5G 2023 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత XOS 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, హై-రెజ్ ఆడియో సర్టిఫికేషన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ ఉంది. n78, n77, n3, n5, n7 వంటి మేజర్ బ్యాండ్స్ తో పాటు ఇంకెన్నో బ్యాండ్స్ కి సపోర్ట్ ఉంది. ఇంకా డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ ఇందులో ఉన్నాయి. పెర్ల్ వైట్, కోరల్ ఆరెంజ్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర, లభ్యతను ఇంకా కంపెనీ వెల్లడించలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120Hz ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, Dimensity 1080 చిప్సెట్ తో లాంచ్ అయిన Infinix ZERO 5G 2023 first appeared on 91Mobiles Telugu.

]]>