
Infinix సంస్థ భారత్ లో Infinix Zero 5G 2023 మరియు Infinix Zero 5G 2023 Turbo డివైజెస్ ని లాంచ్ చేసింది. రెండు డివైజెస్ కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. అలాగే వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే ఫోన్లను తీసుకురావడంలో ఇన్ఫినిక్స్ ముందుంటుంది. దీంతో తక్కువ సమయంలోనే జనాల్లో ఇన్ఫినిక్స్ ఫోన్లు బాగా ఆదరణ పొందాయి. ఈ ఆర్టికల్ లో మనం Infinix Zero 5G 2023 గురించి తెలుసుకుందాం.
Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్ తో వచ్చింది. 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి మెయాన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో Infinix Zero 5G 2023 మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Infinix Zero 5G 2023 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.
భారత్ లో Infinix Zero 5G 2023 ధర, లభ్యత
Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ ధర రూ.17,999 గా ఉంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. కోరల్ ఆరెంజ్, పెర్లీ వైట్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. స్పెషల్ ఆప్షన్ అయిన ఆరెంజ్ వేరియంట్ వీగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తోంది.
Infinix Zero 5G 2023 స్పెసిఫికేషన్స్
Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది.
Infinix Zero 5G 2023 కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Infinix Zero 5G 2023 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తోంది. Infinix Zero 5G 2023 డివైజ్ 199 గ్రాముల బరువు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. కోరల్ ఆరెంజ్, పర్లీ వైట్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
భద్రత కోసం Infinix Zero 5G 2023 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆరెంజ్ వేరియంట్ Ant-Man and the Wasp: Quantumania స్పెషల్ ఎడిషన్ డివైజ్. ఈ స్పెషల్ ఎడిషన్ డివైజ్ తో ఎంసీయూ ఫ్యాన్స్ కి గుడీస్ తో పాటు యాంట్ మ్యాన్ థీమ్డ్ బాక్స్ వస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











