iPhone 12 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 16 Jul 2023 15:32:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Flipkart Big Saving Days సేల్‌లో iPhone 13 ధర రూ.56,999, Amazon Prime Day సేల్ లో iPhone 12 ధర రూ.52,999; రెండింట్లో ఏది బెస్ట్ డీల్? https://www.91mobiles.com/telugu/iphone-12-iphone-13-deals-flipkart-big-saving-days-amazon-prime-day-sale/ Sun, 16 Jul 2023 15:30:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=7196 అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్ మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ స్పెషల్ సేల్స్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై మంచి డీల్స్ వచ్చాయి. iQOO Neo 7 Pro, iQOO 11 5G, Samsung Galaxy M34 తదితర ఎన్నో ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్, రియల్మీ, షావోమి బ్రాండ్స్ ఫోన్లపై కూడా డీల్స్ ని మనం గమనించవచ్చు. సరే, మీరు గనుక ఐఫోన్ కొనాలని భావిస్తుంటే ఇదే […]

The post Flipkart Big Saving Days సేల్‌లో iPhone 13 ధర రూ.56,999, Amazon Prime Day సేల్ లో iPhone 12 ధర రూ.52,999; రెండింట్లో ఏది బెస్ట్ డీల్? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి iPhone 12, 13 పై బెస్ట్ డీల్స్
  • ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్ పై లభిస్తోన్న iPhone 13
  • అమెజాన్ లో తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్న iPhone 12

అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్ మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ స్పెషల్ సేల్స్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై మంచి డీల్స్ వచ్చాయి. iQOO Neo 7 Pro, iQOO 11 5G, Samsung Galaxy M34 తదితర ఎన్నో ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్, రియల్మీ, షావోమి బ్రాండ్స్ ఫోన్లపై కూడా డీల్స్ ని మనం గమనించవచ్చు. సరే, మీరు గనుక ఐఫోన్ కొనాలని భావిస్తుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే, iPhone 12, iPhone 13 డివైజెస్ పై మంచి డీల్స్ వచ్చాయి.

రూ.52,499 ధరకి అమెజాన్ లో iPhone 12 ని సొంతం చేసుకోవచ్చు. మరోవైపు iPhone 13 ని ఫ్లిప్ కార్ట్ లో రూ.56,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆర్టికల్ లో రెండు డీల్స్ లో ఏది ఉత్తమమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

iPhone 12, iPhone 13 ఆఫర్ వివరాలు

అమెజాన్ లో ప్రస్తుతం iPhone 12 ధర రూ.53,999 గా ఉంది. ఇది 64జిబి వేరియంట్. ఈ ఫోన్ రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనికి తోడు, యూజర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.52,999 కి తగ్గుతుంది. ఇక ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఫోన్ కొంటే ధర రూ.52,499 కి చేరుతుంది.

మరోవైపు, iPhone 13 డివైజ్ 128జిబి మోడల్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.57,999 గా ఉంది. ఈ ఫోన్ రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, పింక్ మరియు స్టార్‌లైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ ధర రూ.56,999 కి లభించనుంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే రూ.2,900 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.55,099 కి చేరుతుంది.

iPhone 12 vs iPhone 13 స్పెసిఫికేషన్స్, పోలిక

రెండు ఫోన్ల మధ్య ధరలో రూ.5,000 వ్యత్యాసం ఉంది. మరి రెండు మోడల్స్ లో ఉన్న హెచ్చుతగ్గులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పైన టేబుల్ లో కనిపిస్తున్న విధంగా, iPhone 13 లో అప్‌గ్రేడ్ కాబడిన ప్రాసెసర్ ఉంది. అలాగే భారీ బ్యాటరీ, రెట్టింపు స్టోరేజీ ఉన్నాయి. ఎస్ఈ వేరియంట్ కాకుండా రెగ్యులర్ సైజ్ ఐఫోన్ ని వాడాలనుకుంటే వారికి iPhone 12 బెస్ట్ ఆప్షన్ అవ్వవచ్చు. అయితే, ధరని బట్టి చూస్తే, iPhone 13 బెటర్ వాల్యూని అందిస్తుంది. అంతేకాదు, ఎక్కువ స్టోరేజీ ఈ ఫోన్ లో లభిస్తోంది. ఈరోజుల్లో స్టోరేజీ ప్రాధాన్యత ఏంటో మీకు తెలిసిందే.

ఇక మీరు గనుక టైట్ బడ్జెట్ లో ఉంటే, అదనంగా రూ.5,000 పెట్టలేకపోతే, అప్పుడు iPhone 12 కి వెళ్తే మంచిది. లేదంటే iPhone 13 ని ఎంచుకోండి.

The post Flipkart Big Saving Days సేల్‌లో iPhone 13 ధర రూ.56,999, Amazon Prime Day సేల్ లో iPhone 12 ధర రూ.52,999; రెండింట్లో ఏది బెస్ట్ డీల్? first appeared on 91Mobiles Telugu.

]]>
తక్కువ ధరలో లభిస్తోన్న APPLE iPhones https://www.91mobiles.com/telugu/apple-iphones-discount-sales-flipkart/ Wed, 21 Sep 2022 14:21:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=2489 హైలైట్స్: ఐఫోన్స్ పై బంపర్ డిస్కౌంట్స్ ప్రకటించిన ఆపిల్ సంస్థ ఎన్నడూ లేని రీతిలో తగ్గిన ఐఫోన్ ధరలు, సంతోషంలో ఐఫోన్ లవర్స్ iPhone 14 లాంచ్ తర్వాత iPhone 11, iPhone 12, iPhone 13 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన ఆపిల్ మీరు కనుక ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే మంచి తరుణం. ఒక రకంగా చెప్పాలంటే, ఇది గోల్డెన్ చాన్స్. ఐఫోన్ 14 లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ iPhone 11, iPhone […]

The post తక్కువ ధరలో లభిస్తోన్న APPLE iPhones first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఐఫోన్స్ పై బంపర్ డిస్కౌంట్స్ ప్రకటించిన ఆపిల్ సంస్థ
  • ఎన్నడూ లేని రీతిలో తగ్గిన ఐఫోన్ ధరలు, సంతోషంలో ఐఫోన్ లవర్స్
  • iPhone 14 లాంచ్ తర్వాత iPhone 11, iPhone 12, iPhone 13 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన ఆపిల్

మీరు కనుక ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే మంచి తరుణం. ఒక రకంగా చెప్పాలంటే, ఇది గోల్డెన్ చాన్స్. ఐఫోన్ 14 లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ iPhone 11, iPhone 12, iPhone 13 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి మొదలయ్యే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఫోన్లను తక్కువలో తక్కువ రూ.19,000 ధరలో సొంతం చేసుకోవచ్చు. ఓసారి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ల ధరలపై లుక్ వేయండి. మీరు సంతోషంలో మునిగి తేలడం ఖాయం. మరి ఆఫర్ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

డిస్కౌంట్ పై Apple iPhone

ఎక్కువ ధర పలికే ఐఫోన్ 14 ని కొనలేకపోతున్నారా? అయితే ఏం బాధపడవద్దు. ఎందుకంటే తక్కువ ధరలో ఐఫోన్ గత మోడల్స్ ని మీరు ఫ్లిప్ కార్ట్ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 23 న ప్రారంభమయ్యే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో ఐఫోన్ మోడల్స్ ని మంచి డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

iPhone 11 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.43,900 గా ఉంది. ఈ ఫోన్ పై రూ.19000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది. అంటే మీ పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా 19 వేలు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో మరింత తక్కువ ధరకు ఐఫోన్ 11 ని సొంతం చేసుకోవచ్చు.

iPhone 12 128జిబి వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం రూ.64,900 గా ఉంది. ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ రూ.19,000 వరకు లభిస్తుంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఫోన్ కొనుగోలు పై 5 శాతం డిస్కౌంట్ పొందుతారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ టైమ్ లో ఈ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

iPhone 13 మరియు iPhone 14 ఫోన్లు డిజైన్ పరంగా దాదాపు ఒకే విధంగా కనిపిస్తాయి. అయితే, రెండు ఫోన్ల ధరలు మాత్రం వేరు. iPhone 13 ధర ప్రస్తుతం రూ.69,900 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో రూ.19,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ లభిస్తోంది. మీ వద్ద ఐఫోన్ 11 ఉంటే మీకు రూ.18 వేలు అంత కంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. దీంతో ఐఫోన్ 13 ధర రూ.50,900 వరకు తగ్గనుంది. మీరు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వరకు వేచి చూస్తే, ఐఫోన్ 13 ధర రూ.20,000 వరకు తగ్గనుంది. తక్కువలో తక్కువ రూ.49,000 కి iPhone 13 ని సొంతం చేసుకోవచ్చని ఇటీవలె ఫ్లిప్ కార్ట్ సూచించింది.

The post తక్కువ ధరలో లభిస్తోన్న APPLE iPhones first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ.40,000 లోపు iPhone 12 https://www.91mobiles.com/telugu/iphone-12-price-drop-bank-discount-amazon-sale/ Mon, 19 Sep 2022 09:05:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=2417 హైలైట్స్: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ.40,000 లోపు ధరలో లభించనున్న iPhone 12 ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కలుపుకుని వస్తున్న డీల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న Amazon Great Indian Festival Sale పండుగ సీజన్ వచ్చేసింది. దీంతో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్స్ మొదలయ్యాయి. మీరు ఏదైనా వస్తువుని కొనాలనుకుంటే గొప్ప తగ్గింపు ధరల్లో వాటిని సొంతం చేసుకోవడానికి […]

The post అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ.40,000 లోపు iPhone 12 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ.40,000 లోపు ధరలో లభించనున్న iPhone 12
  • ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కలుపుకుని వస్తున్న డీల్
  • సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న Amazon Great Indian Festival Sale

పండుగ సీజన్ వచ్చేసింది. దీంతో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్స్ మొదలయ్యాయి. మీరు ఏదైనా వస్తువుని కొనాలనుకుంటే గొప్ప తగ్గింపు ధరల్లో వాటిని సొంతం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. రోజురోజుకీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ సరికొత్త డీల్స్ తో జనాలను ఊరిస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్ ఇండియా ఐఫోన్ పై క్రేజీ డీల్ ని టీజ్ చేసింది.

రానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా, అమెజాన్ ఐఫోన్ 12 ధర రూ.42,999 అంటూ టీజ్ చేసింది. ఆండ్రాయిడ్ కౌంటర్ పార్ట్స్ తో పోల్చితే, ఐఫోన్ 12 ని డీల్ ప్రైస్ తో కొనడం ఎంతో ప్రయోజనకరం. ప్రైస్ డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీంతో ఐఫోన్ 12 ధర రూ.39,999 కి చేరుకుంటోంది. ఇంత తక్కువ ధరలో ఐఫోన్ 12 దొరకడం ఆహ్వానించదగిన విషయం.

 

Amazon లో రూ.40,000 లోపు iPhone 12 ధర

iPhone 12 ధర రూ.40,000 అంటూ అమెజాన్ టీజ్ చేయడం మొదలు పెట్టింది. రానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా అమెజాన్ తన టాప్ డీల్స్ ని షేర్ చేస్తోంది. ఈ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. సేల్ సందర్భంగా ఫోన్ అసలు ధర రూ.42,999 కాగా, రూ.3000 బ్యాంక్ డిస్కౌంట్ తో ఫోన్ ధర రూ.39,999 వరకు తగ్గుతోంది. అయితే, అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ని కూడా అందిస్తుందో లేదో తెలియదు. అది కూడా కలిస్తే, ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

2020 లో iPhone 12 రూ.79,900 ధరతో లాంచ్ అయ్యింది. గతేడాది ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సందర్భంగా iPhone 12 రూ.50,000 ధరలో అందుబాటులో ఉంది. ఒకవేళ అమెజాన్ ప్రస్తుతం iPhone 12 ని రూ.40,000 లోపు ధరకి తీసుకొస్తే, ఇది కచ్చితంగా ఈ సెగ్మెంట్ లో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చితే ఉత్తమ ఎంపిక (Best Buy) అవుతుంది.

iPhone 12 స్పెసిఫికేషన్స్

iPhone 12 లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ సపోర్ట్, నాచ్ డిజైన్, ఫేస్ ఐడీ, సిరామిక్ షీల్డ్ ఉన్నాయి. iPhone 12 లో ఏ14 బయోనిక్ చిప్ అమర్చారు. అలాగే 256జిబి వరకు స్టోరేజీ ఇందులో ఉంటుంది. iPhone 12 ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కలిగి ఉంది. వైర్లెస్ చార్జింగ్ పోర్ట్ ఇందులో ఉంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iPhone 12 లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 12ఎంపి ఓఐఎస్ సెన్సర్ కాగా, రెండోది 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగిన మరొక 12ఎంపి లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 12ఎంపి కెమెరాను అమర్చారు.

The post అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ.40,000 లోపు iPhone 12 first appeared on 91Mobiles Telugu.

]]>
iPhone 14 లాంచ్ తర్వాత భారత్ లో తగ్గిన iPhone 13, iPhone 13 mini, iPhone 12 ధరలు https://www.91mobiles.com/telugu/iphone-13-mini-iphone-12-price-drop-india-iphone-14-launch/ Thu, 08 Sep 2022 13:18:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=2200 హైలైట్స్: భారత్ లో తగ్గిన ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 ధరలు లాంచ్ ప్రైస్ తో పోల్చితే రూ.10,000 తగ్గిన ఐఫోన్ 13 ధర, రూ.20,000 తగ్గిన ఐఫోన్ 12 ధర ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 12 మినీ ఫోన్ ని నిలిపివేసిన ఆపిల్ బుధవారం నాడు ఆపిల్ కంపెనీ ఐఫోన్ 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రీ-ఆర్డర్ చేసేందుకు అవకాశముంది. ఇకపోతే ఐఫోన్ 14 […]

The post iPhone 14 లాంచ్ తర్వాత భారత్ లో తగ్గిన iPhone 13, iPhone 13 mini, iPhone 12 ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో తగ్గిన ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 ధరలు
  • లాంచ్ ప్రైస్ తో పోల్చితే రూ.10,000 తగ్గిన ఐఫోన్ 13 ధర, రూ.20,000 తగ్గిన ఐఫోన్ 12 ధర
  • ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 12 మినీ ఫోన్ ని నిలిపివేసిన ఆపిల్

బుధవారం నాడు ఆపిల్ కంపెనీ ఐఫోన్ 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రీ-ఆర్డర్ చేసేందుకు అవకాశముంది. ఇకపోతే ఐఫోన్ 14 లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 ల ధరలు తగ్గించింది. ఐఫోన్ 14 ఎంట్రీ ఇచ్చాక, ఐఫోన్ 12 మినీ వర్షన్ ని కూడా ఆపిల్ నిలిపివేసింది.

లాంచ్ ప్రైస్ తో పోల్చితే, ఐఫోన్ 13 ధర భారీగా రూ.10,000 తగ్గింది. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో మరింత బెస్ట్ ప్రైస్ ని పొందవచ్చు. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900 కాగా, ఇదే ధరతో రెండేళ్ళ క్రితం ఐఫోన్ 12 కూడా లాంచ్ అయ్యింది. ప్రైస్ డ్రాప్ తర్వాత ఐఫోన్ 12 రూ.59,900 కి లభిస్తోంది. రూ.20,000 భారీ మొత్తం తగ్గడం వల్లన ఈ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్తేనని చెప్పాలి.

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకు లభించే అవకాశముంది. అందుకే మేం చెప్పేదేంటంటే, ఫోన్స్ కొనేముందు కాస్త వేచి చూడటం మంచిది. లీక్ ప్రకారం, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 ఫోన్ల ధరలు ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 13, iPhone 13 mini ప్రైస్ డ్రాప్

ప్రస్తుతం ఐఫోన్ 13 128జిబి ధర రూ.69,900 గా ఉంది. 256జిబి వేరియంట్ ధర రూ.79,900, 512జిబి వేరియంట్ ధర రూ.99,900 గా ఉంది. మరోవైపు ఐఫోన్ 13 మినీ 128జిబి ధర రూ.64,900, 256జిబి యూనిట్ ధర రూ.74,900, 512జిబి వేరియంట్ ధర రూ.94,900 గా ఉంది.

డిస్కౌంట్ తర్వాత భారత్ లో ఐఫోన్ 12 64జిబి వేరియంట్ ధర భారత్ లో రూ.59,900 గా ఉంది. 128జిబి వేరియంట్ ధర రూ.64,900, 256జిబి మోడల్ ధర రూ.64,900 గా ఉంది. ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తర్వాత, ఆపిల్ కంపెనీ ఐఫోన్ 12 మినీ వర్షన్ ని నిలిపివేసింది. ప్రస్తుతం మినీ ఐఫోన్ కొనాలంటే మిగిలిన ఏకైక ఫోన్ ఐఫోన్ 13 మినీ మాత్రమే.

ఐఫోన్ 13 మినీ లో 5.4 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2340*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీ68 మెటల్ బాడీ, 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఏ15 బయోనిక్ చిప్ ఇందులో వాడారు. ఐఫోన్ మినీ ఐఓఎస్ 15 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వైర్లెస్, ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కలిగి ఉంది. ఐఫోన్ 13 మినీ 128జిబి, 256జిబి, 512జిబి వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 13 మినీ లో 5జీ కనెక్టివిటీ ఉంది.

The post iPhone 14 లాంచ్ తర్వాత భారత్ లో తగ్గిన iPhone 13, iPhone 13 mini, iPhone 12 ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>