అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ.40,000 లోపు iPhone 12

హైలైట్స్:

  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ.40,000 లోపు ధరలో లభించనున్న iPhone 12
  • ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కలుపుకుని వస్తున్న డీల్
  • సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న Amazon Great Indian Festival Sale

పండుగ సీజన్ వచ్చేసింది. దీంతో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్స్ మొదలయ్యాయి. మీరు ఏదైనా వస్తువుని కొనాలనుకుంటే గొప్ప తగ్గింపు ధరల్లో వాటిని సొంతం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. రోజురోజుకీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ సరికొత్త డీల్స్ తో జనాలను ఊరిస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్ ఇండియా ఐఫోన్ పై క్రేజీ డీల్ ని టీజ్ చేసింది.

రానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా, అమెజాన్ ఐఫోన్ 12 ధర రూ.42,999 అంటూ టీజ్ చేసింది. ఆండ్రాయిడ్ కౌంటర్ పార్ట్స్ తో పోల్చితే, ఐఫోన్ 12 ని డీల్ ప్రైస్ తో కొనడం ఎంతో ప్రయోజనకరం. ప్రైస్ డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీంతో ఐఫోన్ 12 ధర రూ.39,999 కి చేరుకుంటోంది. ఇంత తక్కువ ధరలో ఐఫోన్ 12 దొరకడం ఆహ్వానించదగిన విషయం.

 

Amazon లో రూ.40,000 లోపు iPhone 12 ధర

iPhone 12 ధర రూ.40,000 అంటూ అమెజాన్ టీజ్ చేయడం మొదలు పెట్టింది. రానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా అమెజాన్ తన టాప్ డీల్స్ ని షేర్ చేస్తోంది. ఈ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. సేల్ సందర్భంగా ఫోన్ అసలు ధర రూ.42,999 కాగా, రూ.3000 బ్యాంక్ డిస్కౌంట్ తో ఫోన్ ధర రూ.39,999 వరకు తగ్గుతోంది. అయితే, అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ని కూడా అందిస్తుందో లేదో తెలియదు. అది కూడా కలిస్తే, ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

2020 లో iPhone 12 రూ.79,900 ధరతో లాంచ్ అయ్యింది. గతేడాది ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సందర్భంగా iPhone 12 రూ.50,000 ధరలో అందుబాటులో ఉంది. ఒకవేళ అమెజాన్ ప్రస్తుతం iPhone 12 ని రూ.40,000 లోపు ధరకి తీసుకొస్తే, ఇది కచ్చితంగా ఈ సెగ్మెంట్ లో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చితే ఉత్తమ ఎంపిక (Best Buy) అవుతుంది.

iPhone 12 స్పెసిఫికేషన్స్

iPhone 12 లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ సపోర్ట్, నాచ్ డిజైన్, ఫేస్ ఐడీ, సిరామిక్ షీల్డ్ ఉన్నాయి. iPhone 12 లో ఏ14 బయోనిక్ చిప్ అమర్చారు. అలాగే 256జిబి వరకు స్టోరేజీ ఇందులో ఉంటుంది. iPhone 12 ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కలిగి ఉంది. వైర్లెస్ చార్జింగ్ పోర్ట్ ఇందులో ఉంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iPhone 12 లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 12ఎంపి ఓఐఎస్ సెన్సర్ కాగా, రెండోది 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగిన మరొక 12ఎంపి లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 12ఎంపి కెమెరాను అమర్చారు.

Previous articleVivo Y52T బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన Vivo
Next articleలాంచ్ అయిన Vivo Y32t స్మార్ట్ ఫోన్: ధర, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.