iPhone 14 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Sep 2024 16:10:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/ https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/#respond Tue, 10 Sep 2024 16:09:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13422 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న […]

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐఫోన్ 16 సిరీస్ విడుదల
  • పాత మోడల్స్ ధర తగ్గింపు
  • రూ.10,000 వరకు బెనిఫిట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మరి, ఆ ధర తగ్గింపు వివరాలేంటో తెలుసుకుందామా?

పాత ఐఫోన్ మోడల్స్ పై రూ.10,000 వరకు తగ్గింపు

ఐఫోన్ 14, 15 సిరీస్ లోని 128జిబి, 256జిబి మరియు 512జిబి మోడల్స్ పై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ ధరతో పోల్చితే పదివేలు తక్కువగా లభిస్తుండటం మంచి విషయం. తగ్గిన ధరల వివరాలను క్రింద టేబుల్ లో అందిస్తున్నాం.

గమనిక: ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లలో ధరలు వేరుగా ఉండవచ్చు.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్ల నిలిపివేత

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లను ఆపిల్ తన వెబ్‌సైట్ నుంచి తొలగించింది. భారత్ లోనే అసెంబ్లింగ్ అవ్వడం వల్లన, లేటెస్ట్ ఫోన్లైన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ల ధరలు 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ కంటే రూ.15,000 తక్కువ. దీంతో గత మోడల్స్ ను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసింది.

ఐఫోన్ 15 లేదా పాత మోడల్స్ ఇప్పుడు కొనవచ్చా?

ఐఫోన్ 15 సిరీస్ కు 2028 వరకు అప్డేట్స్ లభిస్తాయి. కాబట్టి, ఇప్పుడు వీటిని కొంటే లాభమే తప్ప నష్టం లేదు. అంతకు ముందు వచ్చిన ఐఫోన్ 14 సిరీస్ విషయానికి వస్తే, ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే, ప్లస్ వేరియంట్ కొంటే బెటర్. ఎందుకంటే, పెద్ద స్క్రీన్ మరియు ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.

ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.

కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సాధారణ వినియోగానికి ఈ బ్యాటరీ సరిపోయే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/feed/ 0
Apple iPhone 14: ఆపిల్ ఐఫోన్ 14 పై రూ.11,500 పైగా తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-14-discount-more-than-rs-11500-know-full-details/ https://www.91mobiles.com/telugu/iphone-14-discount-more-than-rs-11500-know-full-details/#respond Fri, 16 Aug 2024 12:48:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=13025 ప్రముఖ టెక్ బ్రాండ్ Apple నుంచి వచ్చిన iPhone 14 ప్రస్తుతం చవకగా లభిస్తోంది. ఆపిల్ సంస్థ తరచూ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఆఫర్ వచ్చేసింది. ఈసారి iPhone 14 పై రూ.11,500 కి పైగా డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఐఫోన్ 14 తక్కువ ధరకే కస్టమర్లకు లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. iPhone 14 డిస్కౌంట్స్, ఆఫర్లు ఆపిల్ iPhone 14 ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ […]

The post Apple iPhone 14: ఆపిల్ ఐఫోన్ 14 పై రూ.11,500 పైగా తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 14 పై డిస్కౌంట్
  • రూ.11,601 ప్రయోజనం
  • ఫ్లిప్‌కార్ట్‌పై ఆఫర్

ప్రముఖ టెక్ బ్రాండ్ Apple నుంచి వచ్చిన iPhone 14 ప్రస్తుతం చవకగా లభిస్తోంది. ఆపిల్ సంస్థ తరచూ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఆఫర్ వచ్చేసింది. ఈసారి iPhone 14 పై రూ.11,500 కి పైగా డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఐఫోన్ 14 తక్కువ ధరకే కస్టమర్లకు లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iPhone 14 డిస్కౌంట్స్, ఆఫర్లు

ఆపిల్ iPhone 14 ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.57,999 కి అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ పై 16 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అంటే వినియోగదారులకు రూ.11,601 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ధర 128జిబి మెమొరీ వేరియంట్ కి వర్తిస్తుంది.

ఆపిల్ వెబ్‌సైట్ లో iPhone 14 ధర ఇంకా రూ.69,600 గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్ గురించి మాట్లాడితే, 5 శాతం వరకు తగ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో పాటు, మీ పాత ఫోన్ మార్చుకుంటే, రూ.50,000 కు పైగా ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే, మీ పాత ఫోన్ కండిషన్‌ను బట్టి మీకు బోనస్ లభిస్తుంది.

iPhone 14 డివైజ్ ను యూజర్లు రెడ్, బ్లూ, మిడ్నైట్, పర్పుల్, స్టెరిలైట్ మరియు యెల్లో కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

iPhone 14 256జిబి మోడల్ 14 శాతం డిస్కౌంట్ తో ప్రస్తుతం రూ.67,999 కి లభిస్తోంది. 512జిబి స్టోరేజీ వేరియంట్ 19 శాతం డిస్కౌంట్ తో రూ.79,999 కి లభిస్తోంది.

iPhone 14 కొనవచ్చా?

iPhone 14 స్మార్ట్‌ఫోన్ 2023 లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఆపిల్ లేటెస్ట్ సిరీస్ iPhone 15 మార్కెట్ లో అందుబాటులో ఉంది. iPhone 14 విడుదలై ఏడాదైంది. అయితే పెర్ఫామెన్స్, కెమెరా మరియు బ్యాటరీ పరంగా చూస్తే ఈ ఫోన్ ఎందులోనూ తక్కువ కాదు. మరోవైపు, ఐఫోన్ 15 కూడా పెద్దగా అప్‌గ్రేడ్స్ తో రాలేదు. కాబట్టి, మీరు iPhone 14 ను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

iPhone 14 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 14 లో 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్, 1200 నిట్స్ బ్రైట్నెస్, ఫేస్ ఐడీ సెన్సర్ ఉన్నాయి.

ప్రాసెసర్: iPhone 14 డివైజ్ లో ఏ15 బయోనిక్ ప్రాసెసర్ ను వాడారు.

ర్యామ్, స్టోరేజీ: iPhone 14 డివైజ్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: iPhone 14 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి వైడ్ యంగిల్ ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

సాఫ్ట్‌వేర్: iPhone 14 స్మార్ట్‌ఫోన్ ఐఓఎస్ 17 ఓఎస్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: iPhone 14 లో 5జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ మరియు లైట్నింగ్ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.

The post Apple iPhone 14: ఆపిల్ ఐఫోన్ 14 పై రూ.11,500 పైగా తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-14-discount-more-than-rs-11500-know-full-details/feed/ 0
iPhone: రూ.60,000 లోపు ధరలో లభిస్తోన్న iPhone 14 https://www.91mobiles.com/telugu/iphone-14-available-under-rs-60000-price/ Sat, 04 May 2024 18:27:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=11357 అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రస్తుతం ప్రైమ్ మరియు నాన్-ప్రైమ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై డీల్స్ మరియు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో iPhone 14 పై కూడా అద్భుతమైన ఆఫర్ అందిస్తున్నారు. రూ.59,000 లోపే ఐఫోన్ 14 ని సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. iPhone 14 అమెజాన్ డీల్ iPhone […]

The post iPhone: రూ.60,000 లోపు ధరలో లభిస్తోన్న iPhone 14 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్‌పై iPhone 14 ధర రూ.58,999
  • బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.2000 డిస్కౌంట్
  • రెడ్, బ్లాక్, బ్లూ మరియు పర్పుల్ కలర్స్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రస్తుతం ప్రైమ్ మరియు నాన్-ప్రైమ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై డీల్స్ మరియు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో iPhone 14 పై కూడా అద్భుతమైన ఆఫర్ అందిస్తున్నారు. రూ.59,000 లోపే ఐఫోన్ 14 ని సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

iPhone 14 అమెజాన్ డీల్

iPhone 14 128జిబి మోడల్ ప్రస్తుతం రూ.58,999 కి లభిస్తోంది. ఐఫోన్ 14 లాంచ్ ధర రూ.79,990 గా ఉంది.

అంతేకాదు, iPhone 14 పై ఐసీఐసీఐ లేదా వన్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల ద్వారా రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది.

దీంతో iPhone 14 ధర రూ.56,999 కి చేరుతుంది. మొత్తం పేమెంట్ ఒకేసారి చేస్తే రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

iPhone 14 స్మార్ట్‌ఫోన్ రెడ్, బ్లాక్, బ్లూ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iPhone 14 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 14 లో 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్, హెచ్డీఆర్, 1200 నిట్స్ బ్రైట్నెస్, ఫేస్ ఐడీ సెన్సర్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iPhone 14 లో ఏ15 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

స్టోరేజీ: iPhone 14 డివైజ్ 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.

ఓఎస్: iPhone 14 డివైజ్ ఐఓఎస్ 16 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: iPhone 14 లో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, లైట్నింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post iPhone: రూ.60,000 లోపు ధరలో లభిస్తోన్న iPhone 14 first appeared on 91Mobiles Telugu.

]]>
iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు https://www.91mobiles.com/telugu/iphone-old-models-price-drop-after-iphone-15-launch/ Wed, 13 Sep 2023 14:33:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=8003 చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు Apple సంస్థ తన iPhone 15 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ లైనప్ లో భాగంగా 4 మోడల్స్ ని తీసుకొచ్చింది. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. కొత్త లైనప్ రాకతో, కంపెనీ పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మొత్తం 6 ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మోడల్, పాత […]

The post iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • భారీగా తగ్గిన పాత ఐఫోన్ మోడల్స్ ధరలు

చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు Apple సంస్థ తన iPhone 15 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ లైనప్ లో భాగంగా 4 మోడల్స్ ని తీసుకొచ్చింది. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. కొత్త లైనప్ రాకతో, కంపెనీ పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మొత్తం 6 ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మోడల్, పాత ధర, కొత్త ధర, ఎంత వ్యత్యాసం.. తదితర వివరాలను మీకోసం టేబుల్ వేసి వివరంగా అందించాం. చదివి తెలుసుకోండి.

తగ్గిన పాత ఐఫోన్ల ధరలు

మోడల్ లాంచ్ ధర కొత్త ధర తేడా
iPhone 13 128gb రూ.69,900 రూ.59,900 రూ.10,000
iPhone 13 256gb రూ.79,900 రూ.69,900 రూ.10,000
iPhone 13 512gb రూ.99,900 రూ.89,900 రూ.10,000

మోడల్ లాంచ్ ధర కొత్త ధర తేడా
iPhone 14 128gb రూ.79,900 రూ.69,900 రూ.10,000
iPhone 14 256gb రూ.89,900 రూ.79,900 రూ.10,000
iPhone 14 512gb రూ.1,09,900 రూ.99,900 రూ.10,000

మోడల్ పాత ధర కొత్త ధర తేడా
iPhone 14 Plus 128gb రూ.89,900 రూ.79,900 రూ.10,000
iPhone 14 Plus 256gb రూ.99,900 రూ.89,900 రూ.10,000
iPhone 14 Plus 512gb రూ.1,19,900 రూ.1,09,900 రూ.10,000

భారత్ లో రద్దైన పాత ఐఫోన్ మోడల్స్

  • iPhone 14 Pro Max 128GB
  • iPhone 14 Pro Max 256GB
  • iPhone 14 Pro Max 512GB
  • iPhone 14 Pro Max 1TB
  • iPhone 14 Pro 128GB
  • iPhone 14 Pro 256GB
  • iPhone 14 Pro 512GB
  • iPhone 14 Pro 1TB
  • iPhone 13 mini 128GB
  • iPhone 13 mini 256GB
  • iPhone 13 mini 512GB
  • iPhone 12 64GB
  • iPhone 12 128GB
  • iPhone 12 256 GB

iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ కొన్ని పాత ఐఫోన్ మోడల్స్ చలామణిని, విక్రయాలను నిలిపివేసింది. అంటే, ఇకపై సంస్థ నుంచి సదరు మోడల్స్ తయారవ్వవు. అలాగే ఆపిల్ అధికార వెబ్‌సైట్ నుంచి వాటిని కొనడం సాధ్యం కాదు. అయితే, స్టాక్స్ అయిపోయేంత వరకు, ఈ ఐఫోన్లు అమెజాన్, ఫ్లి‌ప్‌కార్ట్, రిలయన్స్ వంటి సైట్స్ మరియు స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి.

iPhone 15 సిరీస్ ధర

మోడల్ ధర
iPhone 15 128gb రూ.79,990
iPhone 15 256gb రూ.89,900
iPhone 15 512gb రూ.1,09,900

 

మోడల్ ధర
iPhone 15 Plus 128gb రూ.89,900
iPhone 15 Plus 256gb రూ.99,900
iPhone 15 Plus 512gb రూ.1,09,900

 

మోడల్ ధర
iPhone 15 Pro 128gb రూ.1,34,900
iPhone 15 Pro 256gb రూ.1,44,900
iPhone 15 Pro 512gb రూ.1,64,900
iPhone 15 Pro 1TB రూ.1,84,900

 

మోడల్ ధర
iPhone 15 Pro Max 256gb రూ.1,59,900
iPhone 15 Pro Max 512gb రూ.1,79,900
iPhone 15 Pro Max 1TB రూ.1,99,900

 

The post iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/amazon-great-freedom-festival-sale-2023-best-deals-offers/ Fri, 04 Aug 2023 05:43:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=7464 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నేటి నుంచి మొదలైంది. ఈ సేల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. సేల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్, ఆఫర్స్ లభించనున్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ క్రింద, స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక్కడ మీకోసం ఉత్తమమైన స్మార్ట్ ఫోన్స్ డీల్స్ యొక్క జాబితాను రూపొందించాం. ఓసారి వాటిని పూర్తిగా చదివి మీకు సరిపడే డీల్ ఏదైనా ఉందో లేదో […]

The post Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నేటి నుంచి మొదలైంది. ఈ సేల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. సేల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్, ఆఫర్స్ లభించనున్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ క్రింద, స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక్కడ మీకోసం ఉత్తమమైన స్మార్ట్ ఫోన్స్ డీల్స్ యొక్క జాబితాను రూపొందించాం. ఓసారి వాటిని పూర్తిగా చదివి మీకు సరిపడే డీల్ ఏదైనా ఉందో లేదో చెక్ చేయండి. ఏదైనా ఓకే అనిపిస్తే ఆ ఉత్పత్తిని ఆఫర్ ముగిసే లోపు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి.

OnePlus 11 5G

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ సేల్ లో డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.7-ఇంచ్ క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

అసలు ధర: రూ.56,999
డీల్ ధర: రూ.54,999

Apple iPhone 14

ఈ డిస్కౌంట్ సేల్ సందర్భంగా iPhone 14 ని కూడా తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. iPhone 14 లో ఏ15 బయోనిక్ చిప్, 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 12ఎంపి ప్రైమరీ + 12ఎంపి అల్ట్రావైడ్ రియర్ కెమెరాలు, 12ఎంపి ఫ్రంట్ కెమెరా, 5జీ కనెక్టివిటీ, ఐపీ68 వాటర్ రెసిస్టంట్, గ్లాస్ బ్యాక్ ఉన్నాయి. 6 కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

అసలు ధర: రూ.79,900
డీల్ ధర: రూ.67,499

Samsung Galaxy S20 FE 5G

మీరు గనుక ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Samsung Galaxy S20 FE 5G డివైజ్ ఒకటుంది. సేల్ లో ఈ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy S20 FE 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 1టిబి ఎక్స్‌పాండబుల్ మెమొరీ (మైక్రోఎస్డీకార్డ్ ద్వారా), 12ఎంపి ప్రైమరీ + 8ఎంపి టెలీఫోటో + 12ఎంపి అల్ట్రావైడ్ రియర్ కెమెరాలు, 30ఎక్స్ స్పేస్ జూమ్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.26,999
డీల్ ధర: రూ.24,999

ఆడియో ఉత్పత్తులపై డీల్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఆడియో ప్రొడక్ట్స్ పై మంచి డీల్స్ ఉన్నాయి. OnePlus Bullets Z1 నెక్ బ్యాండ్ ని సేల్ లో రూ.1,599 కే కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy Buds 2 Pro ని డిస్కౌంట్ పై రూ.10,990 కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా OPPO Enco Air 3 Pro వైర్లెస్ ఇయర్‌బడ్స్ ని రూ.4,999 కే కొనుగోలు చేయవచ్చు. pTron Bassbuds Duo ని కేవలం రూ.499 కే కొనుగోలు చేయవచ్చు.

The post Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Apple ని ట్రోల్ చేస్తూ మీమ్ షేర్ చేసిన స్టీవ్ జాబ్స్ కుమార్తె, iPhone 13 లాగే iPhone 14 ఉందని కామెంట్ https://www.91mobiles.com/telugu/steve-jobs-daughter-eve-jobs-trolls-iphone-14/ Fri, 09 Sep 2022 05:50:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=2216 హైలైట్స్: బుధవారం నాడు ఆపిల్ ఈవెంట్ లో లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్, ఆపిల్ స్మార్ట్ వాచెస్, ఎయిర్ పాడ్స్ లాంచ్ ఈవెంట్ తర్వాత ఆపిల్ పై స్టీవ్ జాబ్స్ కుమార్తె విమర్శ ఐఫోన్ 14, ఐఫోన్ 13 మాదిరే ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మీమ్ షేర్ చేసిన ఈవ్ జాబ్స్ బుధవారం నాడు ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్, కొత్త ఆపిల్ స్మార్ట్ వాచెస్, ఎయిర్‌పాడ్స్ ప్రో […]

The post Apple ని ట్రోల్ చేస్తూ మీమ్ షేర్ చేసిన స్టీవ్ జాబ్స్ కుమార్తె, iPhone 13 లాగే iPhone 14 ఉందని కామెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బుధవారం నాడు ఆపిల్ ఈవెంట్ లో లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్, ఆపిల్ స్మార్ట్ వాచెస్, ఎయిర్ పాడ్స్
  • లాంచ్ ఈవెంట్ తర్వాత ఆపిల్ పై స్టీవ్ జాబ్స్ కుమార్తె విమర్శ
  • ఐఫోన్ 14, ఐఫోన్ 13 మాదిరే ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మీమ్ షేర్ చేసిన ఈవ్ జాబ్స్

బుధవారం నాడు ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్, కొత్త ఆపిల్ స్మార్ట్ వాచెస్, ఎయిర్‌పాడ్స్ ప్రో 2 లాంచ్ తర్వాత స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఐఫోన్ 14 సిరీస్ పై పెదవి విరిచింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ మీమ్ ని షేర్ చేసింది. ఐఫోన్ 13 మాదిరే ఐఫోన్ 14 ఉందని ఆ మీమ్ సారాంశం.

మీమ్ లో ఒక వ్యక్తి తన చేతిలో ఒక చొక్కాను పట్టుకున్నాడు. మరోవైపు సేమ్ అటువంటి చొక్కానే ధరించి ఉన్నాడు. ఇక మీమ్ టెక్స్ట్ లో ఈ విధంగా ఉంది. “నేడు ఆపిల్ ప్రకటన తర్వాత, నేను ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14 కి అప్‌గ్రేడ్ అవుతున్నాను.”

ఆపిల్ తో సహా ఇతర మేజర్ బ్రాండ్స్ హై-ప్రొఫైల్ లాంచెస్ తర్వాత ఈ తరహా ట్రోలింగ్ ని ఎదుర్కుంటున్నాయి. ఆపిల్ విషయానికి వస్తే, తన ఐఫోన్స్ కి గత మూడు నాలుగేళ్ళుగా అదే ఐకానిక్ డిజైన్ ని మెంటెయిన్ చేస్తూ వస్తోంది. వివిధ జనరేషన్స్ కి చెందిన ఫోన్లు ఒకే విధమైన డిజైన్ ని కలిగి ఉండటం యూజర్లు గమనిస్తూ వస్తున్నారు. అయితే, డిజైన్ మార్చకపోయినా, ఇంటర్నల్ కోర్ కంపొనెంట్స్, హార్డ్‌వేర్ ని మారుస్తూ వస్తోంది.

ఐఫోన్ 14, ఐఫోన్ 13 ఫోన్లు ఏ15 బయోనిక్ చిప్సెట్ తో వస్తున్నాయి. అయితే ఐఫోన్ 14 లో వస్తున్న ఏ15 బయోనిక్ చిప్సెట్ మరింత శక్తివంతమైందని ఆపిల్ చెబుతోంది.

మరోవైపు ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఏ16 బయోనిక్ చిప్సెట్, బ్రాండ్ న్యూ డైనమిక్ ఐల్యాండ్ తో వస్తోంది. ఎప్పటి నుంచో ఉన్న నాచ్ ని డైనమిక్ ఐల్యాండ్ రీప్లేస్ చేసినట్లైంది. ఇది డిస్ప్లే పై కనిపించే పిల్-షేప్డ్ డైనమిక్ ఏరియా, మామూలు నాచ్ లా కాకుండా ఇది పలు యానిమేషన్ ఎఫెక్ట్స్ ని కలిగి, యూజర్ అలర్ట్స్ ని అందిస్తుంది. రూమర్లను పక్కనబెడితే, ఐఫోన్ 14 సిరీస్ ధరలను ఆపిల్ పెంచలేదు. ఐఫోన్ 14 స్టాండర్డ్ వేరియంట్ ధర భారత్ లో రూ.79,900 గా ఉంది. అయితే, ఐఫోన్ మినీ స్థానంలో భారీ సైజు ప్లస్ మోడల్ ని తీసుకొచ్చిన ఆపిల్ దాని ప్రారంభ ధరను పెంచేసింది.

iPhone 14, iPhone 14 Plus స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

ఐఫోన్ 14 లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే అమర్చారు. ఐఫోన్ 14 ప్లస్ లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. ఇక రెండు ఫోన్లు కూడా స్లిమ్ బెజెల్స్, వైడ్ కలర్ గేముత్, హెచ్డీఆర్, 1200 నిట్స్ బ్రైట్నెస్, ట్రూ టోన్ రెగ్యులర్ నాచ్, ఫ్రంట్ కెమెరా, ఫేస్ ఐడీ సెన్సర్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉన్నాయి.

రెండు ఫోన్లలో 5ఎన్ఎం ప్రాసెస్ పై నిర్మితమైన ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉంది. 4జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్లు వస్తున్నాయి. ఐఓఎస్ 16 స్టేబుల్ వర్షన్ పై ఈ ఫోన్లు పని చేస్తాయి. 5జీ, వై-ఫై, డ్యూయల్-సిమ్, బ్లూటూత్, జీపీఎస్, లైట్నింగ్ పోర్ట్, వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి.

ఐఫోన్ 14, 14 ప్లస్ లలో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 12ఎంపి వైడ్ యాంగిల్ మెయిన్ సెన్సర్ (ఐఓఎస్), రెండోది 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఆటోఫోకస్ తో కూడిన 12ఎంపి ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు. తొలిసారిగా ఫ్రంట్ కెమెరాలో ఆటోఫోకస్ ని అందించారు. రియర్ కెమెరా 38 శాతం మెరుగైన లో-లైట్ పెర్ఫామెన్స్ ని అందిస్తుందని, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉందని ఆపిల్ చెబుతోంది.

The post Apple ని ట్రోల్ చేస్తూ మీమ్ షేర్ చేసిన స్టీవ్ జాబ్స్ కుమార్తె, iPhone 13 లాగే iPhone 14 ఉందని కామెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ పొందిన iPhone 14, సెప్టెంబర్ లో లాంచ్ https://www.91mobiles.com/telugu/iphone-14-series-bis-certification-september-launch/ Wed, 24 Aug 2022 13:06:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=1872 హైలైట్స్: బీఐఎస్ వెబ్ సైట్ లో దర్శనమిచ్చిన కొత్త యాపిల్ మోడల్ నంబర్, ఐఫోన్ 14 అయ్యుంటుందని అంచనా గ్లోబల్ ఫ్యాక్టరీలతో పాటు భారత్ లో కూడా ఐఫోన్ 14 ని తయారు చేయనున్న యాపిల్ సంస్థ సెప్టెంబర్ 7 న లాంచ్ కానున్న కొత్త ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు యాపిల్ నుంచి రానున్న తదుపరి ఫోన్ ఐఫోన్ 14 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ను పొందింది. ఎలక్ట్రానిక్ డివైజెస్ కి క్లియరెన్స్ […]

The post BIS సర్టిఫికేషన్ పొందిన iPhone 14, సెప్టెంబర్ లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బీఐఎస్ వెబ్ సైట్ లో దర్శనమిచ్చిన కొత్త యాపిల్ మోడల్ నంబర్, ఐఫోన్ 14 అయ్యుంటుందని అంచనా
  • గ్లోబల్ ఫ్యాక్టరీలతో పాటు భారత్ లో కూడా ఐఫోన్ 14 ని తయారు చేయనున్న యాపిల్ సంస్థ
  • సెప్టెంబర్ 7 న లాంచ్ కానున్న కొత్త ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు

యాపిల్ నుంచి రానున్న తదుపరి ఫోన్ ఐఫోన్ 14 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ను పొందింది. ఎలక్ట్రానిక్ డివైజెస్ కి క్లియరెన్స్ ఇచ్చే సర్టిఫైయింగ్ అథారిటీయే ఈ బీఐఎస్ సంస్థ. అయితే ఐఫోన్ 14 అని బీఐఎస్ లిస్టింగ్ లో పేర్కొనబడలేదు. అయితే ఏ2882 అనే మోడల్ నంబర్ తో ఉన్న డివైజ్ యాపిల్ నుంచి రానున్న ఐఫోన్ దేనని స్పష్టమైంది.

త్వరలో భారత్ లో కూడా తయారు కానున్న iPhone 14

నివేదికలను బట్టి, యాపిల్ యొక్క ఐఫోన్ 14 సిరీస్ ఒకేసారి భారత్ లో అలాగే గ్లోబల్ గా లాంచ్ కానుంది. గత కొన్నాళ్ళుగా యాపిల్ ఇలాగే లాంచ్ చేస్తూ వస్తోంది. అయితే, త్వరలో భారత్ లో కూడా ఐఫోన్ లను తయారు చేయాలని యాపిల్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐఫోన్ 14 ని గ్లోబల్ ఫ్యాక్టరీలతో పాటు ఇండియాలో కూడా తయారు చేయబోతోంది.

భారత్ లో ఉత్పత్తి కంటే ముందు చైనాలో తయారీని యాపిల్ మొదలు పెట్టనుంది. యాపిల్ 13 ఫోన్ ని భారత్ లో తయారు చేసిన యాపిల్, గతేడాది సెప్టెంబర్ లో లాంచ్ చేసింది. అయితే, ఈ ఏడాది మాత్రం తొలుత చైనాలో తయారైన కొత్తతరం ఐఫోన్స్ లాంచ్ తర్వాత, రెండు నెలలకు ఇండియాలో తయారైన ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. ఇండియాతో తయారవుతున్నట్లే కానీ, యాపిల్ ఫోన్ ధరలు మాత్రం ఇంకా ఆకాశంలోనే ఉంటున్నాయి. మరి దీనిపై యాపిల్ సంస్థ కాస్త దృష్టి పెడితే మేలు. లేదా ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్లనైనా తయారు చేస్తే యాపిల్ ఫోన్ కొనాలన్న కోరికను కొందరైనా నెరవేర్చుకుంటారు.

ఇక ఐఫోన్ 14 సిరీస్ విషయానికి వస్తే, ఇది పాత కొత్తల కలయిక అని తెలుస్తోంది. ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 మ్యాక్స్ పాత తరం ఏ15 బయోనిక్ చిప్ తో వస్తున్నట్లు సమాచారం. అలాగే ఇవి రెండు కూడా హయ్యర్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటాయని అంచనా. ఇక ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ఏ16 చిప్ తో రానున్నాయి. అలాగే 48ఎంపి రియర్ కెమెరాలను కలిగి ఉండి, కొత్త నాచ్ డిజైన్ తో వస్తున్నాయి. ఐఫోన్ 13 మిని తో పోలిస్తే, కొత్త ఐఫోన్ 14 ధరలు 100 డాలర్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఇక ప్రో ఐఫోన్స్ లో అత్యధిక స్టోరేజీ ఆప్షన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి యాపిల్ కొత్త ఫోన్లు వినూత్నతను చాటడం ఖాయమని అర్థమవుతోంది. అయితే ధరలు వంద డాలర్లు పెరుగుతాయని అంటున్న నేపథ్యంలో ఐఫోన్ విక్రయాలపై ప్రభావం ఉంటుందేమో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post BIS సర్టిఫికేషన్ పొందిన iPhone 14, సెప్టెంబర్ లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>