హైలైట్స్:
- బుధవారం నాడు ఆపిల్ ఈవెంట్ లో లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్, ఆపిల్ స్మార్ట్ వాచెస్, ఎయిర్ పాడ్స్
- లాంచ్ ఈవెంట్ తర్వాత ఆపిల్ పై స్టీవ్ జాబ్స్ కుమార్తె విమర్శ
- ఐఫోన్ 14, ఐఫోన్ 13 మాదిరే ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మీమ్ షేర్ చేసిన ఈవ్ జాబ్స్
బుధవారం నాడు ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్, కొత్త ఆపిల్ స్మార్ట్ వాచెస్, ఎయిర్‌పాడ్స్ ప్రో 2 లాంచ్ తర్వాత స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఐఫోన్ 14 సిరీస్ పై పెదవి విరిచింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ మీమ్ ని షేర్ చేసింది. ఐఫోన్ 13 మాదిరే ఐఫోన్ 14 ఉందని ఆ మీమ్ సారాంశం.
మీమ్ లో ఒక వ్యక్తి తన చేతిలో ఒక చొక్కాను పట్టుకున్నాడు. మరోవైపు సేమ్ అటువంటి చొక్కానే ధరించి ఉన్నాడు. ఇక మీమ్ టెక్స్ట్ లో ఈ విధంగా ఉంది. “నేడు ఆపిల్ ప్రకటన తర్వాత, నేను ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14 కి అప్‌గ్రేడ్ అవుతున్నాను.”
ఆపిల్ తో సహా ఇతర మేజర్ బ్రాండ్స్ హై-ప్రొఫైల్ లాంచెస్ తర్వాత ఈ తరహా ట్రోలింగ్ ని ఎదుర్కుంటున్నాయి. ఆపిల్ విషయానికి వస్తే, తన ఐఫోన్స్ కి గత మూడు నాలుగేళ్ళుగా అదే ఐకానిక్ డిజైన్ ని మెంటెయిన్ చేస్తూ వస్తోంది. వివిధ జనరేషన్స్ కి చెందిన ఫోన్లు ఒకే విధమైన డిజైన్ ని కలిగి ఉండటం యూజర్లు గమనిస్తూ వస్తున్నారు. అయితే, డిజైన్ మార్చకపోయినా, ఇంటర్నల్ కోర్ కంపొనెంట్స్, హార్డ్‌వేర్ ని మారుస్తూ వస్తోంది.
ఐఫోన్ 14, ఐఫోన్ 13 ఫోన్లు ఏ15 బయోనిక్ చిప్సెట్ తో వస్తున్నాయి. అయితే ఐఫోన్ 14 లో వస్తున్న ఏ15 బయోనిక్ చిప్సెట్ మరింత శక్తివంతమైందని ఆపిల్ చెబుతోంది.
మరోవైపు ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఏ16 బయోనిక్ చిప్సెట్, బ్రాండ్ న్యూ డైనమిక్ ఐల్యాండ్ తో వస్తోంది. ఎప్పటి నుంచో ఉన్న నాచ్ ని డైనమిక్ ఐల్యాండ్ రీప్లేస్ చేసినట్లైంది. ఇది డిస్ప్లే పై కనిపించే పిల్-షేప్డ్ డైనమిక్ ఏరియా, మామూలు నాచ్ లా కాకుండా ఇది పలు యానిమేషన్ ఎఫెక్ట్స్ ని కలిగి, యూజర్ అలర్ట్స్ ని అందిస్తుంది. రూమర్లను పక్కనబెడితే, ఐఫోన్ 14 సిరీస్ ధరలను ఆపిల్ పెంచలేదు. ఐఫోన్ 14 స్టాండర్డ్ వేరియంట్ ధర భారత్ లో రూ.79,900 గా ఉంది. అయితే, ఐఫోన్ మినీ స్థానంలో భారీ సైజు ప్లస్ మోడల్ ని తీసుకొచ్చిన ఆపిల్ దాని ప్రారంభ ధరను పెంచేసింది.
iPhone 14, iPhone 14 Plus స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
ఐఫోన్ 14 లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే అమర్చారు. ఐఫోన్ 14 ప్లస్ లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. ఇక రెండు ఫోన్లు కూడా స్లిమ్ బెజెల్స్, వైడ్ కలర్ గేముత్, హెచ్డీఆర్, 1200 నిట్స్ బ్రైట్నెస్, ట్రూ టోన్ రెగ్యులర్ నాచ్, ఫ్రంట్ కెమెరా, ఫేస్ ఐడీ సెన్సర్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉన్నాయి.
రెండు ఫోన్లలో 5ఎన్ఎం ప్రాసెస్ పై నిర్మితమైన ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉంది. 4జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్లు వస్తున్నాయి. ఐఓఎస్ 16 స్టేబుల్ వర్షన్ పై ఈ ఫోన్లు పని చేస్తాయి. 5జీ, వై-ఫై, డ్యూయల్-సిమ్, బ్లూటూత్, జీపీఎస్, లైట్నింగ్ పోర్ట్, వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి.
ఐఫోన్ 14, 14 ప్లస్ లలో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 12ఎంపి వైడ్ యాంగిల్ మెయిన్ సెన్సర్ (ఐఓఎస్), రెండోది 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఆటోఫోకస్ తో కూడిన 12ఎంపి ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు. తొలిసారిగా ఫ్రంట్ కెమెరాలో ఆటోఫోకస్ ని అందించారు. రియర్ కెమెరా 38 శాతం మెరుగైన లో-లైట్ పెర్ఫామెన్స్ ని అందిస్తుందని, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉందని ఆపిల్ చెబుతోంది.













