iPhone 15 Pro Max - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 13 Sep 2023 05:30:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! https://www.91mobiles.com/telugu/iphone-15-series-india-price-sale/ Wed, 13 Sep 2023 05:30:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=7995 ప్రముఖ టెక్ కంపెనీ Apple భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో తన కొత్త ఫోన్ సిరీస్ iPhone 15 ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అనే మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. iPhone 14 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్స్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఈసారి iPhone 15 సిరీస్ […]

The post iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 స్మార్ట్‌ఫోన్లు
  • భారత్‌లో iPhone 15 ప్రారంభ ధర రూ.79,900

ప్రముఖ టెక్ కంపెనీ Apple భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో తన కొత్త ఫోన్ సిరీస్ iPhone 15 ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అనే మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. iPhone 14 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్స్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఈసారి iPhone 15 సిరీస్ లోని అన్ని ఫోన్లలో డైనమిక్ ఐల్యాండ్ స్క్రీన్ ని తీసుకొచ్చారు. ఇది ప్రధానమైన మార్పుగా చెప్పవచ్చు. సరే, ఓసారి iPhone 15 సిరీస్ యొక్క ధర, సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో iPhone 15 సిరీస్ ధర

  • iPhone 15 ధర: స్టాండర్డ్ వేరియంట్ అయిన iPhone 15 యొక్క 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.79,900 గా నిర్ణయించారు. ఇకపోతే 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,900 గా ఉంది. 512జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.1,09,900 గా ఉంది.
  • iPhone 15 Plus ధర: iPhone 15 Plus డివైజ్ 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,900 గా ఉంది. 256జిబి యూనిట్ ధరను రూ. గా ఉంది. 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.1,19,900 గా నిర్ణయించారు.
  • iPhone 15 Pro ధర: iPhone 15 Pro డివైజ్ యొక్క 128జిబి మోడల్ ధరను 1,34,900 గా నిర్ణయించారు. 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,44,900 గా ఉంది. 512జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.1,64,900 గా ఉంది. 1టిబి మోడల్ ధర రూ.1,84,900 గా ఉంది.
  • iPhone 15 Pro Max ధర: iPhone 15 Pro Max 256జిబి వేరియంట్ ధర రూ.1,59,900 గా ఉంది. 512జిబి యూనిట్ ధర 1,79,900 గా నిర్ణయించారు. 1టిబి వేరియంట్ ధరను రూ.1,99,900 గా ఉంది.

iPhone 15 సిరీస్ ప్రీ-ఆర్డర్స్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఆపిల్ ఫ్యాన్స్, ఐఫోన్స్ ని సెప్టెంబర్ 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. iPhone 15, iPhone 15 Plus డివైజెస్ పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. iPhone 15 Pro Max బ్లాక్ టైటానియమ్, వైట్ టైటానియమ్, బ్లూ టైటానియమ్, నేచురల్ టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
A17 బయోనిక్ చిప్, USB టైప్-సీ పోర్ట్‌తో లాంచైన iPhone 15 Pro, iPhone Pro Max https://www.91mobiles.com/telugu/iphone-15-pro-15-pro-max-launched-price-specs/ Tue, 12 Sep 2023 18:28:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=7990 ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ నుంచి తాజాగా మార్కెట్ లోకి iPhone 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 Pro, iPhone 15 Pro Max డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఏ17 బయోనిక్ చిప్సెట్ […]

The post A17 బయోనిక్ చిప్, USB టైప్-సీ పోర్ట్‌తో లాంచైన iPhone 15 Pro, iPhone Pro Max first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ తో సహా గ్లోబల్ గా లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వచ్చిన డివైజెస్

ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ నుంచి తాజాగా మార్కెట్ లోకి iPhone 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 Pro, iPhone 15 Pro Max డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఏ17 బయోనిక్ చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ధరలు

  • iPhone 15 Pro డివైజ్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 999 డాలర్లుగా ఉంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ధరలు వేరుగా ఉంటాయి.
  • iPhone 15 Pro Max డివైజ్ 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 1199 డాలర్లుగా నిర్ణయించారు.
  • సెప్టెంబర్ 15 నుంచి కొత్త ఐఫోన్ మోడల్స్ యొక్క ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమవుతాయి.

iPhone 15 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iPhone 15 Pro లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే ఉంది.
  • చిప్సెట్: iPhone 15 Pro లో ఏ17 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 3 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. 6-కోర్ జీపీయూని ఈ చిప్ తో అనుసంధానించారు.
  • స్టోరేజీ: iPhone 15 Pro డివైజ్ 128జిబి, 256జిబి, 512జిబి, 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: iPhone 15 Pro డివైజ్ ఐఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iPhone 15 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి ఓఐఎస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iPhone 15 Pro లో 15 వాట్ మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అందించారు.

iPhone 15 Pro Max స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iPhone 15 Pro Max లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 2796*1290 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్, ట్రూ టోన్, డైనమిక్ ఐల్యాండ్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ ప్రోమోషన్ టెక్నాలజీ, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iPhone 15 Pro Max లో ఏ17 బయోనిక్ 3ఎన్ఎమ్ చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం 6-కోర్ జీపీయూ అందించారు.
  • స్టోరేజీ: iPhone 15 Pro Max డివైజ్ 128జిబి, 256జిబి, 512జిబి, 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: iPhone 15 Pro Max డివైజ్ ఐఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iPhone 15 Pro Max లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఆప్షన్ ఈ ఫోన్ లో ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ట్రూడెప్త్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: iPhone 15 Pro Max లో 5జీ, గిగాబిట్-క్లాస్ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ ఉన్నాయి.

The post A17 బయోనిక్ చిప్, USB టైప్-సీ పోర్ట్‌తో లాంచైన iPhone 15 Pro, iPhone Pro Max first appeared on 91Mobiles Telugu.

]]>