iPhone 16 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 09 Sep 2024 19:36:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 16: Ai ఫీచర్లు, కొత్త డిజైన్‌తో లాంచైన ఐఫోన్ 16 సిరీస్ https://www.91mobiles.com/telugu/iphone-16-series-launched-with-ai-features-and-new-design/ https://www.91mobiles.com/telugu/iphone-16-series-launched-with-ai-features-and-new-design/#respond Mon, 09 Sep 2024 18:26:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=13400 ప్రముఖ టెక్ కంపెనీ Apple నేడు ప్రపంచ వ్యాప్తంగా iPhone 16 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. మనం ఈ ఆర్టికల్ లో బేస్ మోడల్ iPhone 16 గురించి తెలుసుకుందాం. ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 48ఎంపి ఫ్యూజన్ 2ఎక్స్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ […]

The post iPhone 16: Ai ఫీచర్లు, కొత్త డిజైన్‌తో లాంచైన ఐఫోన్ 16 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 16 సిరీస్ విడుదల
  • 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
  • 48ఎంపి మెయిన్ కెమెరా

ప్రముఖ టెక్ కంపెనీ Apple నేడు ప్రపంచ వ్యాప్తంగా iPhone 16 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. మనం ఈ ఆర్టికల్ లో బేస్ మోడల్ iPhone 16 గురించి తెలుసుకుందాం. ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 48ఎంపి ఫ్యూజన్ 2ఎక్స్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ తో వచ్చింది.

iPhone 16, iPhone 16 Plus స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 16 లో 6.1-ఇంచ్ స్క్రీన్, 2556*1179 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. మరోవైపు, iPhone 16 Plus లో 6.7-ఇంచ్ స్క్రీన్, 2796*1290 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. రెండు ఫోన్లలో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, ట్రూటోన్, 2000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10, డాల్బీ విజన్, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఉన్నాయి.

చిప్సెట్: iPhone 16 మరియు iPhone 16 Plus రెండు ఫోన్లలో ఏ18 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఇందులో 2 పెర్ఫామెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.89గిగాహెర్ట్జ్.

మెమొరీ: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లు 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి 2ఎక్స్ మెయిన్ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 16 లో పవర్ బ్యాకప్ కోసం 3561 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. iPhone 16 Plus లో 4006 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

కనెక్టివిటీ: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మ్యాగ్‌సేఫ్, క్యూఐ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ఉన్నాయి.

iPhone 16, iPhone 16 Plus భారత మార్కెట్ ధరలు

iPhone 16 స్మార్ట్‌ఫోన్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.79,999 గా పెట్టారు. 256జిబి వేరియంట్ ధర రూ.89,999 గా ఉంది. 512జిబి మోడల్ ధర రూ.1,09,999 గా ఉంది.

సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఐఫోన్ 16 సేల్‌కి వస్తుంది. అల్ట్రామరైన్, టీల్, పింక్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

iPhone 16 Plus యొక్క 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.89,999 గా పెట్టారు. 256జిబి మోడల్ ధరను రూ.99,999 గా నిర్ణయించారు. 512జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.1,19,900 గా ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి భారత్ లో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్‌ని అల్ట్రామరైన్, టీల్, పింక్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

సెప్టెంబర్ 13వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ప్రీబుకింగ్స్ ప్రారంభమవుతాయి.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

The post iPhone 16: Ai ఫీచర్లు, కొత్త డిజైన్‌తో లాంచైన ఐఫోన్ 16 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-16-series-launched-with-ai-features-and-new-design/feed/ 0
iPhone 16 లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-16-series-launch-date-confirmed-official/ https://www.91mobiles.com/telugu/iphone-16-series-launch-date-confirmed-official/#respond Tue, 27 Aug 2024 16:17:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=13189 ప్రముఖ టెక్ బ్రాండ్ Apple త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ iPhone 16 ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ లవర్స్ ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి వచ్చే ఐఫోన్ 16 సిరీస్ ఏఐ ఫీచర్లతో వచ్చే అకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఆపిల్ iPhone 16 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఇట్స్ గ్లోటైమ్ అనే ట్యాగ్ లైన్ తో iPhone 16 సిరీస్ ను ఆపిల్ తీసుకొస్తోంది. iPhone […]

The post iPhone 16 లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 16 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 విడుదల
  • అధికారికంగా వెల్లడించిన ఆపిల్

ప్రముఖ టెక్ బ్రాండ్ Apple త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ iPhone 16 ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ లవర్స్ ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి వచ్చే ఐఫోన్ 16 సిరీస్ ఏఐ ఫీచర్లతో వచ్చే అకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఆపిల్ iPhone 16 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఇట్స్ గ్లోటైమ్ అనే ట్యాగ్ లైన్ తో iPhone 16 సిరీస్ ను ఆపిల్ తీసుకొస్తోంది. iPhone 16 సిరీస్ లాంచ్ తేదీ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iPhone 16 సిరీస్ లాంచ్ తేదీ వివరాలు

iPhone 16 సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ అవ్వబోతోంది. ఈ విషయాన్ని ఆపిల్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. iPhone 16 సిరీస్ ఫోన్లతో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 10, కొత్త ఎంట్రీ-లెవెల్ ఎయిర్‌పాడ్స్ కూడా లాంచ్ కానున్నాయి.

లాంచ్ ఈవెంట్‌ను ఆపిల్ అధికార వెబ్‌సైట్, ఆపిల్ టీవీ యాప్, యూట్యూబ్ పై రాత్రి 10.30 గంటల నుంచి చూడవచ్చు.

iPhone 16 సిరీస్ ధర (అంచనా)

iPhone 16 సిరీస్ లో రాబోవు బేస్ వేరియంట్ ధర రూ.79,900 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే టాప్ మోడల్ ధర రూ.2,00,000 కు దగ్గరగా ఉంటుందని సమాచారం. లీక్ ప్రకారం, iPhone 16 Pro 1టిబి మెమొరీతో రానుందని తెలుస్తోంది.

ఐఫోన్ 16 ప్రో ధర భారత్ లో రూ.1,19,900 గా ఉంటుందని ఒక లీక్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900 గా, ఐఫోన్ 16 ధర రూ.79,900 గా ఉంటుందని సమాచారం.

iPhone 16 సేల్ (అంచనా)

ఆపిల్ సంస్థ iPhone 16 ను సెప్టెంబర్ 20వ తేదీ నుంచి విక్రయానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రీ-ఆర్డర్స్ మాత్రం లాంచ్ వీక్ లోనే ఉండవచ్చు.

బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, ఆపిల్ సంస్థ, రీడిజైన్డ్ ఆపిల్ వాచ్ సిరీస్ 10 ను లాంచ్ చేయనుందని సమాచారం. ఎయిర్‌పాడ్స్ కూడా అప్డేట్ అవ్వనుందని తెలుస్తోంది. బ్రాండ్ న్యూ ఎంట్రీ లెవెల్ టీడబ్ల్యూఎస్ ఎయిర్‌పాడ్స్ ను ఆపిల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. మరో మోడల్ ఎయిర్‌పాడ్స్ ప్రో మొదటిసారిగా ఏఎన్‌సీ ఫంక్షనాల్టీతో వస్తోంది.

iPhone 16 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iPhone 16 లో డైనమిక్ ఐల్యాండ్ డిస్ప్లే అందిస్తారని సమాచారం. ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ కంటే iPhone 16 ప్రో మరియు ప్రో మ్యాక్స్ చాలా పెద్దగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. iPhone 16 ప్రో 6.27-ఇంచ్ స్క్రీన్ మరియు iPhone 16 ప్రో మ్యాక్స్ 6.86-ఇంచ్ స్క్రీన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక iPhone 16 లో 6.1-ఇంచ్ హెచ్డీఆర్ స్క్రీన్ ఉంటుంది.

కెమెరా: iPhone 16 ప్రో మ్యాక్స్ లో 48ఎంపి సోని ఐఎంఎక్స్903 సెన్సర్ ఉంటుంది. ఇది టెలీఫోటో పెరిస్కోప్ లెన్స్ అని తెలుస్తోంది. దీనికి తోడు మరో రెండు 48ఎంపి సెన్సర్స్ ఉంటాయి. iPhone 16 ప్రో 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో రానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ProRAW ఫోటోలను తక్కువ వెలుతురులో కూడా ఈ సెన్సర్ క్యాప్చర్ చేయగలదు. ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లలో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ నుంచి 25ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది.

iPhone 16 సిరీస్ లోని అన్ని ఫోన్లలో 12ఎంపి ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

The post iPhone 16 లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-16-series-launch-date-confirmed-official/feed/ 0