
ప్రముఖ టెక్ కంపెనీ Apple నేడు ప్రపంచ వ్యాప్తంగా iPhone 16 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. మనం ఈ ఆర్టికల్ లో బేస్ మోడల్ iPhone 16 గురించి తెలుసుకుందాం. ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 48ఎంపి ఫ్యూజన్ 2ఎక్స్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ తో వచ్చింది.
iPhone 16, iPhone 16 Plus స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: iPhone 16 లో 6.1-ఇంచ్ స్క్రీన్, 2556*1179 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. మరోవైపు, iPhone 16 Plus లో 6.7-ఇంచ్ స్క్రీన్, 2796*1290 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. రెండు ఫోన్లలో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, ట్రూటోన్, 2000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10, డాల్బీ విజన్, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఉన్నాయి.
చిప్సెట్: iPhone 16 మరియు iPhone 16 Plus రెండు ఫోన్లలో ఏ18 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఇందులో 2 పెర్ఫామెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.89గిగాహెర్ట్జ్.
మెమొరీ: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లు 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
కెమెరా: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి 2ఎక్స్ మెయిన్ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: iPhone 16 లో పవర్ బ్యాకప్ కోసం 3561 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. iPhone 16 Plus లో 4006 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
కనెక్టివిటీ: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మ్యాగ్‌సేఫ్, క్యూఐ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
iPhone 16, iPhone 16 Plus భారత మార్కెట్ ధరలు
iPhone 16 స్మార్ట్‌ఫోన్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.79,999 గా పెట్టారు. 256జిబి వేరియంట్ ధర రూ.89,999 గా ఉంది. 512జిబి మోడల్ ధర రూ.1,09,999 గా ఉంది.
సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఐఫోన్ 16 సేల్‌కి వస్తుంది. అల్ట్రామరైన్, టీల్, పింక్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
iPhone 16 Plus యొక్క 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.89,999 గా పెట్టారు. 256జిబి మోడల్ ధరను రూ.99,999 గా నిర్ణయించారు. 512జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.1,19,900 గా ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి భారత్ లో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్‌ని అల్ట్రామరైన్, టీల్, పింక్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.
సెప్టెంబర్ 13వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ప్రీబుకింగ్స్ ప్రారంభమవుతాయి.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..











