iQOO Neo 8 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 17 May 2023 15:16:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 సోని ఐఎంఎక్స్866వి కెమెరా, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 8 సిరీస్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-8-series-camera-and-ram-confirmation/ Wed, 17 May 2023 15:16:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=6355 iQOO నియో 8 సిరీస్‌ వచ్చే వారం చైనాలో లాంచ్ కానుంది. నియో 8 సిరీస్‌లో రెండు ప్రీమియం ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇందులో Neo 8 5G మరియు Neo 8 Pro ఉన్నాయి. కొన్ని కీలక స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లను వెల్లడించడం ద్వారా కంపెనీ ఫోన్ లాంచ్‌ను టీజింగ్ చేయడం ప్రారంభించింది. లాంచ్ కి ముందు నియో 8 సిరీస్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఇప్పుడు, తాజా టీజర్ […]

The post సోని ఐఎంఎక్స్866వి కెమెరా, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 23 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 8 సిరీస్
  • ఈ ఏడాది చివర్లో భారత్‌లో విడుదలయ్యే అవకాశం
  • డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ తో వస్తోన్న సిరీస్

iQOO నియో 8 సిరీస్‌ వచ్చే వారం చైనాలో లాంచ్ కానుంది. నియో 8 సిరీస్‌లో రెండు ప్రీమియం ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇందులో Neo 8 5G మరియు Neo 8 Pro ఉన్నాయి.

కొన్ని కీలక స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లను వెల్లడించడం ద్వారా కంపెనీ ఫోన్ లాంచ్‌ను టీజింగ్ చేయడం ప్రారంభించింది. లాంచ్ కి ముందు నియో 8 సిరీస్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఇప్పుడు, తాజా టీజర్ నియో 8 సిరీస్ కెమెరా స్పెసిఫికేషన్‌లను తెలియజేసింది.

రాబోయే నియో సిరీస్ ఫోన్లలో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని iQOO ఇప్పటికే వెల్లడించింది. నియో 8 సిరీస్‌లో సోనీ కెమెరా సెన్సర్ ఉంటుందని ఇటీవలి టీజర్ ధృవీకరించింది. ఇప్పుడు iQOO Neo 8 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం.

iQOO నియో 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (టీజ్డ్)

డిస్ప్లే

  • 1.5కే రెజుల్యూషన్
  • అమోలెడ్ ప్యానెల్

ఐకూ నియో 8 సిరీస్ ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా

నియో 8 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. అయితే మిగతా సెన్సర్స్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

ర్యామ్, స్టోరేజీ

  • 16GB ర్యామ్
  • 256GB స్టోరేజీ

నియో 8 సిరీస్‌లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ ఉంటాయి. 128జిబి స్టోరేజీ వేరియంట్ యూఎఫ్ఎస్3.1 టెక్నాలజీతో రానుండగా, 256జిబి అంతకంటే ఎక్కువ స్టోరేజీ గల యూనిట్స్ యూఎఫ్ఎస్4.0 తో రావచ్చని అంచనా వేస్తున్నారు.

చిప్సెట్

  • డైమెన్సిటీ 9200+
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1

నియో 8 ప్రో ఫోన్‌లో మీడియాటెక్ యొక్క టాప్-ఎండ్ డైమెన్సిటీ 9200+ SoC ఉంటుందని iQOO ఇప్పటికే ధృవీకరించింది. ఇది 3.35GHz గరిష్ట క్లాక్ స్పీడ్ మరియు 4nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. నియో 8లో V1+ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP) ఉంది. ఇది ఫోన్ యొక్క కెమెరా మరియు మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది. స్టాండర్డ్ మోడల్ నియో 8 లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ఉండనుంది.

బ్యాటరీ, ఓఎస్

  • 5000ఎంఏహెచ్
  • ఆండ్రాయిడ్ 13

నియో 8 సిరీస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

The post సోని ఐఎంఎక్స్866వి కెమెరా, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన iQOO Neo 8 Pro అంటుటు స్కోర్, ర్యామ్, స్టోరేజీ వివరాలు; మే 23 న లాంచ్! https://www.91mobiles.com/telugu/iqoo-neo-8-pro-antutu-score-ram-storage-details/ Mon, 15 May 2023 14:57:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=6309 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Neo 8 Pro డివైజ్ ని చైనాలో లాంచ్ చేయబోతోంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చైనాలో ఎంట్రీ తర్వాత మిగతా మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ప్రవేశించనుంది. ఈ ఫోన్ అత్యధిక అంటుటు స్కోర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే iQOO Neo 8 సిరీస్ చైనాలో మే 23 న లాంచ్ అవుతోంది. తాజాగా iQOO Neo 8 […]

The post రివీలైన iQOO Neo 8 Pro అంటుటు స్కోర్, ర్యామ్, స్టోరేజీ వివరాలు; మే 23 న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 23 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 8 Pro
  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానున్న డివైజ్
  • హయ్యస్ట్ అంటుటు స్కోర్ చేసిందని సమాచారం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Neo 8 Pro డివైజ్ ని చైనాలో లాంచ్ చేయబోతోంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చైనాలో ఎంట్రీ తర్వాత మిగతా మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ప్రవేశించనుంది. ఈ ఫోన్ అత్యధిక అంటుటు స్కోర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే iQOO Neo 8 సిరీస్ చైనాలో మే 23 న లాంచ్ అవుతోంది. తాజాగా iQOO Neo 8 Pro ఫోన్ అంటుటు స్కోర్, ర్యామ్ మరియు స్టోరేజీ వివరాలు రివీల్ అయ్యాయి.

సరే, ఓసారి iQOO Neo 8 Pro కి సంబంధించి బయటకు వచ్చిన ముఖ్య సమాచారం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అంటుటు స్కోర్

  •  13,63,206 పాయింట్లు

iQOO Neo 8 Pro డివైజ్ మే 23 న లాంచ్ అవుతోంది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ హయ్యస్ట్ అంటుటు స్కోర్ నమోదు చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ గా చెప్పబడుతోంది. iQOO Neo 8 Pro డివైజ్ 13,63,206 పాయింట్ల అంటుటు స్కోర్ ని నమోదు చేసింది. ఇది ASUS ROG Phone 7 సిరీస్ (13,30,011) కంటే అత్యధికం.

iQOO Neo 8 Pro స్పెసిఫికేషన్స్

ప్రాసెసర్

  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్
  • 4ఎన్ఎమ్ ఫ్యాబ్రికేషన్

iQOO Neo 8 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్ 4 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఇది 3.35 గిగా హెర్ట్జ్ పీక్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఒక కార్టెక్స్ ఎక్స్3 ప్రైమర్ కోర్, 3 కార్టెక్స్ ఏ715 కోర్స్ 3.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉండగా, 4 కార్టెక్స్ ఏ510 కోర్స్ 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త మీడియాటెక్ చిప్సెట్, మాలి-జీ715 జీపీయూ ని కలిగి ఉంది.

ర్యామ్, స్టోరేజీ

  • 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్
  • 512జిబి యూఎఫ్ఎస్ 4.0

iQOO Neo 8 Pro లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

డిస్ప్లే

  • 1.5కే రెజుల్యూషన్
  • అమోలెడ్ డిస్ప్లే

iQOO Neo 8 మరియు iQOO Neo 8 Pro ఫోన్లు 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 6.78-అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ ని కలిగి ఉంటాయని సమాచారం.

బ్యాటరీ, చార్జింగ్

  • 120 వాట్
  • 5000 ఎంఏహెచ్

iQOO Neo 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనున్నాయి.

కెమెరా, ఓఎస్

  • 50ఎంపి ఓఐఎస్ కెమెరా
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా

iQOO Neo 8 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. iQOO Neo 8 సిరీస్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

The post రివీలైన iQOO Neo 8 Pro అంటుటు స్కోర్, ర్యామ్, స్టోరేజీ వివరాలు; మే 23 న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
మే 23 న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Neo 8 సిరీస్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-8-series-launch-date-may-23rd-2023/ Fri, 12 May 2023 05:30:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=6270 వివో సబ్-బ్రాండ్ ఐకూ iQOO Neo 8 సిరీస్ చైనా లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ లైనప్ చైనాలో మే 23 న ఎంట్రీ ఇవ్వనుంది. ఐకూ చైనా వెబ్‌సైట్ ద్వారా లాంచ్ ఈవెంట్ ను లైవ్‌లో వీక్షించవచ్చు. అలాగే ఈ సిరీస్ లో రెండు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. అవి: iQOO Neo 8, iQOO Neo 8 Pro. సరే, ఇప్పటి వరకు ఈ సిరీస్ కి సంబంధించి బయటకు వచ్చిన సమాచారాన్ని […]

The post మే 23 న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Neo 8 సిరీస్ లో రానున్న రెండు మోడల్స్
  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తోన్న iQOO Neo 8 Pro
  • iQOO Neo 7 సిరీస్ కి అప్‌గ్రేడ్ గా వస్తోన్న iQOO Neo 8 సిరీస్

వివో సబ్-బ్రాండ్ ఐకూ iQOO Neo 8 సిరీస్ చైనా లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ లైనప్ చైనాలో మే 23 న ఎంట్రీ ఇవ్వనుంది. ఐకూ చైనా వెబ్‌సైట్ ద్వారా లాంచ్ ఈవెంట్ ను లైవ్‌లో వీక్షించవచ్చు. అలాగే ఈ సిరీస్ లో రెండు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. అవి: iQOO Neo 8, iQOO Neo 8 Pro. సరే, ఇప్పటి వరకు ఈ సిరీస్ కి సంబంధించి బయటకు వచ్చిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం. చదివి తెలుసుకోండి.

iQOO Neo 8 సిరీస్ లాంచ్ పోస్టర్

లాంచ్ పోస్టర్ ని బట్టి iQOO Neo 8 సిరీస్ వీ1+ చిప్సెట్, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు, iQOO Pad ట్యాబ్లెట్ కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో వస్తున్నట్లు సమాచారం.

iQOO Neo 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 1.5కే అమోలెడ్ డిస్ప్లే
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

iQOO Neo 8 Pro డివైజ్ 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కౌటౌట్ తో రానున్నట్లు సమాచారం.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 9200+
  • 16జిబి ర్యామ్
  • 512జిబి స్టోరేజీ

iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

iQOO Neo 8 సిరీస్ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఈ సిరీస్ డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై తదితర ఫీచర్స్ ఉంటాయి.

The post మే 23 న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
AnTuTu వెబ్‌సైట్ పై కనిపించిన iQOO Neo 8 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-8-pro-spotted-antutu-benchmarking-website-key-specs-revealed/ Fri, 21 Apr 2023 18:27:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=5989 iQOO Neo 8 Pro స్మార్ట్ ఫోన్ చైనాతో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే లాంచ్ కి ముందు ఈ ఫోన్ అంటుటు బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ పై V2302A అనే మోడల్ నంబర్ తో కనిపించింది. లిస్టింగ్ ద్వారా iQOO Neo 8 Pro డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. iQOO Neo 8 Pro లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుందని, 512జిబి […]

The post AnTuTu వెబ్‌సైట్ పై కనిపించిన iQOO Neo 8 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో మే నెలలో iQOO Neo 8 Pro లాంచ్ అవుతుందని అంచనా
  • అంటుటు బెంచ్ మార్క్ సైట్ పై 1368597 స్కోర్ నమోదు చేసిన డివైజ్
  • ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌తో రానుందని సమాచారం

iQOO Neo 8 Pro స్మార్ట్ ఫోన్ చైనాతో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే లాంచ్ కి ముందు ఈ ఫోన్ అంటుటు బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ పై V2302A అనే మోడల్ నంబర్ తో కనిపించింది. లిస్టింగ్ ద్వారా iQOO Neo 8 Pro డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి.

iQOO Neo 8 Pro లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుందని, 512జిబి స్టోరేజీ వరకు ఉండనుందని సమాచారం. గతంలో ఈ ఫోన్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. కానీ, కంపెనీ ఇప్పటి వరకు అఫీషియల్ గా ఫోన్ గురించి ప్రకటన చేయలేదు. సరే, ఓసారి iQOO Neo 8 Pro డివైజ్ అంటుటు స్కోర్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.

iQOO Neo 8 Pro AnTuTu స్కోర్

అంటుటు లిస్టింగ్ ప్రకారం iQOO Neo 8 Pro డివైజ్ V2302A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ బెంచ్ మార్కింగ్ సైట్ పై డివైజ్ 13,68,597 పాయింట్ల స్కోర్ చేసింది. చైనాలో వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది.

లిస్టింగ్ ద్వారా iQOO Neo 8 Pro డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానుందని తెలిసింది. ఈ చిప్సెట్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో జతకూడి వస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తొలుత ఈ లిస్టింగ్ ని గుర్తించాడు.

iQOO Neo 8 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: iQOO Neo 8 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.

చిప్సెట్: ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానుందని సమాచారం.

కెమెరాలు: ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది 1/1.5-ఇంచ్ సెన్సర్ అని 91mobiles Hindi తెలిపింది. ఇతర సెన్సర్స్ అల్ట్రావైడ్, టెలీఫోటో లెన్సెస్ అయి ఉంటాయని అంచనా. కానీ ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.

ర్యామ్ మరియు స్టోరేజీ: ఈ స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్ మరియు 512జిబి స్టోరేజీ తో వస్తోందని సమాచారం. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో కూడా వస్తోందని తెలుస్తోంది.

బ్యాటరీ: iQOO Neo 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఇంకా ఏ విషయం ఖరారు కాలేదు.

ఓఎస్: iQOO Neo 8 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానుంది. చైనీస్ మార్కెట్ లో ఒరిజిన్ ఓఎస్3 కస్టమ్ స్కిన్, ఇతర మార్కెట్స్ లో ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ ఉండనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post AnTuTu వెబ్‌సైట్ పై కనిపించిన iQOO Neo 8 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ చిప్సెట్‌తో రానున్న iQOO Neo 8 సిరీస్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-8-series-launch-timeline-key-specs/ Tue, 18 Apr 2023 14:28:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=5930 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Neo 8 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో త్వరలోనే ఈ సిరీస్ లాంచ్ కానుంది.iQOO Neo 8 గురించి ఎన్నో వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా 91Mobiles Hindi వెబ్ సైట్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో iQOO Neo 8 వివరాలు రివీల్ చేసింది. అందిన సమాచారం ప్రకారం, iQOO Neo 8 లైనప్ లో రెండు మోడల్స్ – ఐకూ నియో […]

The post 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ చిప్సెట్‌తో రానున్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే లాంచ్ కానున్న iQOO Neo 8 డివైజ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న ఫోన్
  • మీడియాటెక్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Neo 8 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో త్వరలోనే ఈ సిరీస్ లాంచ్ కానుంది.iQOO Neo 8 గురించి ఎన్నో వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా 91Mobiles Hindi వెబ్ సైట్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో iQOO Neo 8 వివరాలు రివీల్ చేసింది. అందిన సమాచారం ప్రకారం, iQOO Neo 8 లైనప్ లో రెండు మోడల్స్ – ఐకూ నియో 8 మరియు నియో 8 ప్రో ఫోన్లు ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

iQOO Neo 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • అమోలెడ్ డిస్ప్లే ప్యానెల్
  • 80 వాట్/100 వాట్ ఫాస్ట్ చార్జ్
  • మీడియాటెక్ 9000 సిరీస్ చిప్సెట్

త్వరలోనే రాబోవు ఐకూ ఫోన్ చైనీస్ వేరియంట్ V2301A, ఐకూ నియో 8 ప్రో డివైజ్ V2302A మోడల్ నంబర్స్ కలిగి ఉన్నాయని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని వెల్లడించాడు. అలాగే ఈ ఫోన్లు అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలిపాడు.

లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ప్రో మోడల్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు తెలుస్తోంది. మీడియాటెక్ 9000 సిరీస్ చిప్సెట్స్ ని ఈ ఫోన్లలో వాడనున్నట్లు టిప్ స్టర్ తెలిపాడు. మే చివరికల్లా ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని టిప్‌స్టర్ అభిప్రాయపడ్డాడు.

iQOO Neo 8 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 16జిబి వరకు ర్యామ్

గతంలో లీకైన రిపోర్ట్స్ ప్రకారం, iQOO Neo 8 Pro డివైజ్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది.

iQOO Neo 8 Pro డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో రానుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

iQOO Neo 8 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్, టెలీఫోటో సెన్సర్స్ ఉండే అవకాశం ఉంది. ప్రైమరీ కెమెరా 1/1.5-ఇంచ్ సెన్సర్ తో రానుంది. iQOO Neo 8 సిరీస్ కి సంబంధించి ప్రస్తుతం ఇంతే సమాచారం అందుబాటులో ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ చిప్సెట్‌తో రానున్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>