
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Neo 8 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో త్వరలోనే ఈ సిరీస్ లాంచ్ కానుంది.iQOO Neo 8 గురించి ఎన్నో వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా 91Mobiles Hindi వెబ్ సైట్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో iQOO Neo 8 వివరాలు రివీల్ చేసింది. అందిన సమాచారం ప్రకారం, iQOO Neo 8 లైనప్ లో రెండు మోడల్స్ – ఐకూ నియో 8 మరియు నియో 8 ప్రో ఫోన్లు ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
iQOO Neo 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)
- అమోలెడ్ డిస్ప్లే ప్యానెల్
- 80 వాట్/100 వాట్ ఫాస్ట్ చార్జ్
- మీడియాటెక్ 9000 సిరీస్ చిప్సెట్
త్వరలోనే రాబోవు ఐకూ ఫోన్ చైనీస్ వేరియంట్ V2301A, ఐకూ నియో 8 ప్రో డివైజ్ V2302A మోడల్ నంబర్స్ కలిగి ఉన్నాయని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని వెల్లడించాడు. అలాగే ఈ ఫోన్లు అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలిపాడు.
లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ప్రో మోడల్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు తెలుస్తోంది. మీడియాటెక్ 9000 సిరీస్ చిప్సెట్స్ ని ఈ ఫోన్లలో వాడనున్నట్లు టిప్ స్టర్ తెలిపాడు. మే చివరికల్లా ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని టిప్‌స్టర్ అభిప్రాయపడ్డాడు.
iQOO Neo 8 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్
- 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
- 16జిబి వరకు ర్యామ్
గతంలో లీకైన రిపోర్ట్స్ ప్రకారం, iQOO Neo 8 Pro డివైజ్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది.
iQOO Neo 8 Pro డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో రానుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
iQOO Neo 8 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్, టెలీఫోటో సెన్సర్స్ ఉండే అవకాశం ఉంది. ప్రైమరీ కెమెరా 1/1.5-ఇంచ్ సెన్సర్ తో రానుంది. iQOO Neo 8 సిరీస్ కి సంబంధించి ప్రస్తుతం ఇంతే సమాచారం అందుబాటులో ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












