iQOO Z6 Lite - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 28 Nov 2022 12:59:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అమెజాన్ FAB PHONES FEST: రూ.15,000 లోపు స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ https://www.91mobiles.com/telugu/amazon-fab-phones-fest-best-deals-under-15k-smartphones/ Mon, 28 Nov 2022 11:12:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=3706 హైలైట్స్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో కొనసాగుతోన్న ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ సేల్ లో భాగంగా పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫెస్ట్ లో సేల్ అవుతోన్న టాప్ 5 ఫోన్స్ ఇవే: Samsung Galaxy M13, Redmi 10A, Realme Narzo 50A, iQOO Z6 Lite, Redmi A1, నవంబర్ 26 న అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ లో భాగంగా వివిధ హ్యాండ్సెట్స్ […]

The post అమెజాన్ FAB PHONES FEST: రూ.15,000 లోపు స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో కొనసాగుతోన్న ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్
  • సేల్ లో భాగంగా పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్
  • ఫెస్ట్ లో సేల్ అవుతోన్న టాప్ 5 ఫోన్స్ ఇవే: Samsung Galaxy M13, Redmi 10A, Realme Narzo 50A, iQOO Z6 Lite, Redmi A1,

నవంబర్ 26 న అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ లో భాగంగా వివిధ హ్యాండ్సెట్స్ పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. శాంసంగ్, రియల్మీ, రెడ్మీ, ఐకూ తదితర బ్రాండ్స్ పై తగ్గింపు ధరలు, ఆఫర్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ నవంబర్ 29 వరకు కొనసాగుతుంది. ఇక్కడ మీకోసం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో అత్యధికంగా అమ్ముడవుతోన్న ఫోన్ల జాబితాను అందిస్తున్నాం ఓ కన్నేయండి.

iQOO Z6 Lite

ఇప్పటికి iQOO Z6 Lite ఫోన్లు 1.5 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తో రూ.13,999 కి లభిస్తోంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ కి ఈ ధర వర్తిస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5జీ కనెక్టివిటీ, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 3జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్, 50ఎంపి మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy M13

Samsung Galaxy M13 కి ఎంట్రీ-లెవెల్ ఫోన్ కేటగిరీలో భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికి ఈ డివైజ్ 2 మిలియన్ల యూనిట్లకు పైగా అమ్ముడైంది. ఈ ఫోన్ అసలు ధర రూ.14,999 కాగా ప్రస్తుతం రూ.10,499 కి లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కూడా కలుపుకుంటే ఈ ఫోన్ ని రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, ర్యామ్ ప్లస్ ఫీచర్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme Narzo 50A

Realme Narzo 50A స్మార్ట్ ఫోన్ ఇప్పటికి 10 లక్షల యూనిట్స్ కి పైగా అమ్ముడయ్యాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా, ప్రస్తుతం రూ.11,499 కే లభిస్తోంది. కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఈ ఫోన్ రూ.9,499 కే మీ సొంతం అవుతుంది.

Redmi A1

Redmi A1 అత్యంత తక్కువ ధర కలిగిన డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ అసలు ధర రూ.6,999 కాగా, ప్రస్తుతం రూ.6,499 కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కూడా కలిపితే, ఈ ఫోన్ ని మీరు రూ.5,849 కే సొంతం చేసుకోవచ్చు.

Redmi 10A

Redmi 10A 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.9,499 కాగా, ప్రస్తుతం రూ.8,499 కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ని రూ.7,649 కే మీ సొంతం చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అమెజాన్ FAB PHONES FEST: రూ.15,000 లోపు స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 4 Gen 1 చిప్ తో లాంచ్ అయిన iQOO Z6 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z6-lite-5g-launched-price-specs-availability/ Mon, 12 Sep 2022 14:02:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=2278 హైలైట్స్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ తో వస్తున్న iQOO Z6 Lite రూ.15,000 లోపు ధర కలిగిన 5జీ ఫోన్ iQOO Z6 Lite సెప్టెంబర్ 14 నుంచి అమెజాన్ ఇండియా, ఐకూ స్టోర్స్ ద్వారా సేల్ ప్రారంభం జెడ్6 లైనప్ లో ఒక లైట్ వర్షన్ ఫోన్ లాంచ్ అవ్వనుందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. నేడు iQOO Z6 Lite లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో ఇప్పటికే […]

The post Snapdragon 4 Gen 1 చిప్ తో లాంచ్ అయిన iQOO Z6 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ తో వస్తున్న iQOO Z6 Lite
  • రూ.15,000 లోపు ధర కలిగిన 5జీ ఫోన్ iQOO Z6 Lite
  • సెప్టెంబర్ 14 నుంచి అమెజాన్ ఇండియా, ఐకూ స్టోర్స్ ద్వారా సేల్ ప్రారంభం

జెడ్6 లైనప్ లో ఒక లైట్ వర్షన్ ఫోన్ లాంచ్ అవ్వనుందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. నేడు iQOO Z6 Lite లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో ఇప్పటికే జెడ్6 స్టాండర్డ్ వేరియంట్, జెడ్6 ప్రో వేరియంట్ ఉన్నాయి. వీటి కంటే ముందే జెడ్5 అనే ఫోన్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ డివైజ్ భారత్ లో అమ్మకానికి ఉంది. ఇప్పుడు వీటికి తోడుగా iQOO Z6 Lite జత చేరింది. మరి ఈ లో-ఎండ్ ఫోన్ ఏ స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉందో చూద్దాం పదండి.

iQOO Z6 Lite: ధర, ఆఫర్లు, లభ్యత

iQOO Z6 Lite 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ (రూ.13,999), 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ (రూ.15,499) వేరియంట్లలో లభించనుంది. రెండు ఫోన్లపై కూడా రూ.2,500 వరకు బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. దీంతో బేస్ వేరియంట్ ధర రూ.11,499 కి లభించనుంది.సెప్టెంబర్ 14 న మధ్యాహ్నం 12.15 గంటలకు అమెజాన్ ఇండియా, ఐకూ ఇండియా ఈ-స్టోర్ ద్వారా సేల్ మొదలు కానుంది. స్టెల్లార్ గ్రీన్, మిస్టిక్ నైట్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.

iQOO Z6 Lite స్పెసిఫికేషన్స్

iQOO Z6 Lite 5G ఫోన్లో క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఎంట్రీ లెవెల్ 5జీ చిప్సెట్ Snapdragon 4 Gen 1 ను వాడారు. ఈ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి వేరియంట్లలో లభించనుంది. 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

ఇప్పుడు iQOO Z6 Lite యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరాను అమర్చారు. iQOO Z6 Lite లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ర్యామ్ బూస్టర్ ఫీచర్ ద్వారా అదనంగా 2జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. అల్ట్రా గేమ్ మోడ్, ఫోర్-కంపోనెంట్ కూలింగ్ సిస్టమ్, సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. సూపర్ నైట్ మోడ్ ఆప్షన్ 6జిబి వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. iQOO Z6 Lite 5G 2.5డీ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ ని కలిగి ఏజీ మ్యాట్ ఫినిష్ తో వస్తోంది. స్టెల్లార్ గ్రీన్ కలర్ లో మాత్రమే ఏజీ మ్యాట్ ఫినిష్ అందుబాటులో ఉంటుంది.

ఇక కొత్తగా ఎంట్రీ ఇచ్చిన Snapdragon 4 Gen 1 ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది 6ఎన్ఎం ప్రాసెస్ పై నిర్మితమైంది. ఈ చిప్సెట్ AnTuTu స్కోర్ 388,486 గా నమోదైందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Snapdragon 4 Gen 1 చిప్ తో లాంచ్ అయిన iQOO Z6 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Z6 Lite: లాంచ్ తేదీ, లభ్యత కన్ఫర్మ్ https://www.91mobiles.com/telugu/iqoo-z6-lite-india-launch-date-confirmed-key-specs/ Mon, 05 Sep 2022 09:15:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=2095 హైలైట్స్: సెప్టెంబర్ 14 న భారత్ లో లాంచ్ కానున్న iQOO Z6 Lite 5జీ కనెక్టివిటీ, 120 హెర్ట్జ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాస్, వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు iQOO Z6 Lite స్నాప్ డ్రాగన్ 4-సిరీస్ చిప్సెట్ తో వచ్చే అవకాశం iQOO Z6 సిరీస్ ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి కంపెనీ కొత్త వేరియంట్స్ ని లాంచ్ చేస్తూ పోతోంది. ఇప్పటికి […]

The post iQOO Z6 Lite: లాంచ్ తేదీ, లభ్యత కన్ఫర్మ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 14 న భారత్ లో లాంచ్ కానున్న iQOO Z6 Lite
  • 5జీ కనెక్టివిటీ, 120 హెర్ట్జ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాస్, వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • iQOO Z6 Lite స్నాప్ డ్రాగన్ 4-సిరీస్ చిప్సెట్ తో వచ్చే అవకాశం

iQOO Z6 సిరీస్ ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి కంపెనీ కొత్త వేరియంట్స్ ని లాంచ్ చేస్తూ పోతోంది. ఇప్పటికి ఈ సిరీస్ లో ఐకూ జెడ్6, ఐకూ జెడ్6 5జీ, ఐకూ జెడ్6 44వాట్, ఐకూ జెడ్6 ప్రో 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రీసెంట్ గా చైనాలో ఐకూ జెడ్6ఎక్స్, ఐకూ జెడ్6 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఐకూ నుంచి ఈ సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ అవుతోంది. అదే iQOO Z6 Lite. ఈ హ్యాండ్సెట్ సెప్టెంబర్ 14 న భారత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇతర ఐకూ ఫోన్స్ మాదిరి, ఐకూ జెడ్6 లైట్ కూడా అమెజాన్ ద్వారా విక్రయించబడనున్నాయి.

అమెజాన్ లో ఈ ఫోన్ కి సంబంధించిన డెడికేటెడ్ మైక్రోసైట్ ని మనం గమనించవచ్చు. దీని ద్వారా iQOO Z6 Lite యొక్క ముఖ్యమైన ఫీచర్లు మనకు తెలుస్తున్నాయి. చూస్తుంటే, ఈ ఫోన్ రీబ్రాండ్ వర్షన్ గా కనిపించడం లేదు. iQOO Z6 Lite బ్రాండ్ న్యూ ఫోన్ అని స్పష్టమవుతోంది.

iQOO Z6 Lite స్పెసిఫికేషన్స్

iQOO Z6 Lite సెప్టెంబర్ 14 న భారత్ లో లాంచ్ అవుతోంది. హ్యాండ్సెట్ డిజైన్ ఐకూ జెడ్6 5జీ ఫోన్ ని పోలి ఉంది. ఇక iQOO Z6 Lite లో వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తోంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ స్లిమ్ బెజెల్స్, ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి ఉంది. ఫోన్ బాక్సీ డిజైన్ ని కలిగి ఉంది. ఇటీవల వస్తున్న అన్ని ఫోన్లు ఇదే డిజైన్ ని ఫాలో అవుతోన్న సంగతి తెలిసిందే. ఫోన్ నిర్మాణం విషయానికి వస్తే, ఇది పాలీకార్బొనేట్ మెటీరియల్ తో తయారైంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ని అమర్చారు.

iQOO Z6 Lite వెనుకాల రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో రెండు భారీ రింగ్స్ కనిపిస్తున్నాయి. ఇందులోని టాప్ రింగ్ లో ప్రైమరీ కెమెరా, క్రింద రింగ్ లో మరొక సెన్సర్ ఉంది. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్, 5జీ బ్రాండింగ్ కనిపిస్తున్నాయి.

iQOO Z6 Lite 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుందని, అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లో ప్యానెల్ ఎల్సీడీ లేదా అమోలెడ్ లలో దేంతో తయారైందో ఇంకా తెలియదు. ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, డ్యూయల్ 5జీ కనెక్టివిటీ తో వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే, ఇంకా చిప్సెట్ వివరాలు ఇంకా తెలియదు. ఐకూ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 సిరీస్ చిప్ తో ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం.

సెప్టెంబర్ 7 న iQOO Z6 Lite యొక్క చిప్సెట్ వివరాలు తెలుస్తాయని అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అంటే, అతి త్వరలో మనకు మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

The post iQOO Z6 Lite: లాంచ్ తేదీ, లభ్యత కన్ఫర్మ్ first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ లో భారత గడ్డపై అడుగుపెట్టనున్న iQOO Z6 Lite https://www.91mobiles.com/telugu/iqoo-z6-lite-india-launch-specs-price/ Tue, 16 Aug 2022 10:42:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=1691 హైలైట్స్: ఐకూ జెడ్6 పోర్ట్ ఫోలియోలో 4జీ ఫోన్ గా వస్తున్న ఐకూ జెడ్6 లైట్ సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ కానున్న ఐకూ జెడ్6 లైట్ వివో టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తున్న ఐకూ జెడ్6 లైట్ ఈ ఏడాది మార్చి నెల నుంచి ఐకూ కంపెనీ తన జెడ్6 పోర్ట్‌ఫోలియోలో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ త్వరలో ఇదే లైనప్ లో మరొక […]

The post సెప్టెంబర్ లో భారత గడ్డపై అడుగుపెట్టనున్న iQOO Z6 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఐకూ జెడ్6 పోర్ట్ ఫోలియోలో 4జీ ఫోన్ గా వస్తున్న ఐకూ జెడ్6 లైట్
  • సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ కానున్న ఐకూ జెడ్6 లైట్
  • వివో టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తున్న ఐకూ జెడ్6 లైట్

ఈ ఏడాది మార్చి నెల నుంచి ఐకూ కంపెనీ తన జెడ్6 పోర్ట్‌ఫోలియోలో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ త్వరలో ఇదే లైనప్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 91మొబైల్స్ తో మాట్లాడిన ఇండస్ట్రీ వ్యక్తులు చెబుతున్న దాన్ని బట్టి, ఈ కొత్త డివైజ్ పేరు ఐకూ జెడ్6 లైట్ అని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీని కలిగి ఉండదని సమాచారం. ఈ అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన సమాచారాన్ని ఐకూ అధికారికంగా వెల్లడించలేదు.

iQOO Z6 Lite ఇండియా లాంచ్, స్పెసిఫికేషన్స్

మా సన్నిహిత వర్గాల నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టి, ఐకూ జెడ్6 లైట్, వివో టీ1ఎక్స్ తో పోలికలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వివో టీ1ఎక్స్ జులైలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జెడ్6 లైట్ బడ్జెట్-సెంట్రిక్ 4జీ స్మార్ట్ ఫోన్ అని అర్థమవుతోంది. ఐకూ యొక్క మిడ్-రేంజ్ జెడ్ సిరీస్ ఫోన్స్ లైనప్ లో జెడ్6 లైట్ బేస్ వేరియంట్ కానుంది.

ఐకూ జెడ్6 లైట్ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అంటే ఇంకా దాదాపు నెల రోజుల సమయం ఉంది. ఈలోపు ఐకూ నుంచి ఫోన్ కి సంబంధించిన టీజర్లు, విశేషాలు కంపెనీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియనున్నాయి. ఈ-కామర్స్ సైట్స్ లో కూడా ఫోన్ కి సంబంధించిన వివరాలు తెలియడం ఖాయం.

వివో టీ1ఎక్స్ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా ఐకూ జెడ్6 లైట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. టీ1ఎక్స్ లో స్నాప్ డ్రానగ్ 680 4జీ చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఐకూ జెడ్6 లైట్ కూడా దాదాపు ఇటువంటి ఫీచర్లనే కలిగి ఉండి, స్టాండర్డ్ వేరియంట్ జెడ్6 కి క్రింది స్థానంలో ఉండనుంది. జెడ్6 విషయానికి వస్తే ఇందులో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5జీ కనెక్టివిటీ, 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2ఎంపి కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక ఈ ఫోన్ గరిష్టంగా 8జిబి ర్యామ్ ని కలిగి ఉంది.

ధర, రంగులు

మాకు తెలిసిన సమాచారాన్ని బట్టి, ఐకూ జెడ్6 లైట్ ధర వివో టీ1ఎక్స్ కంటే రూ.500 నుంచి రూ.700 తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వివో టీ1ఎక్స్ ధర రూ.11,999 నుంచి రూ.14,999 మధ్య ఉంది. వివో టీ1ఎక్స్ కలర్స్ గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కాకుండా, కొత్త రంగుల్లో జెడ్6 లైట్ లాంచ్ కానుంది. ఏయే రంగుల్లో జెడ్6 లైట్ లభించనుందో త్వరలోనే మీకు తెలియజేస్తాం.

The post సెప్టెంబర్ లో భారత గడ్డపై అడుగుపెట్టనున్న iQOO Z6 Lite first appeared on 91Mobiles Telugu.

]]>