సెప్టెంబర్ లో భారత గడ్డపై అడుగుపెట్టనున్న iQOO Z6 Lite

హైలైట్స్:

  • ఐకూ జెడ్6 పోర్ట్ ఫోలియోలో 4జీ ఫోన్ గా వస్తున్న ఐకూ జెడ్6 లైట్
  • సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ కానున్న ఐకూ జెడ్6 లైట్
  • వివో టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తున్న ఐకూ జెడ్6 లైట్

ఈ ఏడాది మార్చి నెల నుంచి ఐకూ కంపెనీ తన జెడ్6 పోర్ట్‌ఫోలియోలో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ త్వరలో ఇదే లైనప్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 91మొబైల్స్ తో మాట్లాడిన ఇండస్ట్రీ వ్యక్తులు చెబుతున్న దాన్ని బట్టి, ఈ కొత్త డివైజ్ పేరు ఐకూ జెడ్6 లైట్ అని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీని కలిగి ఉండదని సమాచారం. ఈ అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన సమాచారాన్ని ఐకూ అధికారికంగా వెల్లడించలేదు.

iQOO Z6 Lite ఇండియా లాంచ్, స్పెసిఫికేషన్స్

మా సన్నిహిత వర్గాల నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టి, ఐకూ జెడ్6 లైట్, వివో టీ1ఎక్స్ తో పోలికలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వివో టీ1ఎక్స్ జులైలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జెడ్6 లైట్ బడ్జెట్-సెంట్రిక్ 4జీ స్మార్ట్ ఫోన్ అని అర్థమవుతోంది. ఐకూ యొక్క మిడ్-రేంజ్ జెడ్ సిరీస్ ఫోన్స్ లైనప్ లో జెడ్6 లైట్ బేస్ వేరియంట్ కానుంది.

ఐకూ జెడ్6 లైట్ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అంటే ఇంకా దాదాపు నెల రోజుల సమయం ఉంది. ఈలోపు ఐకూ నుంచి ఫోన్ కి సంబంధించిన టీజర్లు, విశేషాలు కంపెనీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియనున్నాయి. ఈ-కామర్స్ సైట్స్ లో కూడా ఫోన్ కి సంబంధించిన వివరాలు తెలియడం ఖాయం.

వివో టీ1ఎక్స్ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా ఐకూ జెడ్6 లైట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. టీ1ఎక్స్ లో స్నాప్ డ్రానగ్ 680 4జీ చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఐకూ జెడ్6 లైట్ కూడా దాదాపు ఇటువంటి ఫీచర్లనే కలిగి ఉండి, స్టాండర్డ్ వేరియంట్ జెడ్6 కి క్రింది స్థానంలో ఉండనుంది. జెడ్6 విషయానికి వస్తే ఇందులో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5జీ కనెక్టివిటీ, 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2ఎంపి కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక ఈ ఫోన్ గరిష్టంగా 8జిబి ర్యామ్ ని కలిగి ఉంది.

ధర, రంగులు

మాకు తెలిసిన సమాచారాన్ని బట్టి, ఐకూ జెడ్6 లైట్ ధర వివో టీ1ఎక్స్ కంటే రూ.500 నుంచి రూ.700 తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వివో టీ1ఎక్స్ ధర రూ.11,999 నుంచి రూ.14,999 మధ్య ఉంది. వివో టీ1ఎక్స్ కలర్స్ గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కాకుండా, కొత్త రంగుల్లో జెడ్6 లైట్ లాంచ్ కానుంది. ఏయే రంగుల్లో జెడ్6 లైట్ లభించనుందో త్వరలోనే మీకు తెలియజేస్తాం.

Previous articleరూపాయి ఖర్చు లేకుండా 12,500 కి.మీ ప్రయాణించిన Tata Tigor EV యజమాని
Next articleMoto Edge 30 Fusion పేరుతో లాంచ్ కానున్న Moto S30 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.