iQOO Z9s 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 21 Aug 2024 11:55:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Z9s: డైమెన్సిటీ 7300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఐకూ జెడ్9ఎస్ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-launched-india-dimensity-7300-chipset/ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-launched-india-dimensity-7300-chipset/#respond Wed, 21 Aug 2024 09:10:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13090 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో Z9s సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro మోడల్స్ విడుదలయ్యాయి. iQOO Z9s Pro కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఆర్టికల్ లో మనం iQOO Z9s గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50ఎంపి కెమెరా, 3డీ కర్వ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ […]

The post iQOO Z9s: డైమెన్సిటీ 7300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఐకూ జెడ్9ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో iQOO Z9s లాంచ్
  • 50ఎంపి కెమెరా, 3డీ కర్వ్ స్క్రీన్
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో Z9s సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro మోడల్స్ విడుదలయ్యాయి. iQOO Z9s Pro కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఆర్టికల్ లో మనం iQOO Z9s గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50ఎంపి కెమెరా, 3డీ కర్వ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ డిజైన్ తో వచ్చింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iQOO Z9s ధర మరియు లభ్యత

iQOO Z9s భారత్ లో 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా ఉంది. 8జిబి + 256జిబి మిడ్ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి + 256జిబి టాప్ మోడల్ ధర రూ.23,999 గా ఉంది.

iQOO Z9s స్మార్ట్‌ఫోన్ టైటానియమ్ మ్యాట్ మరియు ఆనిక్స్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

అమెజాన్ మరియు ఐకూ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా iQOO Z9s ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 29 నుంచి సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది.

iQOO Z9s స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9s లో 6.77-ఇంచ్ 3డీ కర్వ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ సినిమా గ్రేడ్ పీ3 కలర్ గ్యామట్, 93.13 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9s స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ615 జీపీయూ వినియోగించారు. దీని అంటుటు స్కోరు 7 లక్షలకు పైగా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9s డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 12జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: iQOO Z9s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9s లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: iQOO Z9s లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై 6, 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9s లో ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post iQOO Z9s: డైమెన్సిటీ 7300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఐకూ జెడ్9ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9s-launched-india-dimensity-7300-chipset/feed/ 0
iQOO Z9s, Z9s Pro: లాంచ్‌కి ముందు ఖరారైన జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రో ప్రధాన స్పెసిఫికేషన్స్, కలర్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-key-specs-and-design-confirmed/ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-key-specs-and-design-confirmed/#respond Wed, 14 Aug 2024 17:23:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=13005 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో భారత్ లో జెడ్9ఎస్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro అనే మోడల్స్ విడుదల కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతున్నాయి. ఇక వీటికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ షేర్ చేస్తూ వస్తోంది. తాజా అప్డేట్ లో ఈ ఫోన్ల యొక్క బ్యాటరీ కెపాసిటీ, ఐపీ రేటింగ్, కలర్స్ మరియు ఇతర […]

The post iQOO Z9s, Z9s Pro: లాంచ్‌కి ముందు ఖరారైన జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రో ప్రధాన స్పెసిఫికేషన్స్, కలర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 21న iQOO Z9s సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న iQOO Z9s, Z9s Pro
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో భారత్ లో జెడ్9ఎస్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro అనే మోడల్స్ విడుదల కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతున్నాయి. ఇక వీటికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ షేర్ చేస్తూ వస్తోంది. తాజా అప్డేట్ లో ఈ ఫోన్ల యొక్క బ్యాటరీ కెపాసిటీ, ఐపీ రేటింగ్, కలర్స్ మరియు ఇతర వివరాలు ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

iQOO Z9s మరియు iQOO Z9s Pro వివరాలు (ఖరారైనవి)

కంపెనీ వెబ్‌సైట్ పై ఉన్న మైక్రోసైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, iQOO Z9s లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

iQOO Z9s Pro 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 7.49 మి.మీ మందం ఉంటాయి. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్లు రానున్నాయి.

iQOO Z9s స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు కలర్స్ లో లాంచ్ అవుతుంది. అవి: టైటానియమ్ మ్యాట్ మరియు ఆనిక్స్ గ్రీన్.

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ లక్స్ మార్బుల్ మరియు ఫ్లామ్‌బాయంట్ ఆరెంజ్ కలర్స్ లో లాంచ్ అవుతుంది.

iQOO Z9s మరియు iQOO Z9s Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9s మరియు iQOO Z9s Pro ఫోన్లలో 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. iQOO Z9s లో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మరోవైపు, ప్రో వేరియంట్ లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది.

చిప్సెట్: iQOO Z9s లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. iQOO Z9s Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతుంది.

కెమెరా: iQOO Z9s సిరీస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. బేస్ మోడల్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. ప్రో వేరియంట్ లో ప్రైమరీ కెమెరాతో పాటు, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరాలో ఏఐ ఫోటో ఎన్హాన్స్ మరియు ఏఐ ఎరేజ్ ఆప్షన్స్ ఉంటాయి.

iQOO Z9s, iQOO Z9s Pro ధర (అంచనా)

iQOO Z9s మరియు iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ల ధర భారత్ లో రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా కంపెనీ నుంచి ధరలకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఆగస్టు 21వ తేదీన అన్ని విషయాలు తెలుస్తాయి.

The post iQOO Z9s, Z9s Pro: లాంచ్‌కి ముందు ఖరారైన జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రో ప్రధాన స్పెసిఫికేషన్స్, కలర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-key-specs-and-design-confirmed/feed/ 0
iQOO Z9s సిరీస్ ఇండియా లాంచ్‌ను కన్ఫర్మ్ చేసిన ఐకూ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-5g-series-india-launch-confirmed/ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-5g-series-india-launch-confirmed/#respond Mon, 22 Jul 2024 17:43:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=12623 iQOO Z9 సిరీస్ సక్సెస్ తర్వాత ఐకూ కంపెనీ iQOO Z9s సిరీస్‌ను భారత్‌కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఐకూ బ్రాండ్ iQOO Z9s సిరీస్ యొక్క ఇండియా లాంచ్‌ను కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వబోతున్నాయి. సరే, ఓసారి ఈ సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. iQOO Z9s సిరీస్ ఇండియా లాంచ్ iQOO Z9s […]

The post iQOO Z9s సిరీస్ ఇండియా లాంచ్‌ను కన్ఫర్మ్ చేసిన ఐకూ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Z9s సిరీస్ లాంచ్
  • ఆగస్టులో లాంచ్ కానున్న జీ9ఎస్
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ

iQOO Z9 సిరీస్ సక్సెస్ తర్వాత ఐకూ కంపెనీ iQOO Z9s సిరీస్‌ను భారత్‌కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఐకూ బ్రాండ్ iQOO Z9s సిరీస్ యొక్క ఇండియా లాంచ్‌ను కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వబోతున్నాయి. సరే, ఓసారి ఈ సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

iQOO Z9s సిరీస్ ఇండియా లాంచ్

iQOO Z9s సిరీస్ ఆగస్టు నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. అయితే ఐకూ కంపెనీ ఈ సిరీస్ లో భాగంగా ఏయే ఫోన్లను లాంచ్ చేయనుందో ఇంకా తెలియజేయలేదు. అలాగే కచ్చితమైన లాంచ్ తేదీ కూడా ఇంకా వెల్లడికాలేదు. రానున్న రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9 Lite 5G లో 6.56-ఇంచ్ అల్ట్రా బ్రైట్ స్క్రీన్, 840 నిట్స్ బ్రైట్నెస్ మరియు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Z9 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. అంటుటు సైట్ పై ఈ చిప్సెట్ 414,564 స్కోర్ నమోదు చేసింది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Lite 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: iQOO Z9 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: iQOO Z9 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.

The post iQOO Z9s సిరీస్ ఇండియా లాంచ్‌ను కన్ఫర్మ్ చేసిన ఐకూ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9s-5g-series-india-launch-confirmed/feed/ 0