
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో Z9s సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro మోడల్స్ విడుదలయ్యాయి. iQOO Z9s Pro కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఆర్టికల్ లో మనం iQOO Z9s గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50ఎంపి కెమెరా, 3డీ కర్వ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ డిజైన్ తో వచ్చింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
iQOO Z9s ధర మరియు లభ్యత
iQOO Z9s భారత్ లో 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా ఉంది. 8జిబి + 256జిబి మిడ్ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి + 256జిబి టాప్ మోడల్ ధర రూ.23,999 గా ఉంది.
iQOO Z9s స్మార్ట్‌ఫోన్ టైటానియమ్ మ్యాట్ మరియు ఆనిక్స్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
అమెజాన్ మరియు ఐకూ ఆన్లైన్ స్టోర్ ద్వారా iQOO Z9s ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 29 నుంచి సేల్ మొదలవుతుంది.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది.
iQOO Z9s స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: iQOO Z9s లో 6.77-ఇంచ్ 3డీ కర్వ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ సినిమా గ్రేడ్ పీ3 కలర్ గ్యామట్, 93.13 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
ప్రాసెసర్: iQOO Z9s స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ615 జీపీయూ వినియోగించారు. దీని అంటుటు స్కోరు 7 లక్షలకు పైగా ఉంది.
ర్యామ్, స్టోరేజీ: iQOO Z9s డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 12జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: iQOO Z9s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9s లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్వేర్: iQOO Z9s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
కనెక్టివిటీ: iQOO Z9s లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై 6, 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: iQOO Z9s లో ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.











