iQOO Z9s Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 16:35:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/ https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/#respond Tue, 08 Oct 2024 16:35:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13990 ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం. Best camera phones […]

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

Best camera phones (రూ.25,000 లోపు)

స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర
ఐకూ జెడ్9ఎస్ ప్రో రూ.24,999
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రూ.24,999
నథింగ్ ఫోన్ (2ఏ) రూ.23,999
రెడ్మీ నోట్ 13 ప్రో రూ.23,999

 

iQOO Z9s Pro

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో కెమెరా పెర్ఫామెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫోకస్ ఫాస్ట్‌గా, షట్టర్ స్పీడ్స్ బాగున్నాయి.

అయితే లో-లైట్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికీ, వైబ్రంట్, డీటెయిల్డ్ ఇమేజెస్, అద్భుతమైన డైనమిక్ రేంజ్ ను ఈ ఫోన్ డెలివర్ చేస్తోంది. అల్ట్రావైడ్ లెన్స్ విషయానికి వస్తే, వివిడ్, హై-కాంట్రాస్ట్ షాట్స్ ను బాగా క్యాప్చర్ అవుతున్నాయి. పొట్రెయిట్స్ షార్ప్‌గా, స్కిన్ టోన్స్ ఆక్యురేట్ గా ఉన్నాయి. బొకే ఎఫెక్ట్ మాత్రం నేచురల్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ లో-లైట్ ఇష్యూస్
అద్భుతమైన అల్ట్రావైడ్ లెన్స్ పనితనం అసహజమైన బొకే ఎఫెక్ట్
సాలిడ్ పొట్రెయిట్ మోడ్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఇంప్రెస్సివ్ షాట్స్ డెలివర్ చేస్తోంది. అయితే కలర్స్ కాస్త బూస్ట్ చేస్తోంది. ఆకాశాన్ని ఎక్కువ నీలంగా, గడ్డిని మరింత పచ్చగా చేస్తోంది.

పొట్రెయిట్, నైట్ మోడ్స్ విషయంలో ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంది. డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తోంది. అయితే, ల్యాండ్‌స్కేప్ సెల్ఫీస్ విషయంలో బగ్ వల్లన, క్యాషెస్ లేదా బొకే ఎఫెక్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్, సరైన స్కిన్ టోన్స్ అందిస్తోంది.

బాగున్నవి బాగాలేనివి
కలర్‌ఫుల్, వైబ్రంట్ ఇమేజెస్ కలర్ బూస్టింగ్
పొట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన ఎడ్జ్ డిటెక్షన్ అసహజమైన బొకే ఎఫెక్ట్
మంచి సెల్ఫీ కెమెరా ల్యాండ్‌స్కేప్ సెల్ఫీ మోడ్‌లో బగ్
మంచి లో-లైట్ పెర్ఫామెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్ లో నార్డ్ సీఈ4 పనితీరు బాగుంది. సరైన వైట్ బ్యాలన్స్, సహజ రంగులు ఇమేజెస్ లో బాగున్నాయి.

కెమెరా డీసెంట్ డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేసింది. అయితే డార్క్ బ్లూ టోన్స్ మరియు పొట్రెయిట్ షాట్స్ లోని ఫేషియల్ డీటెయిల్స్ విషయాల్లో కెమెరా కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. పొట్రెయిట్ మోడ్ రిచ్ బొకే ఎఫెక్ట్, ఎడ్జ్ డిటెక్షన్ అందిస్తోంది. అయితే, హై-రెజ్ మోడ్ యొక్క కలర్ కన్సిస్టెన్సీ సరిగ్గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
నేచురల్ కలర్ ప్రొడక్షన్ అల్ట్రావైడ్ షాట్స్ లో సాఫ్ట్ డైనమిక్ రేంజ్
క్రిస్ప్ డీటెయిల్స్ కోసం హై-రెజ్ మోడ్ ఫేషియల్ డీటెయిల్స్ సాఫ్ట్ అవ్వడం
పొట్రెయిట్ మోడ్‌లో యాక్యురేట్ ఫేస్ డిటెక్షన్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ చార్జింగ్

Nothing Phone (2a)

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలు పిక్సెల్-బైనింగ్ ద్వారా 12.5ఎంపి ఇమేజెస్‌ను బైడీఫాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. డే-లైట్ లో షార్ప్, డీటెయిల్డ్ షాట్స్ మంచి డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ తో వస్తున్నాయి.

కలర్స్ పూర్తిగా నేచురల్ గా లేవు. అవి వైబ్రంట్ మరియు పంచీగా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ డీసెంట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాస్త వార్మ్ టోన్స్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరాతో పోల్చితే తక్కువ క్వాలిటీ గల ఇమేజెస్‌ను అల్ట్రావైడ్ అందిస్తోంది. లో-లైట్ కండీషన్స్ లో కెమెరాలు ఆటోమేటిక్ గా నైట్ మోడ్‌కి స్విచ్ అవుతున్నాయి. నైట్ మోడ్ లో ఎక్స్‌పోజర్ మెరుగ్గా, షార్ప్‌నెస్, నాయిస్ తక్కువగా ఉన్నాయి. డేలైట్ లో ఫ్రంట్ కెమెరా స్టన్నింగ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇండోర్ కండీషన్స్ (లోలైట్) లో కెమెరా పనితీరు నాసీరకంగా ఉంది.

బాగున్నవి బాగాలేనివి
అద్భుతమైన డేలైట్ పనితీరు ఎక్కువ వైబ్రంట్‌గా కనిపిస్తోన్న కలర్స్
ఎఫెక్టివ్ నైట్ మోడ్ బాగాలేని లో-లైట్ సెల్ఫీ పెర్ఫామెన్స్
మంచి డే-లైట్ సెల్ఫీస్ యావరేజీ క్వాలిటీ అల్ట్రావైడ్ లెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Redmi Note 13 Pro

Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాతో తీసిన ఫోటోలు వైబ్రంట్ గా ఉన్నాయి. అయితే కాస్త ఆరెంజ్ వంటి కలర్ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్, డైనమిక్ రేంజ్ బాగున్నాయి.

అయితే, లో-లైట్ కండీషన్స్ లో కలర్ కన్సిస్టెన్సీ బాగాలేదు. ఇమేజెస్ లో ఓవర్‌ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఉన్నాయి. అల్ట్రావైడ్ లెన్స్ కలర్ బ్యాలన్స్, ప్రైమరీ కెమెరాకు దాదాపు సమానంగా ఉంది. అయితే డీటెయిల్స్ బాగాలేవు. పొట్రెయిట్ షాట్స్ విషయంలో ఫోకస్ సమస్యగా ఉంది. ఫ్రంట్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్స్ లో బాగుంది. పొట్రెయిట్ మోడ్‌లో స్కిన్ టోన్ డిటెక్షన్ పర్ఫెక్ట్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ సరిగ్గాలేని లో-లైట్ పనితీరు
ఏఐ ఎడిటింగ్ టూల్స్ సరిగ్గాలేని స్కిన్ టోన్ డిటెక్షన్
మంచి డేలైట్ సెల్ఫీస్ అల్ట్రావైడ్ షాట్స్ లో డీటెయిల్స్ బాగా లేవు

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ చార్జింగ్

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/feed/ 0
iQOO Z9s Pro: 50MP కెమెరాతో లాంచైన ఐకూ జెడ్9ఎస్ ప్రో https://www.91mobiles.com/telugu/iqoo-z9s-pro-5g-launched-india-50mp-camera/ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-pro-5g-launched-india-50mp-camera/#respond Wed, 21 Aug 2024 11:52:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=13093 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్‌లో Z9s సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం iQOO Z9s Pro గురించి తెలుసుకుందాం. iQOO Z9s కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక iQOO Z9s Pro విషయానికి వస్తే, ఇందులో 256జిబి స్టోరేజీ, కర్వ్డ్ డిస్ప్లే, 4500 నిట్స్ […]

The post iQOO Z9s Pro: 50MP కెమెరాతో లాంచైన ఐకూ జెడ్9ఎస్ ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో iQOO Z9s సిరీస్ విడుదల
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Z9s Pro
  • ప్రారంభ ధర రూ.24,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్‌లో Z9s సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం iQOO Z9s Pro గురించి తెలుసుకుందాం. iQOO Z9s కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక iQOO Z9s Pro విషయానికి వస్తే, ఇందులో 256జిబి స్టోరేజీ, కర్వ్డ్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉన్నాయి. ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

iQOO Z9s Pro ధర, లభ్యత

iQOO Z9s Pro డివైజ్ 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.26,999 గా నిర్ణయించారు.

12జిబి ర్యామ్ + 256జిబ స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను రూ.28,999 గా నిర్ణయించారు.

లక్స్ మార్బుల్ మరియు ఫ్లాంబయాంట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇవి వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ తో ఉంటాయి.

iQOO Z9s Pro డివైజ్ సేల్ ఆగస్టు 23 నుంచి మొదలవుతుంది. అమెజాన్ మరియు ఐకూ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొననుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్స్ పై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.3,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.

iQOO Z9s Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9s Pro లో 6.77-ఇంచ్ కర్వ్డ్ స్క్రీన్, 2392*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1 బిలియన్ కలర్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వెట్ టచ్ టెక్నాలజీ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9s Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ అందించారు.

మెమొరీ: iQOO Z9s Pro డివైజ్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన 12జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్‌కి లభిస్తుంది.

కెమెరా: iQOO Z9s Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి శాంసంగ్ S5K3P9SP04-FGX9 సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 4 ఏళ్ళ పాటు పని చేస్తుందని కంపెనీ చెబుతోంది. 4 ఏళ్ళ పాటు ప్రతీరోజూ చార్జ్ చేస్తుంటే, ఆ తర్వాత 80 శాతం బ్యాటరీ నిరవధికంగా లభిస్తుందని ఐకూ అంటోంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9s Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమింగ్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్, ఏఐ ఫోటో ఎన్హాన్స్, ఏఐ ఎరేజ్, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టంట్ రేటింగ్ ఉన్నాయి.

The post iQOO Z9s Pro: 50MP కెమెరాతో లాంచైన ఐకూ జెడ్9ఎస్ ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9s-pro-5g-launched-india-50mp-camera/feed/ 0
iQOO Z9s, Z9s Pro: లాంచ్‌కి ముందు ఖరారైన జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రో ప్రధాన స్పెసిఫికేషన్స్, కలర్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-key-specs-and-design-confirmed/ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-key-specs-and-design-confirmed/#respond Wed, 14 Aug 2024 17:23:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=13005 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో భారత్ లో జెడ్9ఎస్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro అనే మోడల్స్ విడుదల కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతున్నాయి. ఇక వీటికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ షేర్ చేస్తూ వస్తోంది. తాజా అప్డేట్ లో ఈ ఫోన్ల యొక్క బ్యాటరీ కెపాసిటీ, ఐపీ రేటింగ్, కలర్స్ మరియు ఇతర […]

The post iQOO Z9s, Z9s Pro: లాంచ్‌కి ముందు ఖరారైన జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రో ప్రధాన స్పెసిఫికేషన్స్, కలర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 21న iQOO Z9s సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న iQOO Z9s, Z9s Pro
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో భారత్ లో జెడ్9ఎస్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro అనే మోడల్స్ విడుదల కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతున్నాయి. ఇక వీటికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ షేర్ చేస్తూ వస్తోంది. తాజా అప్డేట్ లో ఈ ఫోన్ల యొక్క బ్యాటరీ కెపాసిటీ, ఐపీ రేటింగ్, కలర్స్ మరియు ఇతర వివరాలు ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

iQOO Z9s మరియు iQOO Z9s Pro వివరాలు (ఖరారైనవి)

కంపెనీ వెబ్‌సైట్ పై ఉన్న మైక్రోసైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, iQOO Z9s లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

iQOO Z9s Pro 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 7.49 మి.మీ మందం ఉంటాయి. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్లు రానున్నాయి.

iQOO Z9s స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు కలర్స్ లో లాంచ్ అవుతుంది. అవి: టైటానియమ్ మ్యాట్ మరియు ఆనిక్స్ గ్రీన్.

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ లక్స్ మార్బుల్ మరియు ఫ్లామ్‌బాయంట్ ఆరెంజ్ కలర్స్ లో లాంచ్ అవుతుంది.

iQOO Z9s మరియు iQOO Z9s Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9s మరియు iQOO Z9s Pro ఫోన్లలో 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. iQOO Z9s లో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మరోవైపు, ప్రో వేరియంట్ లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది.

చిప్సెట్: iQOO Z9s లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. iQOO Z9s Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతుంది.

కెమెరా: iQOO Z9s సిరీస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. బేస్ మోడల్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. ప్రో వేరియంట్ లో ప్రైమరీ కెమెరాతో పాటు, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరాలో ఏఐ ఫోటో ఎన్హాన్స్ మరియు ఏఐ ఎరేజ్ ఆప్షన్స్ ఉంటాయి.

iQOO Z9s, iQOO Z9s Pro ధర (అంచనా)

iQOO Z9s మరియు iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ల ధర భారత్ లో రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా కంపెనీ నుంచి ధరలకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఆగస్టు 21వ తేదీన అన్ని విషయాలు తెలుస్తాయి.

The post iQOO Z9s, Z9s Pro: లాంచ్‌కి ముందు ఖరారైన జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రో ప్రధాన స్పెసిఫికేషన్స్, కలర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-key-specs-and-design-confirmed/feed/ 0