itel A60S - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 04 Jul 2023 13:47:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో లాంచైన Itel A60s; ధర కేవలం రూ.6,299! https://www.91mobiles.com/telugu/itel-a60s-launched-india-price-specs-availability/ Tue, 04 Jul 2023 13:47:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=7062 ఐటెల్ సంస్థ తాజాగా భారత్ లో Itel A60s డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో జులై 12 నుంచి మొదలవుతాయి. ఈ ఫోన్ ని సాధ్యమైనంత గొప్పగా తీర్చిదిద్దేందుకు కంపెనీ చక్కటి ప్రయత్నాలను చేసింది. Itel A60s లో 4జిబి వర్చువల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్ వంటివి అతి తక్కువ ధరలో అందించడం విశేషం. తక్కువ బడ్జెట్ లో ఫోన్ […]

The post 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో లాంచైన Itel A60s; ధర కేవలం రూ.6,299! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Itel A60s స్మార్ట్ ఫోన్
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న డివైజ్
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన హ్యాండ్సెట్

ఐటెల్ సంస్థ తాజాగా భారత్ లో Itel A60s డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో జులై 12 నుంచి మొదలవుతాయి. ఈ ఫోన్ ని సాధ్యమైనంత గొప్పగా తీర్చిదిద్దేందుకు కంపెనీ చక్కటి ప్రయత్నాలను చేసింది. Itel A60s లో 4జిబి వర్చువల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్ వంటివి అతి తక్కువ ధరలో అందించడం విశేషం. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావించే వారికి Itel A60s ఉత్తమమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

8జిబి ర్యామ్ తో వచ్చిన ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Itel A60s ధర, లభ్యత

Itel A60s స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంది. దీని ధరను రూ.6,299 గా నిర్ణయించారు. జులై 12 నుంచి ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ద్వారా Itel A60s సేల్స్ ప్రారంభమవుతాయి. షాడో బ్లాక్, మూన్ లైట్ వయొలెట్, గ్లేసియర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Itel A60s స్పెసిఫికేషన్స్

ఐటెల్ ఏ60ఎస్ స్మార్ట్ ఫోన్ ధర పరంగా చూస్తే, మంచి స్పెసిఫికేషన్స్ తో వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే రూ.7,000 లోపు ధరలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6.6-ఇంచ్ భారీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, రెండు స్టోరేజీ ఆప్షన్స్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి Itel A60s చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో ఉన్న పూర్తి స్పెసిఫికేషన్స్ ని క్రింద పాయింట్ల రూపంలో అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

  • డిస్ప్లే: Itel A60s లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Itel A60s లో ఏ చిప్సెట్ ఉందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
  • స్టోరేజీ: Itel A60s డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి/64జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Itel A60s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Itel A60s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఓవీజీఏ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Itel A60s స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

The post 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో లాంచైన Itel A60s; ధర కేవలం రూ.6,299! first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.7,000 కంటే తక్కువ ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel A60S https://www.91mobiles.com/telugu/itel-a60s-teaser-spotted-amazon-key-specs-expected-price/ Tue, 27 Jun 2023 08:42:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=6941 తక్కువ ధరలో చక్కటి ఫోన్లను అందిస్తోంది Itel కంపెనీ. ఈ సంస్థ నుంచి భారతీయ యూజర్ల కోసం itel A60S స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ తో ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ప్రత్యక్షమైంది. ఈ స్మార్ట్ ఫోన్ మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో 8జిబి ర్యామ్ వరకు ఆఫర్ చేయగలదు. ఈ ఫోన్ ధర రూ.7 వేల లోపే ఉంటుందని సమాచారం. సరే, ఓసారి itel A60S […]

The post రూ.7,000 కంటే తక్కువ ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel A60S first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ లో ప్రత్యక్షమైన itel A60S టీజర్
  • కొన్ని రోజుల్లో లాంచ్ కానున్న ఫోన్
  • వాటర్‌డ్రాప్ నాచ్ తో వస్తోన్న డివైజ్

తక్కువ ధరలో చక్కటి ఫోన్లను అందిస్తోంది Itel కంపెనీ. ఈ సంస్థ నుంచి భారతీయ యూజర్ల కోసం itel A60S స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ తో ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ప్రత్యక్షమైంది. ఈ స్మార్ట్ ఫోన్ మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో 8జిబి ర్యామ్ వరకు ఆఫర్ చేయగలదు. ఈ ఫోన్ ధర రూ.7 వేల లోపే ఉంటుందని సమాచారం. సరే, ఓసారి itel A60S డివైజ్ స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

itel A60S ఎప్పుడు లాంచ్ అవుతుంది?

itel A60S స్మార్ట్ ఫోన్ టీజర్ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో కనిపించింది. ఈ టీజర్ లో స్పెషల్ స్పెసిఫికేషన్స్ తో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఫోన్ తో కనిపిస్తున్నారు. ఈ ఫోన్ కొన్ని రోజుల్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. itel A60S డివైజ్ రూ.7,000 కంటే తక్కువ ధరతో భారత్ లో లాంచ్ అవుతుందని టీజర్ లో కంపెనీ వెల్లడించింది.

itel A60S స్పెసిఫికేషన్స్

  • డిజైన్: itel A60S డివైజ్ లో వాటర్ డ్రాప్ నాచ్, స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, రెండు కెమెరాలు, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: itel A60S డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.
  • డిస్ప్లే: itel A60S స్మార్ట్ ఫోన్ గత వారం నైజీరియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel A60S డివైజ్ లో UniSoc SC9863A1 అనే చిప్ ని వాడారు. ఈ చిప్ 1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
  • కెమెరా: itel A60S స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: itel A60S డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: itel A60S స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ ఉంటాయి.

The post రూ.7,000 కంటే తక్కువ ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel A60S first appeared on 91Mobiles Telugu.

]]>