
ఐటెల్ సంస్థ తాజాగా భారత్ లో Itel A60s డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో జులై 12 నుంచి మొదలవుతాయి. ఈ ఫోన్ ని సాధ్యమైనంత గొప్పగా తీర్చిదిద్దేందుకు కంపెనీ చక్కటి ప్రయత్నాలను చేసింది. Itel A60s లో 4జిబి వర్చువల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్ వంటివి అతి తక్కువ ధరలో అందించడం విశేషం. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావించే వారికి Itel A60s ఉత్తమమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
8జిబి ర్యామ్ తో వచ్చిన ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Itel A60s ధర, లభ్యత
Itel A60s స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంది. దీని ధరను రూ.6,299 గా నిర్ణయించారు. జులై 12 నుంచి ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ద్వారా Itel A60s సేల్స్ ప్రారంభమవుతాయి. షాడో బ్లాక్, మూన్ లైట్ వయొలెట్, గ్లేసియర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Itel A60s స్పెసిఫికేషన్స్
ఐటెల్ ఏ60ఎస్ స్మార్ట్ ఫోన్ ధర పరంగా చూస్తే, మంచి స్పెసిఫికేషన్స్ తో వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే రూ.7,000 లోపు ధరలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6.6-ఇంచ్ భారీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, రెండు స్టోరేజీ ఆప్షన్స్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి Itel A60s చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో ఉన్న పూర్తి స్పెసిఫికేషన్స్ ని క్రింద పాయింట్ల రూపంలో అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
- డిస్ప్లే: Itel A60s లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.
- ప్రాసెసర్: Itel A60s లో ఏ చిప్సెట్ ఉందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
- స్టోరేజీ: Itel A60s డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి/64జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Itel A60s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Itel A60s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఓవీజీఏ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఓఎస్: Itel A60s స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.











