JioBook - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 01 Aug 2023 07:04:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek MT8788 చిప్‌తో భారత్‌లో లాంచైన JioBook ల్యాప్‌టాప్! https://www.91mobiles.com/telugu/jiobook-laptop-launched-india-price-specs-availability/ Tue, 01 Aug 2023 06:05:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=7403 JioBook ఎట్టకేలకు భారత్ లో లాంచ్ అయ్యింది. రెవొల్యూషనరీ లెర్నింగ్ ల్యాప్‌టాప్ గా మార్కెట్ చేయబడుతోన్న ఈ డివైజ్ భారత్ లో సరసమైన ధరలో లభించే 4జీ ల్యాప్‌టాప్ గా నిలవనుంది. ఈ ల్యాప్‌టాప్ ఏ వయసు వారికైనా చదువు లేదా ఆఫీసు పని నిమిత్తం ఉపయోగపడనుంది. ఈ డివైజ్ ధరను రూ.20,000 లోపు పెట్టారు. JioBook జియోఓఎస్, జియోబియన్ కోడింగ్ సాఫ్ట్‌వేర్, 100జిబి క్లౌడ్ స్టోరేజీ, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వచ్చింది. భారత్ లో […]

The post MediaTek MT8788 చిప్‌తో భారత్‌లో లాంచైన JioBook ల్యాప్‌టాప్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.20,000 లోపు ధరతో భారత్‌లో లాంచైన Reliance JioBook
  • 11.6-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన JioBook
  • జియో బ్లూ కలర్ ఆప్షన్ లో లభించనున్న JioBook

JioBook ఎట్టకేలకు భారత్ లో లాంచ్ అయ్యింది. రెవొల్యూషనరీ లెర్నింగ్ ల్యాప్‌టాప్ గా మార్కెట్ చేయబడుతోన్న ఈ డివైజ్ భారత్ లో సరసమైన ధరలో లభించే 4జీ ల్యాప్‌టాప్ గా నిలవనుంది. ఈ ల్యాప్‌టాప్ ఏ వయసు వారికైనా చదువు లేదా ఆఫీసు పని నిమిత్తం ఉపయోగపడనుంది. ఈ డివైజ్ ధరను రూ.20,000 లోపు పెట్టారు. JioBook జియోఓఎస్, జియోబియన్ కోడింగ్ సాఫ్ట్‌వేర్, 100జిబి క్లౌడ్ స్టోరేజీ, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వచ్చింది.

భారత్ లో JioBook ధర, లభ్యత

ఆగస్టు 5 నుంచి JioBook సేల్ మొదలుకానుంది. ఈ ల్యాప్ టాప్ ధరను భారత్ లో రూ.16,499 గా నిర్ణయించారు. ఇది దేశంలోనే అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉన్న ల్యాప్ టాప్. అమెజాన్ ఇండియా, రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. జియో బ్లూ కలర్ ఆప్షన్ లో JioBook ల్యాప్ టాప్ లభించనుంది.

JioBook స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: JioBook ల్యాప్‌టాప్ లో 11.6-ఇంచ్ ఎల్ఈడీ బ్యాక్‌లైట్ డిస్ప్లే, 1366*768 పిక్సెల్స్ స్క్రీన్ రెజుల్యూషన్, యాంటీ-గ్లేర్ లేయర్ ఉంటాయి.
  • కొలతలు, బరువు: JioBook ల్యాప్ టాప్ 990 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైజ్ 27.3 సె.మీ పొడవు, 19.0 సె.మీ వెడల్పు, 1.65 సె.మీ మందం ఉంటుంది. ఈ లైట్ వెయిట్ ల్యాప్ టాప్ ని విద్యార్థులు తేలిగ్గా మోసుకొని వెళ్ళవచ్చు.
  • చిప్సెట్: JioBook ల్యాప్ టాప్ లో మీడియాటెక్ ఎమ్‌టీ8788 ఆక్టా-కోర్ ప్రాసెసర్, ఏఆర్ఎమ్ మాలి జీ72 ఎమ్‌పీ3 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: JioBook ల్యాప్ టాప్ లో 64జిబి స్టోరేజీ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: JioBook లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది సింగిల్ చార్జ్ పై 8 గంటల పాటు బ్యాకప్ అందిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: JioBook ల్యాప్ టాప్ JioBIAN ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఓఎస్ లైనక్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్.
  • కెమెరా: JioBook ల్యాప్ టాప్ లో 2ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

The post MediaTek MT8788 చిప్‌తో భారత్‌లో లాంచైన JioBook ల్యాప్‌టాప్! first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 31 న లాంచ్ అవుతోన్న JioBook ల్యాప్‌టాప్ https://www.91mobiles.com/telugu/jiobook-laptop-india-launch-date-july-31st-key-details/ Mon, 24 Jul 2023 05:28:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=7290 JioBook, జియో సంస్థ యొక్క మొట్టమొదటి ల్యాప్‌టాప్ గతేడాది అక్టోబర్ లో భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ జియో బుక్ ధర అప్పుడు రూ.20,000 గా నిర్ణయించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఈ ల్యాప్ టాప్ లో అందించారు. ఈ జియో బుక్ ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్ తో వచ్చింది. మరోసారి జియో కంపెనీ తన కొత్త వర్షన్ ల్యాప్‌టాప్ ని భారత్ లో లాంచ్ చేయాలని […]

The post జులై 31 న లాంచ్ అవుతోన్న JioBook ల్యాప్‌టాప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2022 లో లాంచైన ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత JioBook
  • జులై 31 న లాంచ్ కానున్న మరొక JioBook
  • JioOS తో వస్తోన్న కొత్త JioBook ల్యాప్‌టాప్

JioBook, జియో సంస్థ యొక్క మొట్టమొదటి ల్యాప్‌టాప్ గతేడాది అక్టోబర్ లో భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ జియో బుక్ ధర అప్పుడు రూ.20,000 గా నిర్ణయించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఈ ల్యాప్ టాప్ లో అందించారు. ఈ జియో బుక్ ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్ తో వచ్చింది. మరోసారి జియో కంపెనీ తన కొత్త వర్షన్ ల్యాప్‌టాప్ ని భారత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

ఈ నెలలోనే JioBook ల్యాప్ టాప్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. జులై 31 న JioBook లాంచ్ కానుందని సదరు బ్రాండ్ ప్రకటించింది. లాంచ్ కి ముందు, సంస్థ తన JioBook స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా షేర్ చేసింది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

సరికొత్త JioBook గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు

రిలయన్స్ జియో సంస్థ నుంచి రాబోవు సరికొత్త JioBook జులై 31 న లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, ఇది అన్ని వయసుల వారికి.. వర్క్, ఎంటర్టెయిన్మెంట్, గేమింగ్ కోసం ఉద్దేశించబడినది. ఈ ల్యాప్ టాప్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. వై-ఫై సపోర్ట్ కూడా ఉంటుందని ఆశించవచ్చు. అయితే ఈ సరికొత్త JioBook డివైజ్ JioOS పై పని చేయనుంది.

JioOS ప్రత్యేకించి లెర్నింగ్ కోసం డిజైన్ చేయబడింది. యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ దీని సొంతం. జియో కి సంబంధించిన వివిధ రకాల యాప్స్ కి ఈ ల్యాప్ టాప్ సపోర్ట్ చేస్తుంది. ఆక్టా-కోర్ చిప్సెట్ ని ఈ ల్యాప్ టాప్ లో వాడారు. లిస్టింగ్ ప్రకారం, ఈ JioBook హెచ్డీ వీడియోలు, మల్టీ-టాస్కింగ్, అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ తదితర వాటిని హ్యాండిల్ చేయగలదని తెలుస్తోంది. అయితే చిప్సెట్ పేరేంటో తెలపలేదు. 2022 లో వచ్చిన JioBook లో స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ వాడారు. ఇక కొత్త JioBook ఫుల్ డే బ్యాటరీని అందించనున్నట్లు సమాాచరం. JioBook లో ఫ్రంట్ వెబ్ క్యామ్ ఉంటుంది.

డిజైన్ విషయానికి వస్తే, JioBook 990 గ్రాముల బరువు ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి. 2022 మోడల్ కంటే ఇది కనీసం 200 గ్రాముల బరువు తక్కువుంది.

JioBook 2022 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: JioBook 2022 ల్యాప్‌టాప్ లో 11.6-ఇంచ్ డిస్ప్లే, 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: JioBook 2022 డివైజ్ లో 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ అందించారు.
  • చిప్సెట్: JioBook 2022 ల్యాప్ టాప్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 చిప్సెట్ వాడారు.
  • బ్యాటరీ: JioBook 2022 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది సింగిల్ చార్జ్ పై 8 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెప్పింది.
  • కనెక్టివిటీ: JioBook 2022 డివైజ్ లో 4జీ సిమ్ కార్డ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, హెచ్డీఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 2ఎంపి వెబ్ క్యామ్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ 1.2 కిలోల బరువు ఉంటుంది.

The post జులై 31 న లాంచ్ అవుతోన్న JioBook ల్యాప్‌టాప్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ బేస్డ్ JioBook ల్యాప్‌టాప్: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/jiobook-laptop-launched-price-india-specs/ Fri, 21 Oct 2022 05:29:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=3010 హైలైట్స్ బడ్జెట్ ల్యాప్ టాప్ జియోబుక్ ని లాంచ్ చేసిన టెలీకామ్ సంస్థ జియో విండోస్ కి బదులుగా ఆండ్రాయిడ్ సపోర్ట్ తో ల్యాప్ టాప్ తీసుకొచ్చిన జియో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో లాంచ్ అయిన జియోబుక్ భారత్ లోని టాప్ టెలీకామ్ ఆపరేటర్లలో ఒకటైన Reliance Jio భారత్ లో JioBook బడ్జెట్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసింది. జియో నుంచి వస్తోన్న తక్కువ ధర కలిగిన […]

The post భారత్ లో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ బేస్డ్ JioBook ల్యాప్‌టాప్: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • బడ్జెట్ ల్యాప్ టాప్ జియోబుక్ ని లాంచ్ చేసిన టెలీకామ్ సంస్థ జియో
  • విండోస్ కి బదులుగా ఆండ్రాయిడ్ సపోర్ట్ తో ల్యాప్ టాప్ తీసుకొచ్చిన జియో
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో లాంచ్ అయిన జియోబుక్

భారత్ లోని టాప్ టెలీకామ్ ఆపరేటర్లలో ఒకటైన Reliance Jio భారత్ లో JioBook బడ్జెట్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసింది. జియో నుంచి వస్తోన్న తక్కువ ధర కలిగిన లార్జ్ స్క్రీన్ ల్యాప్ టాప్ ఈ జియోబుక్. అయితే ఈ జియోబుక్ విండోస్ ల్యాప్ టాప్ కాదు. ఈ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ పై పని చేస్తుంది.

తొలుత గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (GeM) వెబ్ సైట్ రూ.19,500 ధరతో జియోబుక్ ల్యాప్ టాప్ కనిపించింది. అయితే, ఇప్పుడు ఈ ల్యాప్ టాప్ ని మరింత తక్కువ ధరకు దేశ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ కార్డ్స్ ద్వారా కస్టమర్లు ఈ జియోబుక్ ని తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మరి భారత్ లో జియోబుక్ ధర, మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో JioBook ధర, స్పెసిఫికేషన్స్

రిలయన్స్ జియో సంస్థ భారత్ లో సింగిల్ వేరియంట్ లో JioBook ల్యాప్ టాప్ ని లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ-లెవెల్ ల్యాప్ టాప్ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో లభ్యమవుతుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 128జిబి వరకు పెంచుకునే వీలుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదొక ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఆధారిత ల్యాప్ టాప్. ఇందులో అప్లికేషన్స్, విండోస్ ల్యాప్ టాప్ మాదిరిగా భారీ సైజువి ఉండవు.

భారత్ లో JioBook ధరను రూ.15,799 గా నిర్ణయించారు. యాక్సిస్, కొటక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఏయూ, ఇండస్ ఇండ్, డీబీఎస్, యస్ తదితర బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా JioBook ని కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, JioBook ల్యాప్ టాప్ 11.6-ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంది. 1366*768 పిక్సెల్స్ హెచ్డీ రెజుల్యూషన్, మందపాటి బెజెల్స్ తో ఈ ల్యాప్ టాప్ వస్తోంది.

2019 మరియు 2020 సంవత్సరాల్లో మనకు స్మార్ట్ ఫోన్స్ లో కనిపించిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ని జియో తన JioBook లో వాడింది. అడ్రెనో 610 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం ఉపయోగించారు. ల్యాప్ టాప్ లో జనరేట్ అయ్యే హీట్ ని తగ్గించేందుకు ఇందులో ప్యాసివ్ కూలింగ్ మెకానిజమ్ ఉంది.

జియో ల్యాప్ టాప్ JioBook 32జిబి ఈఎంఎంసీ స్టోరేజీ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 128జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ బడ్జెట్ ల్యాప్ టాప్ ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 8 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

ఈ JioBook జియో కంపెనీ యొక్క JioOS పై పని చేస్తుంది. బడ్జెట్ డివైజెస్ పై స్మూత్ గా నడిచే విధంగా ఈ ఓఎస్ ని తీర్చిదిద్దారు. విండోస్ పై పని చేయనప్పటికీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ అప్లికేషన్ సపోర్ట్ ని అందిస్తోంది. ఇకపోతే ఈ JioBook లో జియో స్టోర్ ఉంటుంది. దీని ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని యూజర్లు డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.

JioBook ల్యాప్ టాప్ 4జి సిమ్ కార్డ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్ 5.0, వైఫై, హెచ్డీఎంఐ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. JioBook లో 2ఎంపి వెబ్ క్యామ్ అందించారు. ఈ ల్యాప్ టాప్ బరువు 1.2 కిలోలు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ బేస్డ్ JioBook ల్యాప్‌టాప్: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>