
JioBook, జియో సంస్థ యొక్క మొట్టమొదటి ల్యాప్‌టాప్ గతేడాది అక్టోబర్ లో భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ జియో బుక్ ధర అప్పుడు రూ.20,000 గా నిర్ణయించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఈ ల్యాప్ టాప్ లో అందించారు. ఈ జియో బుక్ ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్ తో వచ్చింది. మరోసారి జియో కంపెనీ తన కొత్త వర్షన్ ల్యాప్‌టాప్ ని భారత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఈ నెలలోనే JioBook ల్యాప్ టాప్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. జులై 31 న JioBook లాంచ్ కానుందని సదరు బ్రాండ్ ప్రకటించింది. లాంచ్ కి ముందు, సంస్థ తన JioBook స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా షేర్ చేసింది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
సరికొత్త JioBook గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు
రిలయన్స్ జియో సంస్థ నుంచి రాబోవు సరికొత్త JioBook జులై 31 న లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, ఇది అన్ని వయసుల వారికి.. వర్క్, ఎంటర్టెయిన్మెంట్, గేమింగ్ కోసం ఉద్దేశించబడినది. ఈ ల్యాప్ టాప్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. వై-ఫై సపోర్ట్ కూడా ఉంటుందని ఆశించవచ్చు. అయితే ఈ సరికొత్త JioBook డివైజ్ JioOS పై పని చేయనుంది.
JioOS ప్రత్యేకించి లెర్నింగ్ కోసం డిజైన్ చేయబడింది. యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ దీని సొంతం. జియో కి సంబంధించిన వివిధ రకాల యాప్స్ కి ఈ ల్యాప్ టాప్ సపోర్ట్ చేస్తుంది. ఆక్టా-కోర్ చిప్సెట్ ని ఈ ల్యాప్ టాప్ లో వాడారు. లిస్టింగ్ ప్రకారం, ఈ JioBook హెచ్డీ వీడియోలు, మల్టీ-టాస్కింగ్, అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ తదితర వాటిని హ్యాండిల్ చేయగలదని తెలుస్తోంది. అయితే చిప్సెట్ పేరేంటో తెలపలేదు. 2022 లో వచ్చిన JioBook లో స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ వాడారు. ఇక కొత్త JioBook ఫుల్ డే బ్యాటరీని అందించనున్నట్లు సమాాచరం. JioBook లో ఫ్రంట్ వెబ్ క్యామ్ ఉంటుంది.
డిజైన్ విషయానికి వస్తే, JioBook 990 గ్రాముల బరువు ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి. 2022 మోడల్ కంటే ఇది కనీసం 200 గ్రాముల బరువు తక్కువుంది.
JioBook 2022 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: JioBook 2022 ల్యాప్‌టాప్ లో 11.6-ఇంచ్ డిస్ప్లే, 1366*768 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: JioBook 2022 డివైజ్ లో 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ అందించారు.
- చిప్సెట్: JioBook 2022 ల్యాప్ టాప్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 చిప్సెట్ వాడారు.
- బ్యాటరీ: JioBook 2022 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది సింగిల్ చార్జ్ పై 8 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెప్పింది.
- కనెక్టివిటీ: JioBook 2022 డివైజ్ లో 4జీ సిమ్ కార్డ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, హెచ్డీఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 2ఎంపి వెబ్ క్యామ్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ 1.2 కిలోల బరువు ఉంటుంది.











