Latest phones - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Sep 2024 08:45:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/#respond Wed, 25 Sep 2024 08:45:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=13735 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ భారత్ లో విడుదలైంది. ఈ ఫోన్ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 16జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7300 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo […]

The post Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Vivo V40e విడుదల
  • డైమెన్సిటీ 7300 చిప్సెట్
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ భారత్ లో విడుదలైంది. ఈ ఫోన్ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 16జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7300 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40e ధర, లభ్యత

Vivo V40e స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.28,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.30,999 గా పెట్టారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికార వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్‌కి వస్తోంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ పై 10 శాతం డిస్కౌంట్ లేదా 10 శాతం ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు. అంతేకాదు, 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

Vivo V40e డిజైన్

Vivo V40e స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, ఆరా లైట్ ఉన్నాయి. ముందువైపు 3డీ కర్వ్డ్ డిజైన్ ఉంది. ఈ ఫోన్ 0.749 సెంటీమీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ రాయల్ బ్రాంజ్ మరియు మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo V40e స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40e లో 6.77-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ ట్రూ కలర్స్, 2392*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 93.3% స్క్రీన్ టు బాడీ రేషియో, 8,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

చిప్సెట్: Vivo V40e స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40e స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo V40e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ప్రొఫెషనల్ నైట్ పొట్రెయిట్ ఓఐఎస్+ఈఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఐ ఏఎఫ్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo V40e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo V40e స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/feed/ 0
Oppo A3 5G: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3 5జీ https://www.91mobiles.com/telugu/oppo-a3-5g-launched-india-mediatek-dimensity-6300-chipset/ https://www.91mobiles.com/telugu/oppo-a3-5g-launched-india-mediatek-dimensity-6300-chipset/#respond Mon, 19 Aug 2024 17:08:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13046 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా భారతీయ మార్కెట్ లో Oppo A3 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Oppo A3 5G ధర, లభ్యత, […]

The post Oppo A3 5G: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Oppo A3 5G లాంచ్
  • 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా
  • ప్రారంభ ధర రూ.15,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా భారతీయ మార్కెట్ లో Oppo A3 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Oppo A3 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ పై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఎస్బీఐ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ ఓషన్ బ్లూ మరియు నెబులా రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Oppo A3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Oppo A3 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Oppo A3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వినియోగించారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.

మెమొరీ: Oppo A3 5G డివైజ్ లో 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Oppo A3 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఎఫ్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Oppo A3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Oppo A3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ అందించారు.

ఇతర ఫీచర్లు: Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

బరువు, చుట్టుకొలత: Oppo A3 5G డివైజ్ 165.7 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 7.7 మి.మీ మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది.

The post Oppo A3 5G: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3-5g-launched-india-mediatek-dimensity-6300-chipset/feed/ 0