Oppo A3 5G: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3 5జీ

Highlights

  • భారత్‌లో Oppo A3 5G లాంచ్
  • 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా
  • ప్రారంభ ధర రూ.15,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా భారతీయ మార్కెట్ లో Oppo A3 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Oppo A3 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ పై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఎస్బీఐ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ ఓషన్ బ్లూ మరియు నెబులా రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Oppo A3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Oppo A3 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Oppo A3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వినియోగించారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.

మెమొరీ: Oppo A3 5G డివైజ్ లో 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Oppo A3 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఎఫ్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Oppo A3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Oppo A3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ అందించారు.

ఇతర ఫీచర్లు: Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

బరువు, చుట్టుకొలత: Oppo A3 5G డివైజ్ 165.7 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 7.7 మి.మీ మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది.