Lava Agni 3 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 09 Oct 2024 06:14:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/#respond Wed, 09 Oct 2024 06:13:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=14023 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఇటీవలె అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్యూయల్ డిస్ప్లేతో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క అఫీషియల్ సేల్ మొదలైంది. మరి, లావా అగ్ని 3 5జీ ఫోన్ ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? Lava Agni 3 5G […]

The post Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె లాంచైన Lava Agni 3 5G
  • నేటి నుంచి అమెజాన్ లో సేల్
  • ప్రారంభ ధర రూ.20,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఇటీవలె అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్యూయల్ డిస్ప్లేతో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క అఫీషియల్ సేల్ మొదలైంది. మరి, లావా అగ్ని 3 5జీ ఫోన్ ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా?

Lava Agni 3 5G ఆఫర్లు మరియు ధర

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.20,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.20,999 చార్జర్ లేకుండా విక్రయించబడనుంది. చార్జర్ తో కావాలంటే రూ.22,999 చెల్లించాలి. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర చార్జర్ తో రూ.24,999 గా ఉంది.

ఆఫర్ల విషయానికి వస్తే, బ్యాంక్ ఆఫర్ తో బేస్ వేరియంట్ పై చార్జర్ లేకుండా రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర వేరియంట్స్ పై చార్జర్‌తో వరుసగా రూ.2,000 మరియు రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ హీదర్ గ్లాస్ మరియు ప్రిస్టిన్ గ్లాస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఆఫర్ ధర

  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ: రూ.19,999 (చార్జర్ లేకుండా)
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ: రూ.20,999 (చార్జర్‌తో)
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ: రూ.22,499

ఈఎంఐ మరియు ఇతర ఆఫర్లు

  • మీరు గనుక, లావా అగ్ని 3 5జీ ఫోన్‌ని ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. 3 నుంచి 6 నెలల కాలపరిమితితో ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో భాగంగా, మీరు రూ.23,000 వరకు పూర్తి డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ స్థితిని బట్టి ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
  • మీరు అమెజాన్ ప్రైమ్ కస్టమర్ అయి ఉండి, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లయితే, మీకు 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ వస్తుంది.

లావా అగ్ని 3 5జీ ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి. ఇంకా ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

అమెజాన్ లింక్

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.74-ఇంచ్ అమోలెడ్ రియర్ స్క్రీన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ వాడారు. ఇది అద్భుతమైన అనుభూతిని అందించేందుకు బాగా సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్+ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి 3ఎక్స్ ఓఐఎస్+ఈఐఎస్ టెలీఫోటో కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఈఐఎస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Agni 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Lava Agni 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6ఈ, 14 5జీ బ్యాండ్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, నావిక్ జీపీఎస్ సిస్టమ్, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.

The post Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/feed/ 0