Lava Blaze 1X 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 29 Apr 2023 17:26:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz డిస్ప్లే, డైమెన్సిటీ 700 చిప్‌తో భారత్ లో లాంచైన Lava Blaze 1X 5G https://www.91mobiles.com/telugu/lava-blaze-1x-5g-launched-price-specs-availability/ Sat, 29 Apr 2023 17:26:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=6088 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా భారత్ లో Lava Blaze 1X 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Blaze 1X 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ డిస్ప్లే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులను ఉద్దేశించి లావా కంపెనీ ఈ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రీసెంట్ గా లావా సంస్థ Lava […]

The post 90Hz డిస్ప్లే, డైమెన్సిటీ 700 చిప్‌తో భారత్ లో లాంచైన Lava Blaze 1X 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారతీయ బడ్జెట్ కస్టమర్ల కోసం లాంచైన Lava Blaze 1X 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చిన డివైజ్
  • ఆఫ్‌లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన Lava Blaze 1X 5G

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా భారత్ లో Lava Blaze 1X 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Blaze 1X 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ డిస్ప్లే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులను ఉద్దేశించి లావా కంపెనీ ఈ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

రీసెంట్ గా లావా సంస్థ Lava Blaze 2, Lava Yuva 2 మరియు Lava Agni 2 5G వంటి ఫోన్లను లాంచ్ చేసింది. అయితే, Lava Blaze 1X 5G డివైజ్ ని మెల్లగా భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. వివరాలు లావా తన వెబ్‌సైట్ లో లిస్ట్ చేసింది. సరే, ఓసారి Lava Blaze 1X 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Lava Blaze 1X 5G ధర, కలర్స్, లభ్యత

భారత్ లో Lava Blaze 1X 5G డివైజ్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ తో లాంచైంది. ఈ ఫోన్ ధర రూ.11,999 గా ఉంది. గ్లాస్ గ్రీన్ మరియు గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ హ్యాండ్సెట్ లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze 1X 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Lava Blaze 1X 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 2.5డి కర్వ్డ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

కెమెరాలు

Lava Blaze 1X 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, వీజీఏ డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

చిప్సెట్

Lava Blaze 1X 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇది గేమింగ్ కి కూడా బాగానే పని చేస్తుంది.

స్టోరేజీ

ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. అయితే, 5జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉండటం విశేషం. ఇంటర్నల్ స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు పెంచుకోవచ్చు.

బ్యాటరీ

Lava Blaze 1X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్, సెక్యూరిటీ

Lava Blaze 1X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

డైమెన్షన్స్, వెయిట్

ఈ ఫోన్ 165.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 90Hz డిస్ప్లే, డైమెన్సిటీ 700 చిప్‌తో భారత్ లో లాంచైన Lava Blaze 1X 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Lava Blaze 1X 5G డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-blaze-1x-5g-design-specs-leak-details/ Thu, 27 Apr 2023 06:17:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=6053 స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీదారు లావా త్వరలోనే భారత్ లో రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. వీటిలో Lava Agni 2, Lava Blaze 1X 5G డివైజెస్ ఉన్నాయి. వీటిలో అతి త్వరలో లావా అగ్ని 2 లాంచ్ అవుతుంది. దీని తర్వాత Lava Blaze 1X 5G లాంచ్ కానుందని సమాచారం. అయితే ఈ ఫోన్ కి సంబంధించి అధికార సమాచారం బయటకు రాలేదు. అయితే తాజాగా ఓ కొత్త లీక్ ద్వారా […]

The post లీకైన Lava Blaze 1X 5G డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Lava Blaze 1X 5G వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్
  • గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోన్న Lava Blaze 1X 5G

స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీదారు లావా త్వరలోనే భారత్ లో రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. వీటిలో Lava Agni 2, Lava Blaze 1X 5G డివైజెస్ ఉన్నాయి. వీటిలో అతి త్వరలో లావా అగ్ని 2 లాంచ్ అవుతుంది. దీని తర్వాత Lava Blaze 1X 5G లాంచ్ కానుందని సమాచారం. అయితే ఈ ఫోన్ కి సంబంధించి అధికార సమాచారం బయటకు రాలేదు.

అయితే తాజాగా ఓ కొత్త లీక్ ద్వారా Lava Blaze 1X 5G డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ రివీల్ అయ్యాయి. అరిత్రా సర్కార్ అనే ట్విట్టర్ యూజర్, లావా మొబైల్స్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ ని షేర్ చేశాడు. దీంతో Lava Blaze 1X 5G డిజైన్ రివీల్ అయ్యింది.

అలాగే, ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Lava Blaze 1X 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని షేర్ చేశాడు.

Lava Blaze 1X 5G లీక్స్ విశేషాలు

Lava Blaze 1X 5G త్వరలో భారత్ లో లాంచ్ కాబోయే బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో వచ్చే నెల లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ కి ముందు Lava Blaze 1X 5G ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్, బ్లూ కలర్ ఆప్షన్, గ్లాస్ బ్యాక్ తో రానుందని లీకైన పిక్ ద్వారా తెలుస్తోంది. Lava Blaze 1X 5G డివైజ్ ప్రీమియమ్ మెటీరియల్స్ తో వచ్చే అవకాశం ఉంది.

Lava Blaze 1X 5G డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. డ్యూయల్-టోన్ కెమెరా మాడ్యూల్ లో ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తోంది. ఫోన్ ముందు వైపున, సన్నని సైడ్ బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్ ఉన్నాయి. కుడివైపున పవర్ బటన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Lava Blaze 1X 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

Lava Blaze 1X 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉండే అవకాశం ఉంది.

కలర్ ఆప్షన్స్, కనెక్టివిటీ

Lava Blaze 1X 5G డివైజ్ గ్లాస్ బ్లూ మరియు గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఒక స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఈ ఫోన్ వివిధ 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అవి: n1/n3/n5/n8/n28/n41/n77/n78.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

Lava Blaze 1X 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్

Lava Blaze 1X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. బాక్స్ లో కంపెనీ 12 వాట్ చార్జర్ ని అందించనుంది.

Lava Blaze 1X 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, ఒక వీజీఏ లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

ఓఎస్

Lava Blaze 1X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానుందని సమాచారం. ఈ ఫోన్ 8.9 మిల్లీ మీటర్ల మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Lava Blaze 1X 5G డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>