లీకైన Lava Blaze 1X 5G డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్

Highlights

  • భారత్ లో Lava Blaze 1X 5G వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్
  • గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోన్న Lava Blaze 1X 5G

స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీదారు లావా త్వరలోనే భారత్ లో రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. వీటిలో Lava Agni 2, Lava Blaze 1X 5G డివైజెస్ ఉన్నాయి. వీటిలో అతి త్వరలో లావా అగ్ని 2 లాంచ్ అవుతుంది. దీని తర్వాత Lava Blaze 1X 5G లాంచ్ కానుందని సమాచారం. అయితే ఈ ఫోన్ కి సంబంధించి అధికార సమాచారం బయటకు రాలేదు.

అయితే తాజాగా ఓ కొత్త లీక్ ద్వారా Lava Blaze 1X 5G డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ రివీల్ అయ్యాయి. అరిత్రా సర్కార్ అనే ట్విట్టర్ యూజర్, లావా మొబైల్స్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ ని షేర్ చేశాడు. దీంతో Lava Blaze 1X 5G డిజైన్ రివీల్ అయ్యింది.

అలాగే, ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Lava Blaze 1X 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని షేర్ చేశాడు.

Lava Blaze 1X 5G లీక్స్ విశేషాలు

Lava Blaze 1X 5G త్వరలో భారత్ లో లాంచ్ కాబోయే బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో వచ్చే నెల లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ కి ముందు Lava Blaze 1X 5G ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్, బ్లూ కలర్ ఆప్షన్, గ్లాస్ బ్యాక్ తో రానుందని లీకైన పిక్ ద్వారా తెలుస్తోంది. Lava Blaze 1X 5G డివైజ్ ప్రీమియమ్ మెటీరియల్స్ తో వచ్చే అవకాశం ఉంది.

Lava Blaze 1X 5G డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. డ్యూయల్-టోన్ కెమెరా మాడ్యూల్ లో ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తోంది. ఫోన్ ముందు వైపున, సన్నని సైడ్ బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్ ఉన్నాయి. కుడివైపున పవర్ బటన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Lava Blaze 1X 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

Lava Blaze 1X 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉండే అవకాశం ఉంది.

కలర్ ఆప్షన్స్, కనెక్టివిటీ

Lava Blaze 1X 5G డివైజ్ గ్లాస్ బ్లూ మరియు గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఒక స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఈ ఫోన్ వివిధ 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అవి: n1/n3/n5/n8/n28/n41/n77/n78.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

Lava Blaze 1X 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్

Lava Blaze 1X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. బాక్స్ లో కంపెనీ 12 వాట్ చార్జర్ ని అందించనుంది.

Lava Blaze 1X 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, ఒక వీజీఏ లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

ఓఎస్

Lava Blaze 1X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానుందని సమాచారం. ఈ ఫోన్ 8.9 మిల్లీ మీటర్ల మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.