Lava Blaze 2 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 11 Sep 2023 07:01:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టైన Lava Blaze 2 Pro https://www.91mobiles.com/telugu/lava-blaze-2-pro-launched-india-specs-expected-price/ Mon, 11 Sep 2023 07:01:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=7944 భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava మరొక కొత్త డివైజ్ ని భారతీయ యూజర్ల కోసం తీసుకొచ్చింది. Lava Blaze 2 Pro డివైజ్ లావా అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. అయితే ఈ ఫోన్ ధర ఇంకా వెల్లడి కాలేదు. కానీ, అన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Lava Blaze 2 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అంచనా ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Lava Blaze 2 Pro స్పెసిఫికేషన్స్ […]

The post 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టైన Lava Blaze 2 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Lava Blaze 2 Pro
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన Lava Blaze 2 Pro
  • 50ఎంపి కెమెరాతో ఎక్విప్ అయిన డివైజ్

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava మరొక కొత్త డివైజ్ ని భారతీయ యూజర్ల కోసం తీసుకొచ్చింది. Lava Blaze 2 Pro డివైజ్ లావా అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. అయితే ఈ ఫోన్ ధర ఇంకా వెల్లడి కాలేదు. కానీ, అన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Lava Blaze 2 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అంచనా ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Blaze 2 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Lava Blaze 2 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ 2.5డి కర్వ్డ్ స్క్రీన్ ఉంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్ తో వచ్చింది. ఈ డిస్ప్లే 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 16.7 మిలియన్ కలర్స్ సపోర్ట్ కలిగి ఉంది.
  • ప్రాసెసర్: Lava Blaze 2 Pro డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ616 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు.
  • స్టోరేజీ: Lava Blaze 2 Pro లో 8జిబి ఫిజికల్ ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ 128జిబి మరియు 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Lava Blaze 2 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, రెండు 2ఎంపి కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Lava Blaze 2 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ని ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 32 గంటల స్టాండ్‌బై టైమ్‌ని ఈ బ్యాటరీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
  • ఓఎస్: Lava Blaze 2 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Lava Blaze 2 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Lava Blaze 2 Pro ధర

Lava Blaze 2 Pro ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ 128జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. బేస్ మోడల్ ధర రూ.9,999 గా ఉండే అవకాశం ఉంది. టాప్ మోడల్ ధర రూ.12,999 ఉండవచ్చు. కొన్ని రోజుల్లో ఫోన్ ధరను కంపెనీ వెల్లడించనుంది.

The post 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టైన Lava Blaze 2 Pro first appeared on 91Mobiles Telugu.

]]>