
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava మరొక కొత్త డివైజ్ ని భారతీయ యూజర్ల కోసం తీసుకొచ్చింది. Lava Blaze 2 Pro డివైజ్ లావా అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. అయితే ఈ ఫోన్ ధర ఇంకా వెల్లడి కాలేదు. కానీ, అన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Lava Blaze 2 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అంచనా ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Lava Blaze 2 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Lava Blaze 2 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ 2.5డి కర్వ్డ్ స్క్రీన్ ఉంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్ తో వచ్చింది. ఈ డిస్ప్లే 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 16.7 మిలియన్ కలర్స్ సపోర్ట్ కలిగి ఉంది.
- ప్రాసెసర్: Lava Blaze 2 Pro డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ616 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు.
- స్టోరేజీ: Lava Blaze 2 Pro లో 8జిబి ఫిజికల్ ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ 128జిబి మరియు 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Lava Blaze 2 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, రెండు 2ఎంపి కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Lava Blaze 2 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ని ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 32 గంటల స్టాండ్‌బై టైమ్‌ని ఈ బ్యాటరీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
- ఓఎస్: Lava Blaze 2 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Lava Blaze 2 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Lava Blaze 2 Pro ధర
Lava Blaze 2 Pro ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ 128జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. బేస్ మోడల్ ధర రూ.9,999 గా ఉండే అవకాశం ఉంది. టాప్ మోడల్ ధర రూ.12,999 ఉండవచ్చు. కొన్ని రోజుల్లో ఫోన్ ధరను కంపెనీ వెల్లడించనుంది.











