Lava Blaze 2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 10 Apr 2023 10:11:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6జిబి ర్యామ్ + 5జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచైన LAVA Blaze 2 https://www.91mobiles.com/telugu/lava-blaze-2-launched-india-price-specs-availability/ Mon, 10 Apr 2023 10:11:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=5809 భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ లావా తాజాగా మార్కెట్ లో LAVA Blaze 2 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6జిబి ర్యామ్, యూనిసాక్ టీ616 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లో లాంచైంది. సరే, ఓసారి LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. LAVA Blaze 2 ధర మరియు సేల్ వివరాలు […]

The post 6జిబి ర్యామ్ + 5జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచైన LAVA Blaze 2 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన LAVA Blaze 2 డివైజ్
  • 5జిబి వర్చువల్ ర్యామ్ కల్గి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత
  • ఏప్రిల్ 18 నుంచి మొదలుకానున్న LAVA Blaze 2 సేల్

భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ లావా తాజాగా మార్కెట్ లో LAVA Blaze 2 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6జిబి ర్యామ్, యూనిసాక్ టీ616 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లో లాంచైంది. సరే, ఓసారి LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

LAVA Blaze 2 ధర మరియు సేల్ వివరాలు

LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ కేవలం సింగిల్ వేరియంట్ లో మాత్రమే లాంచైంది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తోంది. LAVA Blaze 2 భారత మార్కెట్ లో రూ.8,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్ మరియు గ్లాస్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఏప్రిల్ 18 నుంచి LAVA Blaze 2 డివైజ్ సేల్ మొదలవుతుంది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనాలని భావించే వారు స్పెసిఫికేషన్స్ పూర్తిగా చదివి, మీకు సరిపడేదైతే గనుక ప్రయత్నించండి.

LAVA Blaze 2 స్పెసిఫికేషన్స్

  • యూనిసాక్ టీ616 ప్రాసెసర్
  • 5జిబి వర్చువల్ ర్యామ్
  • 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ

LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ డిజైన్ డిస్ప్లే, 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. డిస్ప్లే కి మూడు వైపులా బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో చిన్ మందంగా ఉంది. టాప్ లో ఫ్రంట్ కెమెరా కోసం పంచ్-హోల్ ఉంది. ఇది కెమెరా సెన్సర్ కంటే పెద్దగా కనిపిస్తోంది.

LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ టీ616 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్సెట్ 255298 అంటుటు స్కోర్ ని నమోదు చేసినట్లు కంపెనీ చెబుతోంది. రూ.10 వేల ధరలో లభించే మీడియాటెక్ హీలియో జీ85 మరియు హీలియో జీ88 చిప్సెట్స్ ని కూడా ఇది వెనక్కి నెడుతుంది. ఈ లావా డివైజ్ 5జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్ 6జిబి ర్యామ్ తో కలుపుకుని మొత్తం 11జిబి ర్యామ్ యూజర్ కి లభిస్తుంది.

13ఎంపి ఏఐ కెమెరా

LAVA Blaze 2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ సెన్సర్, ఈ సెన్సర్ సెకండరీ ఏఐ సెన్సర్ తో కలిసి పని చేస్తుంది.

18 వాట్ ఫాస్ట్ చార్జింగ్

LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో బ్లూటూత్, డ్యూయల్ సిమ్, 4జీ, జీపీఎస్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6జిబి ర్యామ్ + 5జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచైన LAVA Blaze 2 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి సిద్ధంగా ఉన్న Lava Blaze 2, రూ.10 వేల లోపు ధరతో అమెజాన్ ద్వారా త్వరలో విక్రయం! https://www.91mobiles.com/telugu/lava-blaze-2-to-launch-soon-india-confirms-amazon-listing/ Fri, 31 Mar 2023 16:09:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=5695 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే Lava Blaze 2 ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా ఫోన్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. అమెజాన్ లో Lava Blaze 2 మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. అలాగే కొన్ని ప్రధానమైన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. Lava Blaze 2 […]

The post లాంచ్ కి సిద్ధంగా ఉన్న Lava Blaze 2, రూ.10 వేల లోపు ధరతో అమెజాన్ ద్వారా త్వరలో విక్రయం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ ఇండియా ద్వారా విక్రయానికి రానున్న Lava Blaze 2
  • 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ కలిగి ఉండనున్న Lava Blaze 2
  • 90 హెర్ట్జ్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే తో వస్తోన్న డివైజ్

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే Lava Blaze 2 ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా ఫోన్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. అమెజాన్ లో Lava Blaze 2 మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. అలాగే కొన్ని ప్రధానమైన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి.

Lava Blaze 2 డిజైన్

Lava Blaze 2 డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ ని కలిగి ఉంది. పంచ్ హోల్ లో ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. రియర్ ప్యానెల్ పై రెండు పెద్ద సర్కిల్స్ లో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. బ్లేజ్ సిరీస్ లో లావా సంస్థ Lava Blaze 2 కంటే ముందు లావా బ్లేస్ నెక్ట్స్, లావా బ్లేస్ ప్రో, లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది.

రూ.10,000 లోపు ధరలో లభించనున్న Lava Blaze 2

లావా సంస్థ Lava Blaze 2 స్మార్ట్ ఫోన్ ని రూ.10,000 సెగ్మెంట్ లో శక్తివంతమైన డివైజ్ గా చెబుతోంది. అంటుటు స్కోర్ ప్రకారం లావా ఈ వ్యాఖ్య చేసింది. ఇకపోతే Lava Blaze 2 డివైజ్ 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లావా సంస్థ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. దీని ద్వారా 5జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు.

Lava Blaze 2 స్పెసిఫికేషన్స్

అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, Lava Blaze 2 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 128జిబి యూఎఫ్ఎస్ మెమొరీని కలిగి ఉంటుంది. 6జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్ + 5జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ లో వాడబడిన ప్రాసెసర్ పేరుని ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ చిప్ 2,50,000+ అంటుటు స్కోర్ ని నమోదు చేసింది. ఈ చిప్ 12ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. ఇకపోతే Lava Blaze 2 డివైజ్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అందించారు.

Lava Blaze 2 రీసెంట్ గా గీక్‌బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. దాని ప్రకారం, ఈ డివైజ్ యూనిసాక్ ప్రాసెసర్, 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ బ్లేజ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ప్రస్తుతానికి Lava Blaze 2 కి సంబంధించి తెలిసిన విషయాలు ఇవే.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి సిద్ధంగా ఉన్న Lava Blaze 2, రూ.10 వేల లోపు ధరతో అమెజాన్ ద్వారా త్వరలో విక్రయం! first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ పై కనిపించిన కొత్త లావా ఫోన్, త్వరలోనే లాంచ్! https://www.91mobiles.com/telugu/lava-blaze-2-4g-phone-spotted-geekbench-database-launching-soon/ Tue, 28 Mar 2023 08:22:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=5609 భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలోనే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. జెడ్-సిరీస్ లో ఈ ఫోన్ వస్తుంది. అయితే, కంపెనీ దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కానీ, బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పైన ఒక లావా లో-బడ్జెట్ ఫోన్ కనిపించింది. అయితే లిస్టింగ్ లో ఫోన్ పేరు పేర్కొనబడలేదు. కానీ, ఇది Lava Blaze 2 అనే పేరుతో రానున్న ఒక 4జీ […]

The post గీక్‌బెంచ్ పై కనిపించిన కొత్త లావా ఫోన్, త్వరలోనే లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లావా నుంచి రానున్న కొత్త ఫోన్ ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • యూనిసాక్ టీ616 చిప్సెట్ తో రానున్న లావా కొత్త ఫోన్, ధర రూ.10 వేల లోపు ఉండే చాన్స్
  • రాబోవు లావా ఫోన్ పేరు Lava Blaze 2 అయ్యుండొచ్చని సమాచారం

భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలోనే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. జెడ్-సిరీస్ లో ఈ ఫోన్ వస్తుంది. అయితే, కంపెనీ దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కానీ, బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పైన ఒక లావా లో-బడ్జెట్ ఫోన్ కనిపించింది. అయితే లిస్టింగ్ లో ఫోన్ పేరు పేర్కొనబడలేదు. కానీ, ఇది Lava Blaze 2 అనే పేరుతో రానున్న ఒక 4జీ ఫోన్ అని సమాచారం. సరే, ఈ ఫోన్ కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం పదండి.

గీక్ బెంచ్ పై లిస్ట్ ఐన లావా కొత్త ఫోన్

దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలోనే భారత్ లో ఒక చవకైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఏప్రిల్ లో ఈ లావా లో-బడ్జెట్ ఫోన్ భారత మార్కెట్ లోకి ప్రవేశించనుందని అంచనా. ఇకపోతే గీక్ బెంచ్ ప్రకారం, ఈ ఫోన్ యూనిసాక్ టీ616 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉండనుందని అంచనా వేస్తున్నారు.

Lava Blaze 2 గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ యూనిసాక్ చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇది 1.82 గిగాహెర్ట్జ్ బేస్ ఫ్రీక్వెన్సీ కలిగిన ఆక్టా-కోర్ చిప్. క్లాక్ స్పీడ్ 1.95 గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. Lava Blaze 2 స్మార్ట్ ఫోన్ LZX409 మోడల్ నంబర్ ని కలిగి ఉంది. గీక్ బెంచ్ 5 టెస్టింగ్ లో Lava Blaze 2 డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 359 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 1497 పాయింట్లు సాధించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తోంది. అలాగే 6జిబి ర్యామ్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

గీక్ బెంచ్ ద్వారా రివీల్ అయిన సమాచారం ఇంతే. అయితే ఇటీవలె లీకైన Lava Blaze 2 ఇమేజెస్ ద్వారా ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ గ్లాస్ బ్యాక్, రెండు భారీ రింగ్స్ ని కలిగి ఉంది. భారీ రింగ్స్ లో కెమెరా సెన్సర్స్ ఉంటాయి. ఫోన్ సైడ్స్ ఫ్లాట్ గా ఉంటాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఉంటాయి. భద్రత కోసం ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. లీకైన ఇమేజ్ లో ఫోన్ ఫ్రంట్ డిజైన్ చూపబడలేదు. కానీ, ఈ ఫోన్ మందపాటి బెజెల్స్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గీక్‌బెంచ్ పై కనిపించిన కొత్త లావా ఫోన్, త్వరలోనే లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>