గీక్‌బెంచ్ పై కనిపించిన కొత్త లావా ఫోన్, త్వరలోనే లాంచ్!

Highlights

  • లావా నుంచి రానున్న కొత్త ఫోన్ ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • యూనిసాక్ టీ616 చిప్సెట్ తో రానున్న లావా కొత్త ఫోన్, ధర రూ.10 వేల లోపు ఉండే చాన్స్
  • రాబోవు లావా ఫోన్ పేరు Lava Blaze 2 అయ్యుండొచ్చని సమాచారం

భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలోనే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. జెడ్-సిరీస్ లో ఈ ఫోన్ వస్తుంది. అయితే, కంపెనీ దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కానీ, బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పైన ఒక లావా లో-బడ్జెట్ ఫోన్ కనిపించింది. అయితే లిస్టింగ్ లో ఫోన్ పేరు పేర్కొనబడలేదు. కానీ, ఇది Lava Blaze 2 అనే పేరుతో రానున్న ఒక 4జీ ఫోన్ అని సమాచారం. సరే, ఈ ఫోన్ కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం పదండి.

గీక్ బెంచ్ పై లిస్ట్ ఐన లావా కొత్త ఫోన్

దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలోనే భారత్ లో ఒక చవకైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఏప్రిల్ లో ఈ లావా లో-బడ్జెట్ ఫోన్ భారత మార్కెట్ లోకి ప్రవేశించనుందని అంచనా. ఇకపోతే గీక్ బెంచ్ ప్రకారం, ఈ ఫోన్ యూనిసాక్ టీ616 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉండనుందని అంచనా వేస్తున్నారు.

Lava Blaze 2 గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ యూనిసాక్ చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇది 1.82 గిగాహెర్ట్జ్ బేస్ ఫ్రీక్వెన్సీ కలిగిన ఆక్టా-కోర్ చిప్. క్లాక్ స్పీడ్ 1.95 గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. Lava Blaze 2 స్మార్ట్ ఫోన్ LZX409 మోడల్ నంబర్ ని కలిగి ఉంది. గీక్ బెంచ్ 5 టెస్టింగ్ లో Lava Blaze 2 డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 359 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 1497 పాయింట్లు సాధించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తోంది. అలాగే 6జిబి ర్యామ్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

గీక్ బెంచ్ ద్వారా రివీల్ అయిన సమాచారం ఇంతే. అయితే ఇటీవలె లీకైన Lava Blaze 2 ఇమేజెస్ ద్వారా ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ గ్లాస్ బ్యాక్, రెండు భారీ రింగ్స్ ని కలిగి ఉంది. భారీ రింగ్స్ లో కెమెరా సెన్సర్స్ ఉంటాయి. ఫోన్ సైడ్స్ ఫ్లాట్ గా ఉంటాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఉంటాయి. భద్రత కోసం ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. లీకైన ఇమేజ్ లో ఫోన్ ఫ్రంట్ డిజైన్ చూపబడలేదు. కానీ, ఈ ఫోన్ మందపాటి బెజెల్స్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరూ.10 వేల లోపు ధరతో వస్తోన్న Redmi 12C
Next articleలీకైన Motorola Edge 40 స్పెసిఫికేషన్స్, Edge 40 Pro రెండర్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.