Lava Blaze 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 03 Aug 2023 09:10:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Blaze 5G: లాంచైన 8GB ర్యామ్‌ వేరియంట్‌; ధర రూ.12,999 మాత్రమే! https://www.91mobiles.com/telugu/lava-blaze-5g-8gb-ram-variant-launched-india-price-rs-12999/ Thu, 03 Aug 2023 09:10:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=7452 స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన Lava భారతీయ మార్కెట్ లో గతేడాది Lava Blaze 5G అనే డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ పవర్ఫుల్ వేరియంట్ ని తీసుకొచ్చింది. అంతే కాదు, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో పాటు, 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభించనుంది. సరే, ఓసారి […]

The post Lava Blaze 5G: లాంచైన 8GB ర్యామ్‌ వేరియంట్‌; ధర రూ.12,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన Lava Blaze 5G
  • డైమెన్సిటీ 700 చిప్ ని ఆఫర్ చేస్తున్న డివైజ్
  • ఆండ్రాయిడ్ 13 పై పని చేయనున్న Lava Blaze 5G

స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన Lava భారతీయ మార్కెట్ లో గతేడాది Lava Blaze 5G అనే డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ పవర్ఫుల్ వేరియంట్ ని తీసుకొచ్చింది. అంతే కాదు, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో పాటు, 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభించనుంది. సరే, ఓసారి Lava Blaze 5G ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం.

Lava Blaze 5G ధర, లభ్యత

Lava Blaze 5G డివైజ్ 8జిబి వేరియంట్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ ని రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు. కంపెనీ బ్యాంక్ ఆఫర్ ని రన్ చేస్తోంది. దీని ద్వారా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అంటే Lava Blaze 5G ఫోన్ ని కస్టమర్లు రూ.11,499 కే సొంతం చేసుకోవచ్చు. నేటి నుంచి అమెజాన్ ద్వారా Lava Blaze 5G డివైజ్ సేల్స్ మొదలయ్యాయి.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Lava Blaze 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Lava Blaze 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు.
  • స్టోరేజీ: Lava Blaze 5G డివైజ్ 128జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తోంది. ఇంకా 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. దీంతో 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Lava Blaze 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Lava Blaze 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Blaze 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post Lava Blaze 5G: లాంచైన 8GB ర్యామ్‌ వేరియంట్‌; ధర రూ.12,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచైన Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/lava-blaze-5g-6gb-ram-variant-launched-india-price-specs-availability/ Fri, 10 Feb 2023 11:00:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=4871 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గతేడాది Lava Blaze 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. అప్పుడు 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా ఈ కంపెనీ Lava Blaze 5G 6జిబి వేరియంట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ర్యామ్ అప్‌గ్రేడ్ మినహా, Lava Blaze 5G అవే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 […]

The post భారత్ లో లాంచైన Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చిన Lava Blaze 5G
  • భారత్ లో Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,499

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గతేడాది Lava Blaze 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. అప్పుడు 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా ఈ కంపెనీ Lava Blaze 5G 6జిబి వేరియంట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ర్యామ్ అప్‌గ్రేడ్ మినహా, Lava Blaze 5G అవే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని కలిగి ఉంటుంది.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 90 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Lava Blaze 5G 6జిబి ర్యామ్ యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Lava Blaze 5G 6GB ర్యామ్ ధర

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ తాజాగా భారత్ లో లాంచైంది. ఇది 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.11,499 గా నిర్ణయించారు. ఇది ఫస్ట్ సేల్ స్పెషల్ ధర అని గమనించాలి. తర్వాత ఫోన్ ధర రూ.11,999 కి మారిపోతుంది. లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా ద్వారా ఫిబ్రవరి 16 నుంచి Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ ని కలిగి ప్రీమియమ్ లుక్ తో ఉంటుంది. ఫోన్ గ్లాస్ బ్యాక్ డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. 4జిబి/6జిబి ర్యామ్ తో పాటు 3జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు. మెమొరీ కార్డ్ ద్వారా 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ని వాడారు.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరా అందించారు.

Lava Blaze 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఫోన్ తో పాటు 12 వాట్ డ్యూయల్ పోర్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచైన Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
నేడు మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానున్న Lava Blaze 5G ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/lava-blaze-5g-first-sale-from-today-via-amazon/ Tue, 15 Nov 2022 05:25:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=3430 హైలైట్స్ భారతదేశపు చవకైన 5జీ ఫోన్ గా వస్తోన్న Lava Blaze 5G అమెజాన్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం Lava Blaze 5G ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.9,999 స్వదేశీ కంపెనీ Lava ఇటీవలె అత్యంత చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. నేటి నుంచి Lava Blaze 5G మొదటి సేల్ ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న […]

The post నేడు మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానున్న Lava Blaze 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారతదేశపు చవకైన 5జీ ఫోన్ గా వస్తోన్న Lava Blaze 5G
  • అమెజాన్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం
  • Lava Blaze 5G ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.9,999

స్వదేశీ కంపెనీ Lava ఇటీవలె అత్యంత చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. నేటి నుంచి Lava Blaze 5G మొదటి సేల్ ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న చీపెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ తో వస్తోంది.

Lava Blaze 5G లభ్యత

Lava Blaze 5G నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon India వెబ్‌సైట్/యాప్ ద్వారా కొనేందుకు అందుబాటులో ఉంటుంది.

Lava Blaze 5G ధర, లాంచ్ ఆఫర్స్

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర రూ.10,999 గా నిర్ణయించారు. అయితే ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద Lava Blaze 5G రూ.9,999 కే లభించనుంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ (1600*720) పిక్సెల్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తుండటం విశేషం. అంటే మీరు ఓటీటీ కంటెంట్ ని హెచ్డీ క్లారిటీతో చూడవచ్చు. ఇంకా సెల్ఫీ కెమెరా కోసం ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు.

Lava Blaze 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ని వాడారు. ఇది 7ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. Lava Blaze 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

Lava Blaze 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Lava Blaze 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అందించారు. ఈ ఫోన్ లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. Lava Blaze 5G లో (హైబ్రిడ్) మైక్రో-ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంది. డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Lava Blaze 5G రెండు కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతోంది. అవి: గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్. ఈ హ్యాండ్సెట్ 165.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, సుమారు 200 గ్రాముల బరువు ఉంటుంది.

Lava Blaze 5G పోటీ పడేది వీటితోనే

Lava Blaze 5G ప్రథమంగా POCO M4 5G, Samsung Galaxy M13 5G, Moto G51 5G ఫోన్లతో పోటీ పడనుంది. అయితే ఈ జాబితాలో రూ.10,000 లోపు ధరలో లభిస్తోన్న ఏకైక ఫోన్ Lava Blaze 5G.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నేడు మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానున్న Lava Blaze 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Blaze 5G: నవంబర్ 15 న ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/lava-blaze-5g-first-sale-amazon-price-offers/ Thu, 10 Nov 2022 07:47:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=3357 హైలైట్స్ నవంబర్ 15 నుంచి అమెజాన్ ద్వారా మొదలుకానున్న Lava Blaze 5G సేల్ 90 హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ భారత్ లో ఇంట్రడక్టరీ ప్రైస్ ని రూ.9,999 గా నిర్ణయించిన లావా కంపెనీ స్వదేశీ మొబైల్ ఫోన్ కంపెనీ Lava ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ని పరిచయం చేసింది. ఈ ఫోన్ ఇటీవలె అమెజాన్ ద్వారా రివీల్ […]

The post Lava Blaze 5G: నవంబర్ 15 న ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 15 నుంచి అమెజాన్ ద్వారా మొదలుకానున్న Lava Blaze 5G సేల్
  • 90 హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో ఇంట్రడక్టరీ ప్రైస్ ని రూ.9,999 గా నిర్ణయించిన లావా కంపెనీ

స్వదేశీ మొబైల్ ఫోన్ కంపెనీ Lava ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ని పరిచయం చేసింది. ఈ ఫోన్ ఇటీవలె అమెజాన్ ద్వారా రివీల్ అయ్యింది. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. రూ.9,999 ఇంట్రడక్టరీ ధరతో ఫోన్ ని లావా తీసుకొచ్చింది. Lava Blaze 5G నవంబర్ 15 నుంచి భారత మార్కెట్ లో విక్రయానికి వస్తోంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze 5G మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తో వస్తోంది. 4జిబి ర్యామ్ వేరియంట్ లో ఈ ఫోన్ లభించనుంది. 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, 50 మెగా పిక్సెల్ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, పోకో ఎమ్4 ప్రో 5జీ, రియల్మీ 9ఐ 5జీ ఫోన్స్ తో పోటీ పడనుంది. Lava Blaze 5G యొక్క ధర, లభ్యత, ఇతర స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Lava Blaze 5G ధర, లభ్యత

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద ఈ ఫోన్ రూ.9999 కే లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ నవంబర్ 15 న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా మొదలవుతుంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. Lava Blaze 5G వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తోంది.

Lava Blaze 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఉపయోగించారు. డైమెన్సిటీ 700 చిప్ 7ఎన్ఎమ్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ ని మనం ఎన్నో మిడ్ రేంజ్ హ్యాండ్సెట్స్ లో చూశాం. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, పోకో ఎమ్3 ప్రో 5జీ, రియల్మీ 8 5జీ తదితర ఫోన్లలో ఈ ప్రాసెసర్ ని వాడారు.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లో 4జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్ తో పాటు 3జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీని ద్వారా మొత్తం 7జిబి ర్యామ్ ని పొందవచ్చు. ఇకపోతే 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

ఇప్పుడు Lava Blaze 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Lava Blaze 5G లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Lava Blaze 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇది పవర్ బటన్ లో నిక్షిప్తమై ఉంటుంది. Lava Blaze 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Lava Blaze 5G: నవంబర్ 15 న ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.9,999 లాంచ్ ఆఫర్ తో సేల్ కి వస్తోన్న Lava Blaze 5G https://www.91mobiles.com/telugu/lava-blaze-5g-launched-india-price-specs-availability/ Mon, 07 Nov 2022 10:47:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=3276 హైలైట్స్ భారత్ లో లాంచ్ అయిన అత్యంత చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా అన్‌వీల్ అయిన Lava Blaze 5G, త్వరలోనే మొదలుకానున్న సేల్ 50ఎంపి కెమెరా, 7జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన Lava Blaze 5G, ధర రూ.9,999 భారత్ లో ఇటీవలె 5జీ సేవలు లాంచ్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు 5జీ నెట్వర్క్ ని విస్తరింపజేసేందుకు టెలీకామ్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు మొబైల్ ఫోన్ తయారీ […]

The post రూ.9,999 లాంచ్ ఆఫర్ తో సేల్ కి వస్తోన్న Lava Blaze 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన అత్యంత చవకైన 5జీ స్మార్ట్ ఫోన్
  • అమెజాన్ ద్వారా అన్‌వీల్ అయిన Lava Blaze 5G, త్వరలోనే మొదలుకానున్న సేల్
  • 50ఎంపి కెమెరా, 7జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన Lava Blaze 5G, ధర రూ.9,999

భారత్ లో ఇటీవలె 5జీ సేవలు లాంచ్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు 5జీ నెట్వర్క్ ని విస్తరింపజేసేందుకు టెలీకామ్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు వరుసగా 5జీ హ్యాండ్సెట్స్ ని మార్కెట్ లోకి వదులుతున్నాయి. అయితే వీటి ప్రారంభ ధర దాదాపు రూ.15,000 నుంచి మొదలవుతోంది. దీంతో అంత మొత్తం వెచ్చించలేని వినియోగదారులు అత్యంత చవకైన 5జీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో భారతీయ కంపెనీ లావా తన Lava Blaze 5G అనే స్మార్ట్ ఫోన్ తో రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు ఉన్న అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే కావడం విశేషం.

అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. నేడే ఈ ఫోన్ అమెజాన్ ద్వారా అన్‌వీల్ అయ్యింది. సేల్ తేదీని ఇంకా లావా కంపెనీ ప్రకటించలేదు. మరి Lava Blaze 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava Blaze 5G ధర

భారత్ లో Lava Blaze 5G లాంచ్ అయ్యింది. రూ.9,999 ధరతో భారత్ లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. Lava Blaze 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ని ప్రత్యేక ఆఫర్ లో రూ.9,999 కే కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ సేల్ లోనే ఈ ధర వర్తిస్తుంది. తర్వాత ఈ ధర ఉండకపోవచ్చు. అందుకే ఆసక్తిగల వారు వెంటనే నోటిఫై చేసుకుని ఫోన్ ని కొనేందుకు సిద్ధమవ్వండి. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ డిస్ప్లే వైడ్‌వైన్ ఎల్1 సపోర్ట్ తో వస్తోంది. దీని ద్వారా ఓటీటీ మరియు ఇతర వీడియో కంటెంట్ ని హెచ్డీ క్వాలిటీలో చూడవచ్చు.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ వాడారు. ఇది 7 నానోమీటర్ ఫాబ్రికేషన్ పై తయారైన చిప్సెట్. ఈ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లో 4జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్ తో పాటు 3జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీని ద్వారా మొత్తం 7జిబి ర్యామ్ ని పొందవచ్చు. ఇకపోతే 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

ఇప్పుడు Lava Blaze 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Lava Blaze 5G లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Lava Blaze 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇది పవర్ బటన్ లో నిక్షిప్తమై ఉంటుంది. Lava Blaze 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.9,999 లాంచ్ ఆఫర్ తో సేల్ కి వస్తోన్న Lava Blaze 5G first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోన్న Lava Blaze 5G https://www.91mobiles.com/telugu/lava-blaze-5g-sale-date-revealed/ Tue, 01 Nov 2022 08:11:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=3167 హైలైట్స్ త్వరలో అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ విక్రయ తేదీని అధికారికంగా ప్రకటించిన లావా, ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Lava Blaze 5G ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 లో లావా కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారతదేశపు […]

The post అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోన్న Lava Blaze 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Lava Blaze 5G స్మార్ట్ ఫోన్
  • విక్రయ తేదీని అధికారికంగా ప్రకటించిన లావా, ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 లో లావా కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారతదేశపు తొలి చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ అని లావా సంస్థ చెబుతోంది. అయితే ఈ డివైజ్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. ఇప్పుడు కంపెనీ, ఈ ఫోన్ ని అమెజాన్ ద్వారా అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.

Lava Blaze 5G నవంబర్ 3 న రివీల్ అవుతోంది. అంటే మరో రెండు రోజులే సమయం ఉంది. ఈ ఫోన్ డ్యూ-డ్రాప్ స్టైల్ నాచ్ తో వస్తోంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. మరి Lava Blaze 5G ఫోన్ కి సంబంధించిన విశేషాలేంటో ఇక్కడ చూద్దాం పదండి.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 లో లాంచ్ అయ్యింది. అప్పుడే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Lava Blaze 5G డివైజ్ 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఇది 2.5డి కర్వ్డ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.

Lava Blaze 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అమర్చారు. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ చిప్ 7 నానోమీటర్ ఫాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది. ఇదే చిప్సెట్ Redmi 11 Prime, Poco M4 5G తదితర ఫోన్లలో ఉంది. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ స్టోరేజీతో వస్తోంది. ఈ ఫోన్ లో 3జిబి వర్చువల్ ర్యామ్ ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Lava Blaze 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Lava Blaze 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, డెప్త్, మ్యాక్రో యూనిట్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరా అందించారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తోంది.

భద్రత కోసం Lava Blaze 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. మల్టీపుల్ 5జీ బ్యాండ్ సపోర్ట్, 4జీ వోల్టీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Lava Blaze 5G ధర, లభ్యత

Lava Blaze 5G ధర దాదాపు రూ.10,000 గా ఉండనుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో దొరుకుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోన్న Lava Blaze 5G first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-blaze-5g-launched-india-specs-price-availability/ Mon, 03 Oct 2022 14:28:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=2715 హైలైట్స్: స్వదేశీ కంపెనీ Lava నుంచి వచ్చిన తొలి 5జీ స్మార్ట్ ఫోన్ Blaze 5G 6.5-ఇంచ్ హెచ్డీ+ 90హెర్ట్జ్ ఎల్సీడీ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ రూ.10,000 ధరతో Lava Blaze 5G సేల్ కి వచ్చే అవకాశం స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన Lava తాజాగా Lava Blaze 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది లావా కంపెనీ నుంచి వచ్చిన తొలి 5జీ స్మార్ట్ […]

The post భారత్ లో లాంచ్ అయిన Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • స్వదేశీ కంపెనీ Lava నుంచి వచ్చిన తొలి 5జీ స్మార్ట్ ఫోన్ Blaze 5G
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ 90హెర్ట్జ్ ఎల్సీడీ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ
  • రూ.10,000 ధరతో Lava Blaze 5G సేల్ కి వచ్చే అవకాశం

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన Lava తాజాగా Lava Blaze 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది లావా కంపెనీ నుంచి వచ్చిన తొలి 5జీ స్మార్ట్ ఫోన్. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 లో కేంద్ర రైల్వేస్, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ హ్యాండ్సెట్ ని రివీల్ చేశారు. Lava Blaze 5G భారతదేశపు అత్యంత చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ అని కంపెనీ చెబుతోంది. అయితే ఇంకా ఈ ఫోన్ యొక్క ధరను కంపెనీ వెల్లడించలేదు. రూ.10,000 రేంజ్ లో ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం లావ్ బ్లేజ్ లైనప్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అయితే అవి 4జీ హ్యాండ్సెట్స్. అవి: Lava Blaze, Lava Blaze Pro. పీఎమ్ నరేంద్ర మోదీ శనివారం నాడు దేశంలో 5జీ సేవలను లాంచ్ చేసిన అనంతరం లావా కంపెనీ Lava Blaze 5G ఫోన్ ని లాంచ్ చేసింది.

భారత్ లో Lava Blaze 5G ధర, లభ్యత

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా భారత్ లో Lava Blaze 5G ధర అత్యంత చౌకగా ఉండనుంది. ఈ హ్యాండ్సెట్ ధర దాదాపు రూ.10,000 గా ఉండే అవకాశం ఉంది. త్వరలోనే సేల్ తేదీ, ధర వివరాలను లావా వెల్లడించనుంది. Lava Blaze 5G ప్రీ-ఆర్డర్ దీపావళి నుంచి ప్రారంభం కానుంది. బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో Lava Blaze 5G ఫోన్ లభించనుంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G లో 6.5-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. అలాగే 1600*720 పిక్సెల్స్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఈ డిస్ప్లే సొంతం. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ని ఈ ఫోన్లో వినియోగించారు. Lava Blaze 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. చార్జింగ్ స్పీడ్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. వర్చువల్ ర్యామ్ ద్వారా 3జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉంది.

Lava Blaze 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే Lava Blaze 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్, ఒక మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై Lava Blaze 5G ఫోన్ పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post భారత్ లో లాంచ్ అయిన Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>