అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోన్న Lava Blaze 5G

హైలైట్స్

  • త్వరలో అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Lava Blaze 5G స్మార్ట్ ఫోన్
  • విక్రయ తేదీని అధికారికంగా ప్రకటించిన లావా, ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 లో లావా కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారతదేశపు తొలి చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ అని లావా సంస్థ చెబుతోంది. అయితే ఈ డివైజ్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. ఇప్పుడు కంపెనీ, ఈ ఫోన్ ని అమెజాన్ ద్వారా అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.

Lava Blaze 5G నవంబర్ 3 న రివీల్ అవుతోంది. అంటే మరో రెండు రోజులే సమయం ఉంది. ఈ ఫోన్ డ్యూ-డ్రాప్ స్టైల్ నాచ్ తో వస్తోంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. మరి Lava Blaze 5G ఫోన్ కి సంబంధించిన విశేషాలేంటో ఇక్కడ చూద్దాం పదండి.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 లో లాంచ్ అయ్యింది. అప్పుడే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Lava Blaze 5G డివైజ్ 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఇది 2.5డి కర్వ్డ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.

Lava Blaze 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అమర్చారు. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ చిప్ 7 నానోమీటర్ ఫాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది. ఇదే చిప్సెట్ Redmi 11 Prime, Poco M4 5G తదితర ఫోన్లలో ఉంది. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ స్టోరేజీతో వస్తోంది. ఈ ఫోన్ లో 3జిబి వర్చువల్ ర్యామ్ ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Lava Blaze 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Lava Blaze 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, డెప్త్, మ్యాక్రో యూనిట్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరా అందించారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తోంది.

భద్రత కోసం Lava Blaze 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. మల్టీపుల్ 5జీ బ్యాండ్ సపోర్ట్, 4జీ వోల్టీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Lava Blaze 5G ధర, లభ్యత

Lava Blaze 5G ధర దాదాపు రూ.10,000 గా ఉండనుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో దొరుకుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleభారత్ కి iQOO 10 గా రానున్న iQOO 11 చైనా వేరియంట్
Next articleలేటెస్ట్ అప్డేట్ తో కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన WhatsApp
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.