Lava Yuva 4 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 24 Jan 2024 18:21:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 LAVA: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో రానున్న LAVA Yuva 4 Pro 5G https://www.91mobiles.com/telugu/lava-yuva-4-pro-5g-to-come-with-50mp-camera-5000mah-battery/ Wed, 24 Jan 2024 18:21:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9910 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ LAVA త్వరలో Yuva 4 Pro 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా 91మొబైల్స్ కి ఈ డివైజ్ కి సంబంధించిన లాంచ్ సమాచారం అందింది. ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఈ వివరాలను అందించారు. అంతేకాదు, టిప్‌స్టర్ సోషల్ మీడియా ద్వారా LAVA Yuva 4 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్, పిక్స్ షేర్ చేశారు. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. LAVA Yuva […]

The post LAVA: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో రానున్న LAVA Yuva 4 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న LAVA Yuva 4 Pro 5G
  • 91మొబైల్స్ కి అందిన లాంచ్ సమాచారం
  • డైమెన్సిటీ 6080 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ LAVA త్వరలో Yuva 4 Pro 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా 91మొబైల్స్ కి ఈ డివైజ్ కి సంబంధించిన లాంచ్ సమాచారం అందింది. ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఈ వివరాలను అందించారు. అంతేకాదు, టిప్‌స్టర్ సోషల్ మీడియా ద్వారా LAVA Yuva 4 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్, పిక్స్ షేర్ చేశారు. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

LAVA Yuva 4 Pro 5G డిజైన్

  • LAVA Yuva 4 Pro 5G డిజైన్ విషయానికి వస్తే, బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో రెండు కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • LAVA Yuva 4 Pro 5G బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో లావా బ్రాండింగ్ ఉంది.
  • LAVA Yuva 4 Pro 5G బ్లూ కలర్ వేరియంట్ పిక్స్ రివీల్ అయ్యాయి. లాంచ్ సమయంలో ఇతర కలర్ ఆప్షన్స్ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
  • LAVA Yuva 4 Pro 5G బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఎలిగంట్ గా ఉంది. భారీ కెమెరా మాడ్యూల్ మధ్యలో 50ఎంపి కెమెరా అని రాసి ఉంది. ఇది ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
  • LAVA Yuva 4 Pro 5G ఓవరాల్ డిజైన్ ప్రీమియమ్ లుక్ ని అందిస్తోంది.

LAVA Yuva 4 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఎక్స్‌క్లూజివ్)

  • ప్రాసెసర్: LAVA Yuva 4 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్: LAVA Yuva 4 Pro 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో లాంచ్ కానుంది. ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: LAVA Yuva 4 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ కానుంది. రెండేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ తో ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కెమెరా: LAVA Yuva 4 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: LAVA Yuva 4 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందో లేదో ఇంకా తెలియదు. త్వరలోనే చార్జింగ్ కెపాసిటీ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
  • కనెక్టివిటీ: LAVA Yuva 4 Pro 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్ వంటి ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.

LAVA Yuva 4 Pro 5G ధర

  • LAVA Yuva 4 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో రూ.10,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ధరకు సంబంధించి త్వరలోనే లావా కంపెనీ నుంచి అధికార ప్రకటన రానుంది.

The post LAVA: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో రానున్న LAVA Yuva 4 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>