LAVA: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో రానున్న LAVA Yuva 4 Pro 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న LAVA Yuva 4 Pro 5G
  • 91మొబైల్స్ కి అందిన లాంచ్ సమాచారం
  • డైమెన్సిటీ 6080 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ LAVA త్వరలో Yuva 4 Pro 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా 91మొబైల్స్ కి ఈ డివైజ్ కి సంబంధించిన లాంచ్ సమాచారం అందింది. ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఈ వివరాలను అందించారు. అంతేకాదు, టిప్‌స్టర్ సోషల్ మీడియా ద్వారా LAVA Yuva 4 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్, పిక్స్ షేర్ చేశారు. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

LAVA Yuva 4 Pro 5G డిజైన్

  • LAVA Yuva 4 Pro 5G డిజైన్ విషయానికి వస్తే, బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో రెండు కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • LAVA Yuva 4 Pro 5G బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో లావా బ్రాండింగ్ ఉంది.
  • LAVA Yuva 4 Pro 5G బ్లూ కలర్ వేరియంట్ పిక్స్ రివీల్ అయ్యాయి. లాంచ్ సమయంలో ఇతర కలర్ ఆప్షన్స్ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
  • LAVA Yuva 4 Pro 5G బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఎలిగంట్ గా ఉంది. భారీ కెమెరా మాడ్యూల్ మధ్యలో 50ఎంపి కెమెరా అని రాసి ఉంది. ఇది ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
  • LAVA Yuva 4 Pro 5G ఓవరాల్ డిజైన్ ప్రీమియమ్ లుక్ ని అందిస్తోంది.

LAVA Yuva 4 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఎక్స్‌క్లూజివ్)

  • ప్రాసెసర్: LAVA Yuva 4 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్: LAVA Yuva 4 Pro 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో లాంచ్ కానుంది. ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: LAVA Yuva 4 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ కానుంది. రెండేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ తో ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కెమెరా: LAVA Yuva 4 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: LAVA Yuva 4 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందో లేదో ఇంకా తెలియదు. త్వరలోనే చార్జింగ్ కెపాసిటీ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
  • కనెక్టివిటీ: LAVA Yuva 4 Pro 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్ వంటి ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.

LAVA Yuva 4 Pro 5G ధర

  • LAVA Yuva 4 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో రూ.10,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ధరకు సంబంధించి త్వరలోనే లావా కంపెనీ నుంచి అధికార ప్రకటన రానుంది.
Previous articleMotorola: జనవరి 30న భారత్‌లో లాంచ్ కానున్న Moto G24 Power
Next articleVivo: ఫిలిప్పైన్స్‌లో Vivo V30 సిరీస్ అఫీషియల్ టీజర్ విడుదల
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.