mobile phone explosion - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Sep 2024 10:47:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/ https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/#respond Thu, 26 Sep 2024 10:47:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=13761 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola స్మార్ట్‌ఫోన్లకు భారతీయ మార్కెట్ లో ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. సరసమైన ధరల్లో అధిక ఫీచర్లను అందిస్తూ, యూజర్లలో మంచి పేరును సంపాదించింది. జనాలు కూడా ఈమధ్య ఈ బ్రాండ్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో ఓ చేదు వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక మోటోరోలా ఫోన్ లో నిప్పులు చెలరేగి దాదాపుగా కాలిపోయింది. ఈ ఫోన్ Motorola G34 అని ప్రాథమికంగా ఒక అంచనాకు […]

The post Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మోటోరోలా ఫోన్ నుంచి మంటలు
  • కాలిపోయిన స్మార్ట్‌ఫోన్
  • Motorola G34 గా నిర్ధారణ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola స్మార్ట్‌ఫోన్లకు భారతీయ మార్కెట్ లో ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. సరసమైన ధరల్లో అధిక ఫీచర్లను అందిస్తూ, యూజర్లలో మంచి పేరును సంపాదించింది. జనాలు కూడా ఈమధ్య ఈ బ్రాండ్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో ఓ చేదు వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక మోటోరోలా ఫోన్ లో నిప్పులు చెలరేగి దాదాపుగా కాలిపోయింది. ఈ ఫోన్ Motorola G34 అని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.

Motorola G34 నుంచి మంటలు

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తాజాగా తన X ఖాతాలో కాలిపోయిన ఫోన్ యొక్క ఫోటోలను షేర్ చేశారు. వాటిని చూస్తే, ఫోన్ చాలా వరకు కాలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఈ ఫోటోల్లో బ్రాండ్ పేరు కనిపించలేదు. కానీ, టిప్‌స్టర్ ఆ ఫోన్ మోటోరోలా జీ34 అని తెలిపారు.

సోషల్ మీడియాలో 4 ఇమేజెస్ షేర్ అయ్యాయి. వాటిని గమనిస్తే, డిస్ప్లే కూడా సెపరేట్ అయినట్లు తెలుస్తోంది.

నిప్పు అంటుకోవడం వల్లన ఫోన్ వెనుక, ముందు వైపున ప్యానెల్స్ డ్యామేజ్ అయ్యాయి. టిప్‌స్టర్ ఈ పోస్ట్‌ను షేర్ చేసిన తర్వాత, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హీటింగ్ ప్రాబ్లెమ్ వల్లన ఫోన్ లో మంటలు చెలరేగి ఉంటాయని అంచనా వేయవచ్చు.

ఈ ఘటన వల్లన ఎవరికైనా గాయాపడ్డారా? బాధితులు ఎవరు అనే విషయాలు ఇంకా తెలియదు.

మోటోరోలా కంపెనీ స్పందన ఏంటి?

మోటోరోలా ఫోన్ యొక్క ఫోటోలు వైరల్ అయ్యాక, బ్రాండ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. తన పోస్ట్ లో మోటోరోలా “మీ భద్రతే మాకు ప్రధానం. మీరు బాగున్నారని ఆశిస్తున్నాం. మీకు సరైన పరిష్కారం అందించేందుకై మీతో కలిసి పని చేస్తాం. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు ఈమెయిల్ ఐడీని ఇవ్వగలరు” అని పేర్కొంది.

గతంలో కూడా పేలిన Motorola G34

గతంలో కూడా మోటోరోలా జీ34 లో మంటలు చెలరేగి, పేలినట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. తన మోటో జీ34 పేలినట్లు రాంబాబు సోలంకి అనే యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో వివరాలను షేర్ చేశారు. అంతేకాదు, పేలుడుకి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. తాను ఫోన్‌ని గత నెలలో కొనుగోలు చేసినట్లు పోస్ట్ లో యూజర్ పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్ పేలకుండా ఏం చేయాలి?

ఫోన్‌ని నేరుగా సూర్యకాంతిలో ఉంచవద్దు. అలాగే వేడిమి ఉన్న ప్రదేశంలో చార్జ్ చేయవద్దు.

రాత్రి వేళ చార్జింగ్ పెట్టి.. అలాగే గంటల తరబడి ఫోన్‌ని వదిలేయవద్దు. అలాగే ఎప్పుడైనా సరే, ఫోన్ 100 శాతం చార్జింగ్ పూర్తయ్యాక వెంటనే ఆఫ్ చేయండి. చార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ వాడకండి.

కంపెనీ అందించిన చార్జర్ మరియు కేబుల్‌ను మాత్రమే వాడండి. థర్డ్ పార్టీ లేదా ఫేక్ బ్యాటరీలు వాడకండి. మీ ఫోన్ గనుక విపరీతంగా వేడెక్కినట్లు అనిపిస్తే, వెంటనే స్విచాఫ్ చేసేయండి.

The post Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/feed/ 0
మొబైల్ ఫోన్ పేలి కేరళలో 8 ఏళ్ళ బాలిక మృతి https://www.91mobiles.com/telugu/mobile-phone-explosion-kerala-8-years-old-girl-dies-while-playing-game/ Tue, 25 Apr 2023 08:05:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=6024 మొబైల్ ఫోన్లు పేలిన సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలతో జనాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఫోన్ ఎప్పుడు పేలుతుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. అయితే ఏ ఫోన్ అయినా సరే అంత ఈజీగా పేలదు. మన పొరబాటు కూడా అందుకు ఎక్కువ శాతం కారణమయ్యే అవకాశాలే ఎక్కువ. మరీ ముఖ్యంగా చార్జింగ్ పెట్టి ఫోన్ ని అస్సలు వాడకూడదు. ఇటీవలె చార్జింగ్ లో ఉన్న ఫోన్ ని ఆపరేట్ చేస్తూ యూపీకి చెందిన ఒక బాలుడు […]

The post మొబైల్ ఫోన్ పేలి కేరళలో 8 ఏళ్ళ బాలిక మృతి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కేరళలో చోటు చేసుకున్న విషాద ఘటన
  • మొబైల్ ఫోన్ పేలి 8 ఏళ్ళ బాలిక దుర్మరణం
  • చార్జింగ్ లో ఉన్నప్పుడు గేమ్స్ ఆడుతుండగా పేలిన ఫోన్

మొబైల్ ఫోన్లు పేలిన సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలతో జనాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఫోన్ ఎప్పుడు పేలుతుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. అయితే ఏ ఫోన్ అయినా సరే అంత ఈజీగా పేలదు. మన పొరబాటు కూడా అందుకు ఎక్కువ శాతం కారణమయ్యే అవకాశాలే ఎక్కువ. మరీ ముఖ్యంగా చార్జింగ్ పెట్టి ఫోన్ ని అస్సలు వాడకూడదు. ఇటీవలె చార్జింగ్ లో ఉన్న ఫోన్ ని ఆపరేట్ చేస్తూ యూపీకి చెందిన ఒక బాలుడు మృతి చెందిన వార్తను మనం చదివాం. ఇప్పుడు ఆ ఘటనను మరవకుండానే, మరొక ఘటన కేరళలో చోటు చేసుకుంది.

కేరళలోని త్రిస్సూరు లో సోమవారం నాడు, అనగా ఏప్రిల్ 24 వ తేదీన ఒక 8 ఏళ్ళ బాలిక ఫోన్ పేలిన ఘటనలో దుర్మరణం పాలైంది. వివరాలు చూస్తే, సదరు బాలిక ఫోన్ చార్జింగ్ లో ఉండగా, గేమ్స్ ఆడుతోందని సమాచారం. అప్పుడు ఉన్నట్లుండి బాలిక చేతిలోనే ఫోన్ పేలింది.

3 వ క్లాసు చదువుతోన్న బాలిక

కేరళ రాష్ట్రం త్రిస్సూరు లోని తిరువిల్వామల లో ఉన్న క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్ లో ఆదిత్యశ్రీ 3 వ క్లాస్ చదువుతోంది. పట్టిపరంబు ప్రాంతంలో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.

తమ నిర్లక్ష్యం వల్లనే తమ పాప ఆదిత్యశ్రీ చనిపోయిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఫలితం అందించని మెరుగైన చికిత్స

మొబైల్ ఫోన్ పేలిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన పాప ఆదిత్యశ్రీ కి సమీపంలోని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఘటన చోటు చేసుకున్నప్పుడు మొబైల్ ఫోన్ చార్జింగ్ లో ఉన్నట్లు సమాచారం. అలాగే ఉంచి మొబైల్ లో గేమ్స్ ఆడటంతో ఫోన్ బాగా వేడెక్కి పేలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

ఘటనపై స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్ టీమ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం మరింత కచ్చితమైన సమాచారం బయటకు రానుంది.

3 ఏళ్ళ క్రితం కొనుగోలు చేసిన ఫోన్

రిపోర్ట్స్ ప్రకారం, పేలిన ఫోన్ ని మూడేళ్ళ క్రితం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాదే ఫోన్ బ్యాటరీని కూడా మార్చినట్లు సమాచారం. ఘటన జరిగినప్పుడు ఆదిత్యశ్రీ తన నానమ్మతో ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారికి ముఖంపై, చేతులపై తీవ్రగాయాలయ్యాయి.

ఏదేమైనా భవిష్యత్తుని మనం ఊహించలేం. కాబట్టి, ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్ ని చార్జింగ్ లో పెట్టి కాల్స్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం లేదా మరేదైనా చెక్ చేయడం చేయకండి. చార్జింగ్ లో ఉన్నప్పుడు కాల్ వస్తే, ముందుగా స్విచ్ ని ఆఫ్ చేసి తర్వాత ఫోన్ ని మీ చేతుల్లోకి తీసుకోండి. పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు చార్జింగ్ ని తొలగించి వారికి ఫోన్ ఇవ్వండి. అలాగే ఫోన్ వేడెక్కేంత వరకు గేమ్స్ ని ఆడకుండా చూసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మొబైల్ ఫోన్ పేలి కేరళలో 8 ఏళ్ళ బాలిక మృతి first appeared on 91Mobiles Telugu.

]]>
ఉత్తరప్రదేశ్ లో మొబైల్ ఫోన్ పేలి 8 నెలల శిశువు మృతి https://www.91mobiles.com/telugu/mobile-phone-blast-infant-died-uttarpradesh-india/ Wed, 14 Sep 2022 08:12:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=2327 హైలైట్స్: బెడ్ పై తన కీ-ప్యాడ్ ఫోన్ ని పెట్టిన తల్లి, ఫోన్ పేలి 8 నెలల చంటిపాప మృతి ఆరు నెలల క్రితం ఫోన్ కొనుగోలు చేసిన మహిళ, ఉబ్బిన బ్యాటరీ నిర్మాణంలో ఉన్న ఇంట్లో నివసిస్తోన్న కుటుంబం, కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో, సోలార్ ప్లేట్స్ మరియు బ్యాటరీల వినియోగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బరేలి జిల్లాలో ఓ తల్లి మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టి బెడ్ పై పెట్టగా, అది […]

The post ఉత్తరప్రదేశ్ లో మొబైల్ ఫోన్ పేలి 8 నెలల శిశువు మృతి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బెడ్ పై తన కీ-ప్యాడ్ ఫోన్ ని పెట్టిన తల్లి, ఫోన్ పేలి 8 నెలల చంటిపాప మృతి
  • ఆరు నెలల క్రితం ఫోన్ కొనుగోలు చేసిన మహిళ, ఉబ్బిన బ్యాటరీ
  • నిర్మాణంలో ఉన్న ఇంట్లో నివసిస్తోన్న కుటుంబం, కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో, సోలార్ ప్లేట్స్ మరియు బ్యాటరీల వినియోగం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బరేలి జిల్లాలో ఓ తల్లి మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టి బెడ్ పై పెట్టగా, అది కాస్తా పేలడంతో ఓ 8 నెలల చంటి పాప మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది. కాగా, ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు సమాచారం. అలాగే పేలుడు జరిగిన సమయంలో ఫోన్ కి సోలార్ ప్యానెల్ ద్వారా చార్జింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫోన్ ని సదరు మహిళ 6 నెలల క్రితం కొనుగోలు చేసిందట. అడాప్టర్ లేకుండా కేవలం యూఎస్బీ కేబుల్ ద్వారా ఫోన్ కి చార్జింగ్ పెట్టినట్లు బాధిత కుటుంబం తెలిపింది.

తల్లిదండ్రుల అశ్రద్ధ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇప్పటికైతే ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ ఘటన ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. “కేసు నమోదు చేసేందుకు బాధిత కుటుంబం నిరాకరించింది. పంచనామా పూర్తయ్యాక బాడీని తల్లిదండ్రులకు అప్పజెప్పాం. మొబైల్ ఫోన్ పేలడం వ్లలనే పాపకు తీవ్రగాయాలై చనిపోయిందని మా విచారణలో తేలింది. ఇది యాక్సిడెంటల్ గా జరిగిన ఘటన కాబట్టి, తాము కేసు పెట్టదలచుకోలేదని బాధిత కుటుంబం తెలిపింది,” అని ఫరీద్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్వో హర్వీర్ సింగ్ అన్నారు.

దుర్ఘటన జరిగినప్పుడు పాప తండ్రి తన పనిలో నిమగ్నమయ్యాడు. తల్లి తన బిడ్డని మంచంపైన పడుకోబెట్టి, మరో పక్కన ఫోన్ చార్జింగ్ పెట్టి వెళ్ళినట్లు సమాచారం. తల్లి మాటల్లో.. నేను పక్కింటి వారితో మాట్లాడుతుండగా, నా కూతురు నందిని సాయం కోసం అరిచింది. మొబైల్ ఫోన్ పేలడం వల్లన మంచం అంతా నిప్పంటుకుంది. నేహ (8 నెలల చిన్నారి) తీవ్రంగా కాలిపోయింది. నా ఫోన్, నా కూతురి ప్రాణాలను తీస్తుందని అస్సలు ఊహించలేదు, లేదంటే ఫోన్ అక్కడ పెట్టే దాన్ని కాదు.

కూలీ పని చేసే పాప తండ్రి నిర్మాణంలో ఉన్న ఇంట్లో తన కుటుంబం తో కలిసి జీవిస్తున్నాడు. ఆ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ లేకపోవడం వల్లన వారు సోలార్ ప్లేట్ మరియు ఒక బ్యాటరీ ఉపయోగించి మొబైల్ ఫోన్లకు చార్జింగ్ పెడుతున్నారు. ఫోన్ బ్యాటరీ ఉబ్బడం కూడా ప్రమాదానికి కారణమైందని చెప్పవచ్చు. ఏ ఫోనైనా సరే బ్యాటరీని గమనిస్తూ ఉండాలి. అది ఉబ్బినట్లు తెలిస్తే, బ్యాటరీ మార్పించడం మంచిది. దాన్ని అలాగే వాడితే బ్యాటరీ తీవ్రస్థాయిలో ఉబ్బి చివరకు పేలే అవకాశముంది. అలాగే కంపెనీ వారు అందించే అడాప్టర్ ద్వారా మాత్రమే చార్జింగ్ పెడితే మంచిది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post ఉత్తరప్రదేశ్ లో మొబైల్ ఫోన్ పేలి 8 నెలల శిశువు మృతి first appeared on 91Mobiles Telugu.

]]>