ఉత్తరప్రదేశ్ లో మొబైల్ ఫోన్ పేలి 8 నెలల శిశువు మృతి

హైలైట్స్:

  • బెడ్ పై తన కీ-ప్యాడ్ ఫోన్ ని పెట్టిన తల్లి, ఫోన్ పేలి 8 నెలల చంటిపాప మృతి
  • ఆరు నెలల క్రితం ఫోన్ కొనుగోలు చేసిన మహిళ, ఉబ్బిన బ్యాటరీ
  • నిర్మాణంలో ఉన్న ఇంట్లో నివసిస్తోన్న కుటుంబం, కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో, సోలార్ ప్లేట్స్ మరియు బ్యాటరీల వినియోగం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బరేలి జిల్లాలో ఓ తల్లి మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టి బెడ్ పై పెట్టగా, అది కాస్తా పేలడంతో ఓ 8 నెలల చంటి పాప మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది. కాగా, ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు సమాచారం. అలాగే పేలుడు జరిగిన సమయంలో ఫోన్ కి సోలార్ ప్యానెల్ ద్వారా చార్జింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫోన్ ని సదరు మహిళ 6 నెలల క్రితం కొనుగోలు చేసిందట. అడాప్టర్ లేకుండా కేవలం యూఎస్బీ కేబుల్ ద్వారా ఫోన్ కి చార్జింగ్ పెట్టినట్లు బాధిత కుటుంబం తెలిపింది.

తల్లిదండ్రుల అశ్రద్ధ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇప్పటికైతే ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ ఘటన ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. “కేసు నమోదు చేసేందుకు బాధిత కుటుంబం నిరాకరించింది. పంచనామా పూర్తయ్యాక బాడీని తల్లిదండ్రులకు అప్పజెప్పాం. మొబైల్ ఫోన్ పేలడం వ్లలనే పాపకు తీవ్రగాయాలై చనిపోయిందని మా విచారణలో తేలింది. ఇది యాక్సిడెంటల్ గా జరిగిన ఘటన కాబట్టి, తాము కేసు పెట్టదలచుకోలేదని బాధిత కుటుంబం తెలిపింది,” అని ఫరీద్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్వో హర్వీర్ సింగ్ అన్నారు.

దుర్ఘటన జరిగినప్పుడు పాప తండ్రి తన పనిలో నిమగ్నమయ్యాడు. తల్లి తన బిడ్డని మంచంపైన పడుకోబెట్టి, మరో పక్కన ఫోన్ చార్జింగ్ పెట్టి వెళ్ళినట్లు సమాచారం. తల్లి మాటల్లో.. నేను పక్కింటి వారితో మాట్లాడుతుండగా, నా కూతురు నందిని సాయం కోసం అరిచింది. మొబైల్ ఫోన్ పేలడం వల్లన మంచం అంతా నిప్పంటుకుంది. నేహ (8 నెలల చిన్నారి) తీవ్రంగా కాలిపోయింది. నా ఫోన్, నా కూతురి ప్రాణాలను తీస్తుందని అస్సలు ఊహించలేదు, లేదంటే ఫోన్ అక్కడ పెట్టే దాన్ని కాదు.

కూలీ పని చేసే పాప తండ్రి నిర్మాణంలో ఉన్న ఇంట్లో తన కుటుంబం తో కలిసి జీవిస్తున్నాడు. ఆ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ లేకపోవడం వల్లన వారు సోలార్ ప్లేట్ మరియు ఒక బ్యాటరీ ఉపయోగించి మొబైల్ ఫోన్లకు చార్జింగ్ పెడుతున్నారు. ఫోన్ బ్యాటరీ ఉబ్బడం కూడా ప్రమాదానికి కారణమైందని చెప్పవచ్చు. ఏ ఫోనైనా సరే బ్యాటరీని గమనిస్తూ ఉండాలి. అది ఉబ్బినట్లు తెలిస్తే, బ్యాటరీ మార్పించడం మంచిది. దాన్ని అలాగే వాడితే బ్యాటరీ తీవ్రస్థాయిలో ఉబ్బి చివరకు పేలే అవకాశముంది. అలాగే కంపెనీ వారు అందించే అడాప్టర్ ద్వారా మాత్రమే చార్జింగ్ పెడితే మంచిది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleSnapdragon 8 Gen 2 ప్రాసెసర్, E6 AMOLED డిస్ప్లే తో రానున్న iQOO 11
Next articleచైనాలో పేలిన Redmi Note 11T Pro (Redmi K50i) ఫోన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.