Moto Edge 50 Neo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 20 Jul 2024 18:29:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Edge 50 Neo https://www.91mobiles.com/telugu/moto-edge-50-neo-to-launch-with-32mp-front-camera-leak/ https://www.91mobiles.com/telugu/moto-edge-50-neo-to-launch-with-32mp-front-camera-leak/#respond Sat, 20 Jul 2024 18:25:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=12596 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto Edge 50 Neo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం 91మొబైల్స్ కి లభించింది. టిప్‌స్టర్ పారస్, Moto Edge 50 Neo యొక్క ఫోన్ మరియు స్పెసిఫికేషన్స్ లాంచ్ కంటే ముందే షేర్ చేశారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. Moto Edge 50 Neo […]

The post Motorola: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Edge 50 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto Edge 50 Neo లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్
  • 6.4-ఇంచ్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto Edge 50 Neo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం 91మొబైల్స్ కి లభించింది. టిప్‌స్టర్ పారస్, Moto Edge 50 Neo యొక్క ఫోన్ మరియు స్పెసిఫికేషన్స్ లాంచ్ కంటే ముందే షేర్ చేశారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

Moto Edge 50 Neo స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Moto Edge 50 Neo లో 6.4-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.

ప్రాసెసర్: Moto Edge 50 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

కెమెరా: Moto Edge 50 Neo లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్, 10ఎంపి థర్డ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Moto Edge 50 Neo లో పవర్ బ్యాకప్ కోసం 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. వాట్ సమాచారం తెలియదు.

ఇతర ఫీచర్లు: Moto Edge 50 Neo డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

బరువు, చుట్టుకొలత: Moto Edge 50 Neo డివైజ్ 154.1 మి.మీ పొడవు, 71.2 మి.మీ వెడల్పు, 8.1 మి.మీ మందం, 171 గ్రాముల బరువు ఉంటుంది.

Moto Edge 50 Neo లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Moto Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. కానీ, యూరోపియన్ రిటైలర్ సైట్ తో పాటు భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Moto Edge 50 Neo కనిపించింది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 91mobiles కి అందిన సమాచారం ప్రకారం, భారత్ లో ఈ ఫోన్ 256జిబి స్టోరేజీ వేరియంట్‌లో కూడా లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

The post Motorola: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Edge 50 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-edge-50-neo-to-launch-with-32mp-front-camera-leak/feed/ 0