Moto G14 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 24 Jul 2023 07:11:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఖరారైన Moto G14 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/moto-g14-launch-date-august-1st-sale-via-flipkart-key-details/ Mon, 24 Jul 2023 07:11:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=7293 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలో Moto G14 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 1 న భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Moto G14 డివైజ్ సేల్ కి రానుంది. లాంచ్ తేదీని ఇదే సైట్ ద్వారా మోటోరోలా కంపెనీ వెల్లడించింది. లాంచ్ తేదీతో పాటు ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Moto G14 స్మార్ట్ ఫోన్ యొక్క […]

The post ఖరారైన Moto G14 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 1 న లాంచ్ కానున్న Moto G14
  • యూనిఎస్ఓసీ టీ616 చిప్‌తో రానున్న డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా Moto G14 డివైజ్ సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలో Moto G14 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 1 న భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Moto G14 డివైజ్ సేల్ కి రానుంది. లాంచ్ తేదీని ఇదే సైట్ ద్వారా మోటోరోలా కంపెనీ వెల్లడించింది. లాంచ్ తేదీతో పాటు ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Moto G14 స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G14 లాంచ్ తేదీ

Moto G14 డివైజ్ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది. లాంచ్ తేదీని ఆగస్టు 1 గా నిర్ణయించారు. ఆగస్టు 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి Moto G14 ని ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. టీజర్ ని బట్టి, Moto G14 ని ప్రీమియమ్, కలర్ఫుల్ డిజైన్ తో తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ లో డివైజ్ కనిపిస్తోంది.

Moto G14 డిజైన్

Moto G14 డిజైన్ గురించి మాట్లాడితే, ఈ డివైజ్ ఫ్లాట్ ప్యానెల్ ని కలిగి ఉంది. ఇందులో పంచ్-హోల్ డిస్ప్లే ఉంది. బ్లూ, బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ని బ్యాక్ ప్యానెల్ పై అందించారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ప్యానెల్ మధ్యలో మోటోరోలా లోగో ఉంది.

Moto G14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G14 లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G14 డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ616 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం.
  • స్టోరేజీ: Moto G14 స్మార్ట్ ఫోన్ లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇందులో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. దీని ద్వారా 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G14 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. మ్యాక్రోవిజన్, నైట్ విజన్ వంటి ఎన్నో ఫీచర్లను ఈ కెమెరాలో అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Moto G14 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సుదీర్ఘ సమయం పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ చెబుతోంది.
  • ఆడియో: Moto G14 లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉంటాయి.
  • ఓఎస్: Moto G14 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 అప్డేట్ తో పాటు, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

The post ఖరారైన Moto G14 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరాతో వస్తోన్న Moto G14; లాంచ్‌కి ముందు రివీలైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/moto-g14-specs-launch-timeline-leaked-before-launch/ Thu, 20 Jul 2023 06:13:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=7256 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారతీయ మార్కెట్ లో మార్చి నెలలో Moto G13 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.9,999 ధరతో వచ్చింది. ఇదిలా ఉండగా, మోటోరోలా సంస్థ Moto G14 ని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే Moto G14 డివైజ్ పలు సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజా లీక్ ద్వారా Moto G14 రెండర్ ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో Moto G14 లుక్, డిజైన్ రివీల్ […]

The post 50MP కెమెరాతో వస్తోన్న Moto G14; లాంచ్‌కి ముందు రివీలైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto G14
  • తాజాగా రివీలైన Moto G14 రెండర్ ఇమేజ్
  • 20 వాట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారతీయ మార్కెట్ లో మార్చి నెలలో Moto G13 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.9,999 ధరతో వచ్చింది. ఇదిలా ఉండగా, మోటోరోలా సంస్థ Moto G14 ని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే Moto G14 డివైజ్ పలు సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజా లీక్ ద్వారా Moto G14 రెండర్ ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో Moto G14 లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి.

ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ప్యానెల్, సన్నని బెజెల్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి రియర్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ధర కూడా మోటో జీ13 మాదిరి తక్కువ బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి Moto G14 డిజైన్, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G14 డిజైన్ (లీక్)

  • ఫ్రంట్ ప్యానెల్: Moto G14 స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లేతో రానుంది. ఈ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. బెజెల్స్ కూడా మూడు వైపులా సన్నగా ఉన్నాయి. బాటమ్ లో చిన్ కనిపిస్తోంది.
  • సైడ్ ఫ్రేమ్: Moto G14 స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ ఎడ్జ్ బాడీని కలిగి ఉంది. లీకైన ఫోటోస్ ని బట్టి, వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున కనిపిస్తున్నాయి. వాల్యూమ్ రాకర్ క్రిందే పవర్ బటన్ ఉంది. Moto G14 స్మార్ట్ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది. ఫోన్ కి బాటమ్ లో యూఎస్బీ పోర్ట్, స్పీకర్ ఉన్నాయి.
  • బ్యాక్ ప్యానెల్: Moto G14 డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది టాప్ రైట్ కార్నర్ లో ఉంది. రెండు కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. ప్యానెల్ కి మధ్య భాగంలో మోటోరోలా బ్రాండింగ్ కనిపిస్తోంది. లీకైన ఫోటోలలో, ఫోన్ బీజ్, బ్లూ, గ్రే మరియు గోల్డ్ కలర్స్ లో కనిపిస్తోంది.

Moto G14 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ప్రాసెసర్: Moto G14 స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం.
  • స్టోరేజీ: Moto G14 డివైజ్ గరిష్టంగా 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
  • బ్యాటరీ: Moto G14 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • చార్జింగ్: Moto G14 స్మార్ట్ ఫోన్ 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

Moto G14 లాంచ్ తేదీ (లీక్)

Moto G14 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ, లీక్స్ నిజమైతే, Moto G14 డివైజ్ ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ లాంచ్ తో పాటు Moto G14 డివైజ్ భారతీయ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టనుంది.

The post 50MP కెమెరాతో వస్తోన్న Moto G14; లాంచ్‌కి ముందు రివీలైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>