
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారతీయ మార్కెట్ లో మార్చి నెలలో Moto G13 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.9,999 ధరతో వచ్చింది. ఇదిలా ఉండగా, మోటోరోలా సంస్థ Moto G14 ని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే Moto G14 డివైజ్ పలు సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజా లీక్ ద్వారా Moto G14 రెండర్ ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో Moto G14 లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి.
ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ప్యానెల్, సన్నని బెజెల్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి రియర్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ధర కూడా మోటో జీ13 మాదిరి తక్కువ బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి Moto G14 డిజైన్, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Moto G14 డిజైన్ (లీక్)
- ఫ్రంట్ ప్యానెల్: Moto G14 స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లేతో రానుంది. ఈ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. బెజెల్స్ కూడా మూడు వైపులా సన్నగా ఉన్నాయి. బాటమ్ లో చిన్ కనిపిస్తోంది.
- సైడ్ ఫ్రేమ్: Moto G14 స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ ఎడ్జ్ బాడీని కలిగి ఉంది. లీకైన ఫోటోస్ ని బట్టి, వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున కనిపిస్తున్నాయి. వాల్యూమ్ రాకర్ క్రిందే పవర్ బటన్ ఉంది. Moto G14 స్మార్ట్ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది. ఫోన్ కి బాటమ్ లో యూఎస్బీ పోర్ట్, స్పీకర్ ఉన్నాయి.
- బ్యాక్ ప్యానెల్: Moto G14 డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది టాప్ రైట్ కార్నర్ లో ఉంది. రెండు కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. ప్యానెల్ కి మధ్య భాగంలో మోటోరోలా బ్రాండింగ్ కనిపిస్తోంది. లీకైన ఫోటోలలో, ఫోన్ బీజ్, బ్లూ, గ్రే మరియు గోల్డ్ కలర్స్ లో కనిపిస్తోంది.
Moto G14 స్పెసిఫికేషన్స్ (లీక్)
- ప్రాసెసర్: Moto G14 స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం.
- స్టోరేజీ: Moto G14 డివైజ్ గరిష్టంగా 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
- బ్యాటరీ: Moto G14 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
- చార్జింగ్: Moto G14 స్మార్ట్ ఫోన్ 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
Moto G14 లాంచ్ తేదీ (లీక్)
Moto G14 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ, లీక్స్ నిజమైతే, Moto G14 డివైజ్ ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ లాంచ్ తో పాటు Moto G14 డివైజ్ భారతీయ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టనుంది.











