Moto G62 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Nov 2022 10:46:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto G62 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/moto-g62-5g-discounts-offers-on-flipkart/ Fri, 04 Nov 2022 10:46:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=3245 హైలైట్స్ ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతోన్న Moto డేస్ సేల్ నవంబర్ 4 నుంచి నవంబర్ 7 వరకు కొనసాగనున్న సేల్ Moto G62 5G పై ఆఫర్లను ప్రకటించిన మోటోరోలా కంపెనీ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో మోటో డేస్ సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ నవంబర్ 4 నుంచి నవంబర్ 7 దాకా కొనసాగుతుంది. సేల్ సందర్భంగా, మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ పై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్స్ పొందవచ్చు. సేల్ […]

The post Moto G62 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతోన్న Moto డేస్ సేల్
  • నవంబర్ 4 నుంచి నవంబర్ 7 వరకు కొనసాగనున్న సేల్
  • Moto G62 5G పై ఆఫర్లను ప్రకటించిన మోటోరోలా కంపెనీ

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో మోటో డేస్ సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ నవంబర్ 4 నుంచి నవంబర్ 7 దాకా కొనసాగుతుంది. సేల్ సందర్భంగా, మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ పై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్స్ పొందవచ్చు. సేల్ లో భాగంగా, మోటోరోలా యొక్క మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Moto G62 5G పై అదిరిపోయే డీల్స్ వచ్చాయి. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇక్కడ మీకోసం Moto G62 5G యొక్క స్పెసిఫికేషన్స్, ఆఫర్స్, డిస్కౌంట్ వివరాలను అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

Moto G62 5G: ఆఫర్స్, డిస్కౌంట్స్

రూ.17,999 ధరతో మోటోరోలా Moto G62 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో కొనసాగుతోన్న మోడో డేస్ సేల్ సందర్భంగా Moto G62 5G స్మార్ట్ ఫోన్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. అలాగే హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ని లాంచ్ ధర కంటే రూ.3,500 తక్కువకే కొనవచ్చన్న మాట. మరింకెందుకు ఆలస్యం మీరు గనుక 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే Moto G62 5G ని ప్రయత్నించవచ్చు.

Moto G62 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సేల్ సందర్భంగా 6జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.15,999 గా పెట్టారు. ఇక 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. ఈ రెండు మోడల్స్ పై హెచ్డీఎఫ్‌సీ కార్డ్ డిస్కౌంట్ అప్లై అవుతుంది. ఇంకా మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ పై అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Moto G62 5G స్పెసిఫికేషన్స్

Moto G62 5G క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వచ్చింది. Moto G62 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

Moto G62 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Moto G62 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. అలాగే వాటర్ మరియు డస్ట్ ఐపీ52 రేటింగ్ తో వస్తోంది. Moto G62 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్ సర్టిఫైడ్ స్టీరియో స్పీకర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Moto G62 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Moto G62 5G లాంచ్: ధర, స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/moto-g62-5g-launched-india-price-specs/ Thu, 11 Aug 2022 10:41:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=1642 హైలైట్స్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అయిన మోటో జీ62 భారత్ లో మోటో జీ62 ధర రూ.17,999 నుంచి ప్రారంభం హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ పై రూ.1,750 డిస్కౌంట్ భారత్ లో మోటో జీ62 ఫోన్ ని మోటోరోలా ఇండియా లాంచ్ చేసింది. గురువారం నాడు కంపెనీ నుంచి మోటో జీ62 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. మోటో జీ సిరీస్ ఫోన్లలో […]

The post Moto G62 5G లాంచ్: ధర, స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అయిన మోటో జీ62
  • భారత్ లో మోటో జీ62 ధర రూ.17,999 నుంచి ప్రారంభం
  • హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ పై రూ.1,750 డిస్కౌంట్

భారత్ లో మోటో జీ62 ఫోన్ ని మోటోరోలా ఇండియా లాంచ్ చేసింది. గురువారం నాడు కంపెనీ నుంచి మోటో జీ62 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. మోటో జీ సిరీస్ ఫోన్లలో దేశంలో ఇది ఏడో ఫోన్ కావడం విశేషం. ఈ ఫోన్ మోటో జీ32 తో దగ్గరి పోలికలను కలిగి ఉంది. కొన్ని రోజుల క్రితమే మోటో జీ32 భారత్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. భారత్ లో మోటో జీ62 ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 5జీ కనెక్టివిటీతో మోటో జీ62 వస్తోంది.

భారత్ లో Moto G62 ధర, బ్యాంక్ ఆఫర్లు, లభ్యత

మోటో జీ62 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. వీటి ధరలు వరుసగా రూ.17,999 మరియు రూ.19,999 గా ఉన్నాయి. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1750 డిస్కౌంట్ లభించనుంది. అలాగే రూ.549 విలువ గల జీ5 ఓచర్, రూ.500 విలువ గల మింత్రా ఓచర్ లభిస్తాయి. ఇవి కొత్త మరియు పాత రిలయన్స్ జియో కస్టమర్లకు వర్తిస్తాయి. ఆగస్టు 19 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు ఆఫ్ లైన్ రిటైలర్స్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

Moto G62 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

మోటో జీ62 స్మార్ట్ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ను అమర్చారు. భారత్ లో ఇది 12 బ్యాండ్స్ లో 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. 6జిబి+128జిబి, 8జిబి+128జిబి వేరియంట్లలో లభిస్తుంది. మోటో జీ62 లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఇందులో ఉన్నాయి.

ఇప్పుడు మోటో జీ62 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్/డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు. ఇది సెంటర్ పంచ్ హోల్ లో ఉండనుంది.

ఇప్పుడు మోటో జీ62 యొక్క బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ నియర్-స్టాక్ ఆండ్రాయిడ్ 12 అనుభూతిని అందిస్తుంది. ఈ ఫోన్లో ఐపీ52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉండటం విశేషం. ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. స్టీరియో ఆడియో డెలివరీ కోసం స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్ ను కలిగి ఉన్నాయి.

The post Moto G62 5G లాంచ్: ధర, స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>