హైలైట్స్
- ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతోన్న Moto డేస్ సేల్
- నవంబర్ 4 నుంచి నవంబర్ 7 వరకు కొనసాగనున్న సేల్
- Moto G62 5G పై ఆఫర్లను ప్రకటించిన మోటోరోలా కంపెనీ

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో మోటో డేస్ సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ నవంబర్ 4 నుంచి నవంబర్ 7 దాకా కొనసాగుతుంది. సేల్ సందర్భంగా, మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ పై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్స్ పొందవచ్చు. సేల్ లో భాగంగా, మోటోరోలా యొక్క మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Moto G62 5G పై అదిరిపోయే డీల్స్ వచ్చాయి. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇక్కడ మీకోసం Moto G62 5G యొక్క స్పెసిఫికేషన్స్, ఆఫర్స్, డిస్కౌంట్ వివరాలను అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.
Moto G62 5G: ఆఫర్స్, డిస్కౌంట్స్
రూ.17,999 ధరతో మోటోరోలా Moto G62 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో కొనసాగుతోన్న మోడో డేస్ సేల్ సందర్భంగా Moto G62 5G స్మార్ట్ ఫోన్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. అలాగే హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ని లాంచ్ ధర కంటే రూ.3,500 తక్కువకే కొనవచ్చన్న మాట. మరింకెందుకు ఆలస్యం మీరు గనుక 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే Moto G62 5G ని ప్రయత్నించవచ్చు.
Moto G62 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సేల్ సందర్భంగా 6జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.15,999 గా పెట్టారు. ఇక 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. ఈ రెండు మోడల్స్ పై హెచ్డీఎఫ్‌సీ కార్డ్ డిస్కౌంట్ అప్లై అవుతుంది. ఇంకా మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ పై అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Moto G62 5G స్పెసిఫికేషన్స్
Moto G62 5G క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వచ్చింది. Moto G62 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
Moto G62 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Moto G62 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. అలాగే వాటర్ మరియు డస్ట్ ఐపీ52 రేటింగ్ తో వస్తోంది. Moto G62 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్ సర్టిఫైడ్ స్టీరియో స్పీకర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












