Moto S30 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 16 Aug 2022 11:54:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto Edge 30 Fusion పేరుతో లాంచ్ కానున్న Moto S30 Pro https://www.91mobiles.com/telugu/moto-s30-pro-as-moto-edge-30-fusion-global-launch/ Tue, 16 Aug 2022 11:54:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=1694 హైలైట్స్: మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ గా గ్లోబల్ ఎంట్రీ ఇవ్వనున్న మోటో ఎస్30 ప్రో, స్పష్టం చేస్తున్న రెండర్స్ కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ హ్యాండ్సెట్ లో ఉంటాయని అంచనా వచ్చే నెలలో గ్లోబల్ గా ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం మోటోరోలా కంపెనీ ఇటీవలె చైనాలో మోటో రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో లతో పాటు, మోటో ఎస్30 […]

The post Moto Edge 30 Fusion పేరుతో లాంచ్ కానున్న Moto S30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ గా గ్లోబల్ ఎంట్రీ ఇవ్వనున్న మోటో ఎస్30 ప్రో, స్పష్టం చేస్తున్న రెండర్స్
  • కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ హ్యాండ్సెట్ లో ఉంటాయని అంచనా
  • వచ్చే నెలలో గ్లోబల్ గా ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం

మోటోరోలా కంపెనీ ఇటీవలె చైనాలో మోటో రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో లతో పాటు, మోటో ఎస్30 ప్రో ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మోటో ఎస్30 ప్రో స్మార్ట్ ఫోన్, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ అనే పేరుతో గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు సమాచారం. చైనా ఎడిషన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్ ఉన్నాయి.

ప్రముఖ టిప్ స్టర్ ఇవాన్ బ్లాజ్ ఎడ్జ్ 30 ఫ్యూజన్ యొక్క రెండర్స్ ని షేర్ చేశాడు. ఇవి అచ్చంగా మోటో ఎస్30 ప్రో ని పోలి ఉన్నాయి. అయితే డిఫరెంట్ బ్రాండింగ్ తో కనిపిస్తున్నాయి. టుండ్రా అనే కోడ్ నేమ్ తో ఈ డివైజ్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ రెండర్స్ మనకు డాల్బీ అట్మాస్, 50ఎంపి లేబుల్ లను చూపుతున్నాయి. ఇక ఈ ఫోన్ 1/1.55 ఇంచ్ సెన్సర్ కలిగి ఉండి, పిక్సెల్ బైనింగ్ సపోర్ట్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)

చైనా మరియు గ్లోబల్ ఎడిషన్స్ మధ్య మార్పు లేకుంటే గనుక, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ లో 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీ డిమ్మింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, అడ్రెనో 660 జీపీయూ, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో ఆప్షన్), 2ఎంపి డెప్త్ సెన్సర్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

ఈ హ్యాండ్సెట్ లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ, వై-ఫై 802.11ఏఎక్స్, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. ఇక ఇతర ఫీచర్లను చూస్తే, ఎడ్జ్ 30 ఫ్యూజన్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, 11-లేయర్ వీసీ కూలింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ52 రేటింగ్, 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Moto Edge 30 Fusion Specs

  • 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 144 రిఫ్రెష్ రేట్/360 టచ్ శాంప్లింగ్ రేట్
  • స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, అడ్రెనో 660 జీపీయూ
  • 12జిబి వరకు ర్యామ్
  • 256జిబి వరకు స్టోరేజీ
  • 50ఎంపి ప్రైమరీ సెన్సర్
  • 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో సెన్సర్
  • 2ఎంపి డెప్త్ సెన్సర్
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

The post Moto Edge 30 Fusion పేరుతో లాంచ్ కానున్న Moto S30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>