Motorola Edge 40 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 15 May 2023 09:54:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న Motorola Edge 40 https://www.91mobiles.com/telugu/motorola-edge-40-india-launch-timeline-tipped/ Mon, 15 May 2023 09:54:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=6302 Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, ఈ ప్రీమియమ్-మిడ్ రేంజ్ ఫోన్ ఈ నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది. Motorola Edge 40 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే మరియు 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని సమాచారం. Motorola Edge 40 […]

The post 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న Motorola Edge 40 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డైమెన్సిటీ 8020 చిప్‌తో రానున్న Motorola Edge 40
  • భారత్ కంటే ముందే గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చిన డివైజ్
  • భారత్ లో Motorola Edge 40 ధర రూ.40,000 గా ఉండే అవకాశం

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, ఈ ప్రీమియమ్-మిడ్ రేంజ్ ఫోన్ ఈ నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది. Motorola Edge 40 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే మరియు 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని సమాచారం.

Motorola Edge 40 ధర (అంచనా)

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ ధర గ్లోబల్ మార్కెట్ లో 599.99 యూరోలు (సుమారు రూ.54,200) గా ఉంది. ఇక భారత్ లో ఈ డివైజ్ ధర దాదాపు రూ.40,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Motorola Edge 40 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.55-ఇంచ్ డిస్ప్లే
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10+, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్

  • డైమెన్సిటీ 8020

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్, మాలి-జీ77 ఎంసీ9 జీపీయూ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ

  • 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్
  • 256జిబి యూఎఫ్ఎస్ 3.1

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 4600 ఎంఏహెచ్

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది. అంతేకాదు, 5 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కనెక్టివిటీ

  • 5జీ, 4జీ వొల్టీ

Motorola Edge 40 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరా, 13 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి కెమెరా ఉంటుంది.

The post 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న Motorola Edge 40 first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 40, డైమెన్సిటీ 1100, 8జిబి ర్యామ్ తో రానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/motorola-edge-40-spotted-geekbench-key-specs-revealed/ Fri, 14 Apr 2023 13:38:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=5892 రీసెంట్ గా Motorola Edge 40 Pro యూరప్ మరియు లాటిన్ అమెరికా మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు Motorola Edge 40 కూడా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ ని తొలుత ప్రైస్‌బాబా గుర్తించింది. సరే, ఈ సర్టిఫికేషన్ ద్వారా తెలిసిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి. Motorola Edge 40 సర్టిఫికేషన్ వివరాలు ఓఎస్ ర్యామ్ ప్రాసెసర్ […]

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 40, డైమెన్సిటీ 1100, 8జిబి ర్యామ్ తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Motorola Edge 40
  • లిస్టింగ్ ప్రకారం 8జిబి ర్యామ్ తో రానున్న డివైజ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్, డైమెన్సిటీ 1100 చిప్ పై పని చేయనున్న ఫోన్

రీసెంట్ గా Motorola Edge 40 Pro యూరప్ మరియు లాటిన్ అమెరికా మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు Motorola Edge 40 కూడా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ ని తొలుత ప్రైస్‌బాబా గుర్తించింది. సరే, ఈ సర్టిఫికేషన్ ద్వారా తెలిసిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

Motorola Edge 40 సర్టిఫికేషన్ వివరాలు

  • ఓఎస్
  • ర్యామ్
  • ప్రాసెసర్

Motorola Edge 40 గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ ఫోన్ ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చే అవకాశం ఉంది.

Motorola Edge 40 హ్యాండ్సెట్ సింగిల్ కోర్ పై 1105 పాయింట్స్, మల్టీ-కోర్ టెస్ట్ లో 3542 పాయింట్లు నమోదు చేసింది. అలాగే ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1100 చిప్సెట్ తో రానుందని రివీల్ అయ్యింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసిన వివరాలు ఇవే. రానున్న రోజుల్లో అధికార సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పడు Motorola Edge 40 అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Motorola Edge 40 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • Motorola Edge 40 డివైజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • Motorola Edge 40 డివైజ్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది.
  • Motorola Edge 40 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1100 చిప్సెట్ వాడనున్నారు. కానీ రిపోర్ట్స్ ప్రకారం, ఈ డివైజ్ డైమెన్సిటీ 8020 చిప్ తో రానుందని తెలుస్తోంది.
  • ఈ చిప్సెట్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ తో రానుంది.
  • Motorola Edge 40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 40, డైమెన్సిటీ 1100, 8జిబి ర్యామ్ తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>