గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 40, డైమెన్సిటీ 1100, 8జిబి ర్యామ్ తో రానున్న డివైజ్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Motorola Edge 40
  • లిస్టింగ్ ప్రకారం 8జిబి ర్యామ్ తో రానున్న డివైజ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్, డైమెన్సిటీ 1100 చిప్ పై పని చేయనున్న ఫోన్

రీసెంట్ గా Motorola Edge 40 Pro యూరప్ మరియు లాటిన్ అమెరికా మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు Motorola Edge 40 కూడా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ ని తొలుత ప్రైస్‌బాబా గుర్తించింది. సరే, ఈ సర్టిఫికేషన్ ద్వారా తెలిసిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

Motorola Edge 40 సర్టిఫికేషన్ వివరాలు

  • ఓఎస్
  • ర్యామ్
  • ప్రాసెసర్

Motorola Edge 40 గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ ఫోన్ ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చే అవకాశం ఉంది.

Motorola Edge 40 హ్యాండ్సెట్ సింగిల్ కోర్ పై 1105 పాయింట్స్, మల్టీ-కోర్ టెస్ట్ లో 3542 పాయింట్లు నమోదు చేసింది. అలాగే ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1100 చిప్సెట్ తో రానుందని రివీల్ అయ్యింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసిన వివరాలు ఇవే. రానున్న రోజుల్లో అధికార సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పడు Motorola Edge 40 అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Motorola Edge 40 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • Motorola Edge 40 డివైజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • Motorola Edge 40 డివైజ్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది.
  • Motorola Edge 40 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1100 చిప్సెట్ వాడనున్నారు. కానీ రిపోర్ట్స్ ప్రకారం, ఈ డివైజ్ డైమెన్సిటీ 8020 చిప్ తో రానుందని తెలుస్తోంది.
  • ఈ చిప్సెట్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ తో రానుంది.
  • Motorola Edge 40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలీకైన OnePlus Pad ధర, ఈ నెలలో సేల్‌కి వచ్చే అవకాశం!
Next articleగీక్ బెంచ్ పై స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో కనిపించిన Vivo Y78+
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.