Motorola Edge 50 Neo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 14:21:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/#respond Mon, 30 Sep 2024 14:21:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13845 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.25,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

ఫోన్ చార్జింగ్ స్పీడ్ చార్జింగ్ టైమ్
రియల్మీ 13+ 80 వాట్ 31 నిమిషాలు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 100 వాట్ 35 నిమిషాలు
రియల్మీ పీ2 ప్రో 80 వాట్ 31 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ 36 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 68 వాట్ 37 నిమిషాలు

 

Realme 13+

Realme 13+ రూ.25,000 లోపు ధరలో లభిస్తోన్న ఒక బెస్ట్-పెర్ఫామింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జర్ తో పాటు వస్తోన్న ఈ ఫోన్ 20 శాతం నుంచి పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం 31 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ 10 గంటల స్కోరు చేసింది.

Realme 13+ లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.22,999, 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 గా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

OnePlus Nord CE4

OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాలు సమయం పట్టింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల స్కోర్ చేసింది.

OnePlus Nord CE4 లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

Realme P2 Pro

Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.25,000 లోపు ధర శ్రేణిలో ఉన్న ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 10 గంటల స్కోర్ చేసింది.

Realme P2 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Realme P2 Pro 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 54 నిమిషాల సమయం పట్టింది. అయితే, చార్జ్ బూస్ట్ ఫీచర్ ఉపయోగిస్తే, 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 9 గంటల 53 నిమిషాలు స్కోర్ చేసింది.

Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 మరియు 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉన్నాయి.

Motorola Edge 50 Neo

Motorola Edge 50 Neo లో 4310 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 37 నిమిషాలు సమయం పట్టింది.

Motorola Edge 50 Neo లో 6.4-ఇంచ్ 1.2కే 120 హెర్ట్జ్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ 8జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999, 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/feed/ 0
Motorola Edge 50 Neo: డైమెన్సిటీ 7300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-launched-india-dimensity-7300-energy-chipset/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-launched-india-dimensity-7300-energy-chipset/#respond Mon, 16 Sep 2024 10:26:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=13502 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 Neo పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఐపీ68 రేటింగ్, MIL810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ రేటింగ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు […]

The post Motorola Edge 50 Neo: డైమెన్సిటీ 7300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Motorola Edge 50 Neo విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
  • ప్రారంభ ధర రూ.23,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 Neo పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఐపీ68 రేటింగ్, MIL810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ రేటింగ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Motorola Edge 50 Neo ధర, సేల్ వివరాలు

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.23,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈరోజు రాత్రి 7 గంటలకు స్పెషల్ సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో ఫోన్2ని కొనుగోలు చేయవచ్చు.

సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా ఆన్‌లైన్ స్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సాధారణ సేల్ మొదలవుతుంది.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ నాటికల్ బ్లూ, లాటే, గ్రిసెల్ మరియు పొయిన్సియానా కలర్స్ లో లబిస్తుంది.

Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లో 6.4-ఇంచ్ వైడ్ సూపర్ హెచ్డీ ఎల్టీపీవో స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 10-బిట్ కలర్స్, పంచ్ హోల్ కటౌట్, మినిమల్ బెజెల్స్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Edge 50 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ730 చిప్సెట్ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Neo డివైజ్‌లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Motorola Edge 50 Neo లో 50ఎంపి అల్ట్రా పిక్సెట్ సోని ఎల్‌వైటీఐఏ 700సీ మెయిన్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి 4కే రికార్డింగ్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 Neo లో పవర్ బ్యాకప్ కోసం 4310 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 68 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ కి 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 5 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి. అంటే 2029 వరకు ఈ ఫోన్‌ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్స్ తో వాడుకోవచ్చన్నమాట.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Neo లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఏఐ స్టైల్ సింక్, ఏఐ మ్యాజిక్ కాన్వాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Motorola Edge 50 Neo: డైమెన్సిటీ 7300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-launched-india-dimensity-7300-energy-chipset/feed/ 0
Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-india-launch-date-confirmed/#respond Mon, 09 Sep 2024 05:49:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13382 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ లో మరొక ఫోన్ తో యూజర్ల ముందుకు రాబోతోంది. Motorola Edge 50 Neo పేరుతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని తాజాగా కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 16వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే ఎడ్జ్ 50 నియో యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. Motorola […]

The post Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎడ్జ్ నియో 50 లాంచ్ తేదీ ప్రకటన
  • సెప్టెంబర్ 16న భారత్‌లో విడుదల
  • ఐపీ68, వీగన్ లెదర్ బ్యాక్, ఎల్టీపీవో

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ లో మరొక ఫోన్ తో యూజర్ల ముందుకు రాబోతోంది. Motorola Edge 50 Neo పేరుతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని తాజాగా కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 16వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే ఎడ్జ్ 50 నియో యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ వివరాలు

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ భారత్ లో సెప్టెంబర్ 16వ తేదీన లాంచ్ అవుతోంది. దీనికి సంబంధించిన టీజర్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోంది.

మోటోరోలా ఎడ్జ్ 50 నియో వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 MIL810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ రేటంగ్ తో రానుండటం విశేషం.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ నాటికల్ బ్లూ, లాటే, గ్రిసైల్ మరియు పొయిన్సియానా కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లో 6.4-ఇంచ్ సూపర్ హెచ్డీ ఎల్టీపీవో స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 10-బిట్ కలర్స్, పంచ్ హోల్ కటౌట్, మినిమల్ బెజెల్స్ ఉంటాయి.

చిప్సెట్: Motorola Edge 50 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Neo డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా: Motorola Edge 50 Neo లో 50ఎంపి అల్ట్రా పిక్సెట్ సోని ఎల్‌వైటీఐఏ 700సీ మెయిన్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి 4కే రికార్డింగ్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 Neo లో పవర్ బ్యాకప్ కోసం 4310 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 68 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కి 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 5 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Neo లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఏఐ స్టైల్ సింక్, ఏఐ మ్యాజిక్ కాన్వాస్ ఉంటాయి.

The post Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-india-launch-date-confirmed/feed/ 0
Motorola Edge 50 Neo: యూకేలో లాంచైన మోటో ఎడ్జ్ 50 నియో, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-launched-in-uk-know-full-details/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-launched-in-uk-know-full-details/#respond Thu, 29 Aug 2024 06:52:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=13231 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 Neo పేరుతో వచ్చిన ఈ ఫోన్ తాజాగా యూకే (యునైటెడ్ కింగ్డమ్/ఇంగ్లండ్) లో లాంచ్ అయ్యింది. అయితే సింగిల్ ర్యామ్, స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Motorola Edge 50 Neo ధర మరియు లభ్యత Motorola Edge 50 […]

The post Motorola Edge 50 Neo: యూకేలో లాంచైన మోటో ఎడ్జ్ 50 నియో, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూకేలో Motorola Edge 50 Neo విడుదల
  • త్వరలో భారత్ లో లాంచ్
  • యూకే మార్కెట్ ధర 449.99 పౌండ్లు

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 Neo పేరుతో వచ్చిన ఈ ఫోన్ తాజాగా యూకే (యునైటెడ్ కింగ్డమ్/ఇంగ్లండ్) లో లాంచ్ అయ్యింది. అయితే సింగిల్ ర్యామ్, స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Motorola Edge 50 Neo ధర మరియు లభ్యత

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధరను యూకే లో 449.99 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు (సుమారు రూ.49,872) గా పెట్టారు.

Motorola Edge 50 Neo డివైజ్ పాయిన్సియానా, లాటే, గ్రిసెయిలె, నాటికల్ బ్లూ అనే మూడు కలర్స్ లో లభిస్తుంది.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానుంది.

Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Neo లో 6.4-ఇంచ్ 1.5కే స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Motorola Edge 50 Neo లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 10ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 Neo లో పవర్ బ్యాకప్ కోసం 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Edge 50 Neo లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Neo లో ఐపీ68 రేటింగ్, ఎంఐఎల్-ఎస్‌టీడీ 810హెచ్ సర్టిఫికేషన్, డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola Edge 50 Neo: యూకేలో లాంచైన మోటో ఎడ్జ్ 50 నియో, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-launched-in-uk-know-full-details/feed/ 0