
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 Neo పేరుతో వచ్చిన ఈ ఫోన్ తాజాగా యూకే (యునైటెడ్ కింగ్డమ్/ఇంగ్లండ్) లో లాంచ్ అయ్యింది. అయితే సింగిల్ ర్యామ్, స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Motorola Edge 50 Neo ధర మరియు లభ్యత
Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధరను యూకే లో 449.99 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు (సుమారు రూ.49,872) గా పెట్టారు.
Motorola Edge 50 Neo డివైజ్ పాయిన్సియానా, లాటే, గ్రిసెయిలె, నాటికల్ బ్లూ అనే మూడు కలర్స్ లో లభిస్తుంది.
Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానుంది.
Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Motorola Edge 50 Neo లో 6.4-ఇంచ్ 1.5కే స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
ప్రాసెసర్: Motorola Edge 50 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా: Motorola Edge 50 Neo లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 10ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 Neo లో పవర్ బ్యాకప్ కోసం 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Motorola Edge 50 Neo లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Neo లో ఐపీ68 రేటింగ్, ఎంఐఎల్-ఎస్‌టీడీ 810హెచ్ సర్టిఫికేషన్, డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











