Motorola G73 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 10:20:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన Motorola G73 5G భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/motorola-g73-5g-india-price-leaked-before-launch/ Mon, 06 Mar 2023 09:49:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=5230 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలోనే భారతీయ మార్కెట్ లో Motorola G73 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Motorola G73 5G భారత్ లో ఈ వారంలో ఎప్పుడైనా లాంచ్ కావొచ్చు. లాంచ్ కి ముందు, ఓ టిప్‌స్టర్ ద్వారా Motorola G73 5G డివైజ్ ధర వివరాలు బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ Debayan Roy తన ట్విట్టర్ హ్యాండిల్ […]

The post లీకైన Motorola G73 5G భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 జనవరి లో యూరోపియన్ మార్కెట్ లో లాంచైన Motorola G73 5G
  • త్వరలో భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్న Motorola G73 5G స్మార్ట్ ఫోన్
  • తాజాగా ఓ టిప్‌స్టర్ ద్వారా లీకైన Motorola G73 5G భారత మార్కెట్ ధర

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలోనే భారతీయ మార్కెట్ లో Motorola G73 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Motorola G73 5G భారత్ లో ఈ వారంలో ఎప్పుడైనా లాంచ్ కావొచ్చు. లాంచ్ కి ముందు, ఓ టిప్‌స్టర్ ద్వారా Motorola G73 5G డివైజ్ ధర వివరాలు బయటకు వచ్చాయి.

ప్రముఖ టిప్‌స్టర్ Debayan Roy తన ట్విట్టర్ హ్యాండిల్ పై Motorola G73 5G ధరను పోస్ట్ చేశాడు. Motorola G73 5G ధర భారత్ లో రూ.16,999 నుంచి రూ.17,999 గా ఉంటుందని టిప్‌స్టర్ రాయ్ తెలిపాడు.

Motorola G73 5G స్పెసిఫికేషన్స్

Motorola G73 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్ తో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ పంచ్ హెల్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.

Motorola G73 5G కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యూనిట్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
Motorola G73 5G లో 3.5 ఎంఎం ఆడియో జాక్ తో పాటు మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డివైజ్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

Motorola G73 5G స్మార్ట్ ఫోన్ లో ఐపీ52 రేటింగ్ అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Motorola G73 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 10 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. అదే రోజున Motorola G73 5G ఫోన్ ధర, లభ్యత వివరాలను కంపెనీ ప్రకటించనుంది.

Motorola G73 5G ధర

భారతీయ మార్కెట్ లో Motorola G73 5G ధర కస్టమర్ కి అందుబాటులోనే ఉండనుంది. ఈ డివైజ్ ధర రూ.16,999 నుంచి రూ.17,999 మధ్య ఉండనుందని టిప్‌స్టర్ చెబుతున్నాడు. అయితే ర్యామ్ మరియు స్టోరేజీ వేరియంట్ ని బట్టి ఈ ఫోన్ ధర మారుతుంది. ప్రస్తుతానికి ఇది టిప్‌స్టర్ ద్వారా లీకైన ధరకు సంబంధించి సమాచారం మాత్రమే. అసలైన ధర తదితర వివరాలు లాంచ్ రోజున వెల్లడి కానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Motorola G73 5G భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 10 న భారత్‌లో లాంచ్ కానున్న Motorola G73 5G https://www.91mobiles.com/telugu/motorola-g73-india-launch-march-10th-specifications/ Thu, 02 Mar 2023 12:17:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=5192 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola భారత్ లో ఒక కొత్త మిడ్-రేంజ్ ఫోన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Motorola G73 5G ఫోన్ త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. మోటోరోలా సంస్థ జీ-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ ని తీసుకొచ్చి చాలా రోజులవుతోంది. ఈ తరుణంలో Motorola G73 5G న్యూస్ బయటకు వచ్చింది. Motorola G72 5G కి సక్సెసర్ గా Motorola G73 5G మార్కెట్ లోకి […]

The post మార్చి 10 న భారత్‌లో లాంచ్ కానున్న Motorola G73 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత మార్కెట్ లో కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనున్న మోటోరోలా
  • మార్చి 10 న భారత్ లో Motorola G73 5G లాంచ్ అవుతుందని సమాచారం
  • Motorola G72 కి సక్సెసర్ గా వస్తోన్న Motorola G73 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola భారత్ లో ఒక కొత్త మిడ్-రేంజ్ ఫోన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Motorola G73 5G ఫోన్ త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. మోటోరోలా సంస్థ జీ-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ ని తీసుకొచ్చి చాలా రోజులవుతోంది. ఈ తరుణంలో Motorola G73 5G న్యూస్ బయటకు వచ్చింది.

Motorola G72 5G కి సక్సెసర్ గా Motorola G73 5G మార్కెట్ లోకి వస్తోంది. లాంచ్ కి ముందు ఫ్లిప్ కార్ట్ Motorola G73 5G ఫోన్ మార్చి 10 న లాంచ్ కానుందన్న విషయాన్ని రివీల్ చేసింది. ఇక ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్స్ లో 2023 జనవరి లో లాంచ్ అయ్యింది.

Motorola G73 5G స్పెసిఫికేషన్స్ (రూమర్లు)

Motorola G73 5G స్మార్ట్ ఫోన్ యూరోపియన్ వేరియంట్ రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అవి: మిడ్నైట్ బ్లూ, లుసెంట్ వైట్. ఈ డివైజ్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. Motorola G72 5G తో పోల్చితే డిస్ప్లే డౌన్‌గ్రేడ్ అనే చెప్పాలి.

Motorola G73 5G డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

Motorola G73 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ లెన్స్, 8ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Motorola G73 5G స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టన్స్ డిజైన్ తో వచ్చింది. Motorola G73 5G లో యూఎస్బీ టైప్ సీ 2.0, బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 161.4 మిల్లీ మీటర్ల పొడవు, 73.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 181 గ్రాముల బరువు ఉంటుంది. యూకే లో ఈ ఫోన్ ధర 310 పౌండ్లు (సుమారు రూ.30,000) గా ఉంది. భారత్ లో Motorola G73 5G ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 10 న భారత్‌లో లాంచ్ కానున్న Motorola G73 5G first appeared on 91Mobiles Telugu.

]]>