మార్చి 10 న భారత్‌లో లాంచ్ కానున్న Motorola G73 5G

Highlights

  • భారత మార్కెట్ లో కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనున్న మోటోరోలా
  • మార్చి 10 న భారత్ లో Motorola G73 5G లాంచ్ అవుతుందని సమాచారం
  • Motorola G72 కి సక్సెసర్ గా వస్తోన్న Motorola G73 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola భారత్ లో ఒక కొత్త మిడ్-రేంజ్ ఫోన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Motorola G73 5G ఫోన్ త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. మోటోరోలా సంస్థ జీ-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ ని తీసుకొచ్చి చాలా రోజులవుతోంది. ఈ తరుణంలో Motorola G73 5G న్యూస్ బయటకు వచ్చింది.

Motorola G72 5G కి సక్సెసర్ గా Motorola G73 5G మార్కెట్ లోకి వస్తోంది. లాంచ్ కి ముందు ఫ్లిప్ కార్ట్ Motorola G73 5G ఫోన్ మార్చి 10 న లాంచ్ కానుందన్న విషయాన్ని రివీల్ చేసింది. ఇక ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్స్ లో 2023 జనవరి లో లాంచ్ అయ్యింది.

Motorola G73 5G స్పెసిఫికేషన్స్ (రూమర్లు)

Motorola G73 5G స్మార్ట్ ఫోన్ యూరోపియన్ వేరియంట్ రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అవి: మిడ్నైట్ బ్లూ, లుసెంట్ వైట్. ఈ డివైజ్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. Motorola G72 5G తో పోల్చితే డిస్ప్లే డౌన్‌గ్రేడ్ అనే చెప్పాలి.

Motorola G73 5G డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

Motorola G73 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ లెన్స్, 8ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Motorola G73 5G స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టన్స్ డిజైన్ తో వచ్చింది. Motorola G73 5G లో యూఎస్బీ టైప్ సీ 2.0, బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 161.4 మిల్లీ మీటర్ల పొడవు, 73.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 181 గ్రాముల బరువు ఉంటుంది. యూకే లో ఈ ఫోన్ ధర 310 పౌండ్లు (సుమారు రూ.30,000) గా ఉంది. భారత్ లో Motorola G73 5G ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్
Next articleమార్చి 7 న లాంచ్ కానున్న Realme C55
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.