Motorola G84 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 31 Aug 2023 05:33:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 సెప్టెంబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్న Moto G54 5G; రివీలైన ధర! https://www.91mobiles.com/telugu/moto-g54-5g-launching-september-1st-price-revealed/ Thu, 31 Aug 2023 05:30:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7812 సెప్టెంబర్ మొదటి వారం మోటోరోలా అభిమానులకు అద్భుతంగా ఉండబోతోంది. Moto G84 5G రేపు అంటే సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ అవుతోంది. మరో కొత్త మొబైల్ Moto G54 5G సెప్టెంబర్ 6న భారతదేశంలో లాంచ్ కానుందని తాజాగా వార్తలు వచ్చాయి. ఇటీవల, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని వివరాలు మోటోరోలా ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ రోజు Moto G54 5G ధర రిలయన్స్ డిజిటల్ ద్వారా వెల్లడైంది. […]

The post సెప్టెంబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్న Moto G54 5G; రివీలైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ మొదటివారంలో లాంచ్ కానున్న 2 మోటోరోలా ఫోన్స్
  • 1 వ తేదీన లాంచ్ అవుతోన్న Moto G84 5G
  • 6 వ తేదీన లాంచ్ కానున్న Moto G54 5G

సెప్టెంబర్ మొదటి వారం మోటోరోలా అభిమానులకు అద్భుతంగా ఉండబోతోంది. Moto G84 5G రేపు అంటే సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ అవుతోంది. మరో కొత్త మొబైల్ Moto G54 5G సెప్టెంబర్ 6న భారతదేశంలో లాంచ్ కానుందని తాజాగా వార్తలు వచ్చాయి. ఇటీవల, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని వివరాలు మోటోరోలా ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ రోజు Moto G54 5G ధర రిలయన్స్ డిజిటల్ ద్వారా వెల్లడైంది.

Moto G54 5G ధర (లీక్)

Moto G54 5G ఫోన్ రిలయన్స్ ఆన్‌లైన్ డిజిటల్ స్టోర్‌లో జాబితా చేయబడింది. ఇక్కడ ఫోన్ యొక్క ర్యామ్ వేరియంట్లు మరియు ధర గురించి సమాచారం వెల్లడైంది. Moto G54 5G రెండు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ. 14,999 మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ. 18,999 గా ఉన్నాయి. విశేషమేమిటంటే, రిలయన్స్ డిజిటల్ యొక్క ఈ జాబితాను మొదట గిజ్మోచైనా గుర్తించింది. అది ఇప్పుడు తీసివేయబడింది.

Moto G54 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Moto G54 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ బీఎక్స్ఎమ్-8-256 జీపీయూ వినియోగిస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G54 5G డివైజ్ 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • ఓఎస్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 అప్డేట్ రెడీ ఫోన్. ఇంకా 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ ఫోన్ కి వస్తాయి.
  • కెమెరా: Moto G54 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
  • బ్యాటరీ: Moto G54 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది టర్బోచార్జ్ టెక్నాలజీతో వస్తోంది. పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
  • ఇతర ఫీచర్లు: Moto G54 5G డివైజ్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లతో వస్తోంది.

The post సెప్టెంబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్న Moto G54 5G; రివీలైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola G84 https://www.91mobiles.com/telugu/motorola-g84-spotted-tdra-website-key-specs/ Wed, 16 Aug 2023 08:45:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=7610 Motorola త్వరలో తన G-సిరీస్‌ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ Motorola G84ని లాంచ్ చేయనుందని సమాచారం. ఫోన్ ప్రస్తుతం TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. దీంతో కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. Moto G84 5G మొదట ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Motorola G84 యొక్క లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. Motorola G84 […]

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola G84 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచ్ కానున్న Motorola G84
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న డివైజ్
  • బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్

Motorola త్వరలో తన G-సిరీస్‌ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ Motorola G84ని లాంచ్ చేయనుందని సమాచారం. ఫోన్ ప్రస్తుతం TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. దీంతో కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. Moto G84 5G మొదట ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Motorola G84 యొక్క లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Motorola G84 టీడీఆర్ఏ లిస్టింగ్

  • TDRA జాబితా ప్రకారం, Motorola యొక్క Moto G84 ఫోన్ XT2347-2 మోడల్ నంబర్‌తో కనిపించింది.
  • ఈ డివైస్‌లో 5జీ టెక్నాలజీ ఉంటుందని సదరు వెబ్‌సైట్ తన లిస్టింగ్ లో వెల్లడించింది.
  • మోడల్ నంబర్, ఫోన్ పేరు మరియు 5G టెక్నాలజీ మినహా ఇతర వివరాలు ఏవీ వెల్లడి కాలేదు.
  • అయితే, ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో మార్కెట్‌లోకి ప్రవేశించగలదని చెప్పబడింది.

Motorola G84 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Motorola G84 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: ఫోన్ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడితే, Qualcomm Snapdragon చిప్‌సెట్ ని ఈ ఫోన్ లో వాడనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
  • స్టోరేజ్: స్టోరేజ్ విషయంలో స్మార్ట్‌ఫోన్ రెండు ఆప్షన్లలో ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇందులో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి.
  • కెమెరా: కెమెరా ఫీచర్‌ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా లెన్స్, 8-మెగాపిక్సెల్ సెకండరీ మరియు 2-మెగాపిక్సెల్ ఇతర లెన్స్ ఇవ్వవచ్చు. అదే సమయంలో, డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా అందిస్తారని సమాచారం.
  • బ్యాటరీ: బ్యాటరీ పరంగా చూస్తే, ఈ డివైజ్ లో 5000mAh బ్యాటరీని ఇవ్వవచ్చు. అయితే ప్రస్తుతం, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి సమాచారం అందలేదు.
  • OS: ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోన్ Android 13 పై పని చేస్తుంది.

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola G84 first appeared on 91Mobiles Telugu.

]]>